ఆడీ వారి ఏ3 సెడాన్ యొక్క బేస్ వేరియంట్ ని రూ.25.50 లక్షలకు విడుదల కానుంది

modified on సెప్టెంబర్ 03, 2015 10:35 am by nabeel for ఆడి ఏ3

  • 10 సమీక్షలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: ఆడీ ఇండియా వారి ఏ3 సెడాన్ యొక్క బేస్ వరియంట్ ని ప్రవేశపెట్టనున్నారు. కొత్త ఏ3 40 టీఎఫెసై ప్రీమియం  రూ.25.50 లక్షలకు (ఎక్స్-షోరూం డిల్లీ/ముంబై) కి అందించబడుతుంది. ప్రీమియం ప్లస్ వేరియంట్ రూ.30.2 లక్షల ధర కు అందుబాటులో ఉన్నది ఇప్పుడు పూర్తిగా నిలిపివేయబడింది. అంటే ఇప్పుడు ఏ3 విభాగం లో లభ్యంగా ఉన్న ఒకే ఒక్క పెట్రోల్ వేరియంట్ 40 టీఎఫెసై ప్రీయం గా ఉంది. డీజిల్ ట్రిం కంటే ఈ వాహనం మూడు లక్షల వరకు తక్కువ ధరకే లభిస్తుంది. ఈ భారీ తేడా వలన ఆడీ బేస్ కి మరియూ వారి పోటీదారి మెర్సిడేజ్ సీఎలే మధ్య ధర పరంగా ఎక్కువ తేడా ఉండబోతోంది.

ఈ ధర పడిపోవడం వలన కొన్ని ఉపకరణాలు కూడా కోల్పోతుంది. ముందు వైపు పార్కింగ్ సెన్సర్స్, ఫాగ్ ల్యాంప్స్ మరియూ టైర్ ప్రెజుర్ మానిటరింగ్ సిస్టం ని ఈ కారు కోల్పోయింది. 17 అంగుళాల అల్లాయ్ వీల్స్ బదులు ఇప్పుడు 16 అంగుళాల వీల్స్ ఉన్నాయి. జెనాన్స్ బదులు హాలోజెన్ హెడ్ల్యాంప్స్, ఫుల్ డిస్ప్లే బదులు ఆడియో రెస్పాన్స్ పార్కింగ్ సెన్సర్స్ కేవలం వెనుక వైపు ఉంటాయి.

లెదర్ ప్యాకేజ్, స్టార్ట్-స్టాప్ ఫంక్షన్ మరియూ ఎనర్జీ రికుపరేషన్ అలాగే ఉంటుంది. పైగా, కారు లో టూ-జోన్ ఎయిర్ కండిషనింగ్ తో సన్ సెన్సర్, వెనుక వైపు ఏసీ వెంట్స్, క్రూయిజ్ కంట్రోల్, రఫ్ రైడ్ సస్పెన్షన్, ఆటో రిలీజ్ ఫంక్షన్, మల్టీ-ఫంక్షనల్ లెదర్ స్టీరింగ్ వీల్, లైటింగ్ ప్యాకేజ్ ప్లస్, కొత్త క్రోము ప్యాకేజీ మరియూ డ్రైవర్ ఇంఫొర్మేషన్ సిస్టము అమర్చబడి ఉన్నాయి.

ఈ లక్షణాలకు తోడుగా, కారు లో నవీకరించిన ఇంఫొటెయిన్మెంట్ సిస్టం తో ఆడీ మ్యూజిక్ ఇంటర్ఫేజ్, బ్లూటూత్ ఇంటర్ఫేజ్, ప్యాసివ్ స్పీకర్స్ మరియూ ఎమెమై రేడియో ఉన్నాయి. ఆడీ మ్యూజిక్ యూనిట్ పోర్టబుల్ మీడియా ప్లేయర్స్ ని కనెక్ట్ చేసుకోనే వెసులుబాటు కల్స్పిస్తుంది. ఇందులో కస్టమర్లు వారి వారి ఆల్బంస్ ని ఎంచుకుని వాడుకునేటువంటి ఎమెమై కంట్రోల్స్ ఉన్నాయి.  

ఇంజిను విషయానికి వస్తే, ముందు వైపు వీల్స్ కి శక్తిని అందించే 1.8-లీటర్ పెట్రోల్ మోటర్ దాదాపుగా 178బీహెచ్పీ మరియూ 250ఎనెం యొక్క టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 7-స్పీడ్ డ్యువల్ క్లచ్ ఎస్-ట్రానిక్ గేర్ బాక్స్ ఉంది. ఇది 100 కీ.మీ లను 7.3 సెకనుల్లో చేరుకోగలదు.

కొత్త ఎ3 40 టిఎఫ్ఎస్ఐ ప్రీమియం గురించి ఆడీ ఇండియా అధిపతి మిస్టర్ జో కింగ్ మాట్లాడుతూ " ఈ ఆడీ ఎ3 సె4డాన్ ఒక్క కొత్త యూత్ ఫుల్ డిజైన్ తో రూపొందించబడినది మరియు అధ్బుతమైన సాంకేతిక మరియు విలాశవంతమైన పనితీరు ప్రదర్శన తో కాంపాక్ట్ లగ్జరీ కార్ల సెగ్మెంట్ లో కొత్త ప్రమాణం సెట్ చేసింది. ఇది భారతదేశం లో ఒక సంవత్సరం పూర్తి చేసుకోగానే,ఇటువంటి అద్భుతమైన కారు ని పరిచయం చేసినందుకు మేము కూడా చాలా ఆనందంగా ఉన్నాము. ఈ కారు యొక్క స్పోర్టీ, ప్రోగ్రెసివ్ వంటి కొత్త లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి తదుపరి మరింతగా విస్తరిస్తాయని మేము చాలా నమ్మకంగా ఉన్నాము. ఒక పెట్రోల్ కస్టమర్ ఒకే సమయంలో శక్తి మరియు సామర్థ్యం కూడా కోరుకొనే ఏకైక వినియోగదారుడు. అడీ ఎ3 తో మేము సమర్థవంతంగా అతనికి ఆ రెండూ అందించగలము. ఈ ఎ3 40 టిఎఫ్ఎస్ఐ  180hp శక్తి మరియు 16.6 Kmpl యొక్క ఇంధన సామర్ధ్యమును అందిస్తుంది. ఆడి ఎ3 కాబ్రియోలె భారతదేశపు  అతిపెద్దగా అమ్ముడుపొయే పెట్రోల్ కారు. మేము ఎ3 కాబ్రియోలె(పెట్రోల్ మాత్రమే) యొక్క డిమాండ్ ను చూసి ఆశ్చర్యపోతూ ఉంటాము.వార్షిక కేటాయింపులు అన్నీ అయిపోయాయి. మేము అత్యధికమైన ఉన్నత అంశాల కోసం అభ్యర్ధిస్తున్నాము. ఆడీ ఎ3 40 టిఎఫ్ఎస్ఐ ప్రీమియం దానిని అనుసరిస్తుందని ఆశిస్తున్నాము." అని పేర్కొన్నారు.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన ఆడి ఏ3

Read Full News

trendingసెడాన్

  • లేటెస్ట్
  • ఉపకమింగ్
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience