జూన్ 24, 2015 న బహిర్గతం కాబోతున్న "చెవ్రోలెట్ 2016 క్రూజ్"

చేవ్రొలెట్ క్రూజ్ కోసం raunak ద్వారా జూన్ 05, 2015 04:34 pm ప్రచురించబడింది

  • 17 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

యునైటెడ్ స్టేట్స్ లో 2016 వ సంవత్సరంలో క్రూజ్ విక్రయానికి సిద్దంగా ఉంది. జనరల్ మోటార్స్ దీని గురించి ఏ రకమైన ప్రణాళికలను బహిర్గతం చేయలేకపోయినప్పటికి భారతదేశంలో ఈ క్రొత్త క్రూజ్ ను ప్రవేశపెట్టనున్నారు. కానీ ప్రస్తుత క్రుజ్ చాలా తక్కువ అమ్మకాలను కలిగి ఉండటం మరియు ఇది 6 సంవత్సరాల నుండి ఇలానే ఉండి. అందుచేత కొన్ని మార్పులతో కొత్త క్రూజ్ ను ప్రవేశపెట్టదలచుకున్నారు.  

జైపూర్: చెవ్రోలెట్ జూన్ 24 న కొత్త క్రూజ్ ను ప్రపంచవ్యాప్తంగా బహిర్గతం చేయదలచుకున్నారు. చేవ్రొలెట్ క్రూజ్ వాహనాన్ని యునైటెడ్ స్టేట్స్ లో 2016 వ సంవత్సరంలో వాటి అమ్మకాలను మొదలుపెట్టదలచుకున్నారు. అంతేకాకుండా, ఇతర ప్రపంచ మార్కెట్లలో కూడా తర్వాత ప్రారంభమవుతుందని హామీ ఇచ్చారు. ఇండియా విషయానికి వస్తే, ఈ 2016 క్రూజ్ వాహనాన్ని ఇండియన్ ఆటో ఎక్స్పోలో ప్రదర్శించనున్నారు. ఎందుచేతనంటే, ప్రస్తుతం ఉన్న మోడల్ పోటీదారులకు గట్టి పోటీను ఇవ్వలేకపోతుంది. ఇప్పుడు రాబోయే కొత్త క్రూజ్ మరిన్ని మార్పులతో మన ముందుకు రాబోతుంది. చెవ్రోలెట్ కొత్త క్రుజ్, పాత నమూనా కంటే తేలికైన మరియు పెద్దగా రాబోతుంది. అంతేకాకుండా, కొత్త పవర్ ట్రైన్లు మరియు కొత్త సాంకేతికత లక్షణాలతో వస్తాయి అంటున్నారు.

జెనరల్ మోటార్స్ వారు కూడా క్రూజ్ గురించి ఈ విధంగా చెప్పారు. క్రూజ్ అనేది ప్రపంచవ్యాప్తంగా చేవ్రొలెట్ బ్రాండ్ లో ఎక్కువగా అమ్ముడుపోయే ఉత్పత్తి, కూజ్ ప్రారంభం నుండి  3.5 మిలియన్ యూనిట్ల కంటే ఎక్కువ వాహనాలు  115 దేశాలలో అమ్ముడయ్యాయి. జనరల్ మోటార్స్, నార్త్ అమెరికా మరియు ప్రపంచ చెవ్రోలెట్ బ్రాండ్ అధ్యక్షుడు అయిన అలాన్ బాటే ఈ విధంగా వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా అనేక కాంపాక్ట్ వాహనాలకు పోటీగా మేము క్రుజ్ ను పరిచయం చేస్తున్నాము అని చెప్పారు.  

కారు యొక్క డిజైన్, ఇంజనీరింగ్ మరియు క్రయవిక్రయాలలో సంఘటికత ద్వారా, అవార్డ్ విన్నింగ్ సెడాన్ అయిన క్రూజ్ ను తయారుచేయగలిగాము. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ వాహన వినియోగదారులందరికి ఆకర్షణీయమైన కారుని పరిచయం చేయబోతున్నాము.     

చెవ్రోలెట్ క్రూజ్ యొక్క అంతర్గత బాగాల గురించి రెండు వారాల క్రితం ఈ విధంగా చెప్పారు. ఈ క్రూజ్ వాహనం మైలింక్ సమాచార వ్యవస్థ తో రాబోతుంది. ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ వంటి వాటిని కూడా కలిగి ఉంది. ఇది 7 అంగుళాల మరియు 8 అంగుళాల యూనిట్ ఎంపికతో రాబోతుంది. 

పిఎస్: చెవ్రోలెట్ ఇప్పటికే చైనీస్ మార్కెట్లో గత ఏడాది కొత్త క్రుజ్ ప్రవేశపెట్టింది, కారు యొక్క ముఖ బాగం, పాత దానితో పోలిస్తే చాలా మార్పు చేయబడి ఉంది. దీని అంతర్గత బాగాల విషయానికి వస్తే, పాత కారు బాగాల వలే ఉన్నాయి. 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన చేవ్రొలెట్ క్రూజ్

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిసెడాన్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience