2023 భారతదేశంలో విడుదలైన 12 ఎలక్ట్రిక్ కార్ల పూర్తి జాబితా
బిఎండబ్ల్యూ ఐ7 కోసం ansh ద్వారా డిసెంబర్ 26, 2023 12:01 pm ప్రచు రించబడింది
- 144 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ ఎంట్రీ లెవల్ ఆఫర్ల నుండి టాప్-ఆఫ్-లైన్ లగ్జరీ మరియు అధిక పనితీరు వరకు అన్ని విభాగాలలో అభివృద్ధి చెందింది
భారతదేశ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. దీనితో, రోజు రోజుకు కొత్త సాంకేతికత మరియు మెరుగైన మౌలిక సదుపాయాలు సృష్టించబడుతున్నాయి. అలాగే, మరిన్ని కార్ల కంపెనీలు కూడా భారతదేశ ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలోకి ప్రవేశించడం ప్రారంభించాయి. ఈ పెరుగుదలకు ఒక ప్రధాన ఉదాహరణ 2023 సంవత్సరంలో భారతదేశంలో వివిధ సెగ్మెంట్లలో 12 ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేశారు. వీటిలో 11 కొత్త మోడళ్లు, కొత్త ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుదారులకు అన్ని ధరలు మరియు ప్రయోజనాల కోసం బహుళ ఎంపికలు ఉన్నాయి. ఈ ఏడాది భారత్లో విడుదల అయిన ఎలక్ట్రిక్ కార్లు ఇవే.
BMW i7
ధర శ్రేణి: రూ.2.03 కోట్ల నుండి రూ.2.50 కోట్లు
2023 లో విడుదల అయిన మొదటి ఎలక్ట్రిక్ కారు BMW యొక్క ఫ్లాగ్షిప్ లగ్జరీ మోడల్. BMW లగ్జరీ ఎలక్ట్రిక్ సెడాన్ ను కొత్త 7 సిరీస్ తో పాటు జనవరి ప్రారంభంలో విడుదల చేశారు. BMW i7 101.7 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ మరియు రెండు పవర్ ట్రెయిన్ ఎంపికలతో పనిచేస్తుంది. M వేరియంట్ 650 PS మరియు 1015 Nm ఉత్పత్తి చేస్తుంది. ఫుల్ ఛార్జ్ చేసే ఈ ఎలక్ట్రిక్ కారు పరిధి 625 కిలోమీటర్లు. BMW i7 విడుదలకి సంబంధించిన సమాచారాన్ని ఇక్కడ చదవండి.
హ్యుందాయ్ అయానిక్ 5
ధర: రూ.45.95 లక్షలు
హ్యుందాయ్ అయానిక్ 5 ను 2023 ఆటో ఎక్స్ పోలో విడుదల చేశారు. భారతదేశంలో హ్యుందాయ్ యొక్క అత్యంత ఖరీదైన కారు ఇది. ఈ ఎలక్ట్రిక్ SUVలో రేర్ వీల్ డ్రైవ్ ఎలక్ట్రిక్ మోటార్ సెటప్ ఉంది, ఇది 72.6 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ నుండి శక్తిని పొందుతుంది. ఇది 217 PS మరియు 350 Nm శక్తిని ఉత్పత్తి చేస్తుంది. హ్యుందాయ్ అయానిక్ 5 ARAI-క్లెయిమ్ పరిధి 631 కిలోమీటర్లు. దీని బ్యాటరీని కేవలం 21 నిమిషాల్లో 0 నుంచి 80 శాతం ఛార్జ్ చేయగలదు. అయానిక్ 5 యొక్క విడుదలకి సంబంధించిన సమాచారాన్ని ఇక్కడ చదవండి.
మహీంద్రా XUV400 EV
ధర శ్రేణి: రూ.15.99 లక్షల నుండి రూ.19.39 లక్షలు
మహీంద్రా ఈ ఏడాది ప్రారంభంలో XUV400 ధరను వెల్లడించారు. దీనిని టాటా నెక్సాన్ EVకి పోటీగా విడుదల చేశారు. మహీంద్రా ఎలక్ట్రిక్ SUV రెండు బ్యాటరీ ప్యాక్ లతో లభిస్తుంది: 34.5 కిలోవాట్ మరియు 39.5 కిలోవాట్లు. దీని పూర్తి ఛార్జ్ పరిధి 456 కిలోమీటర్లు. దీని ఫేస్ లిఫ్ట్ వెర్షన్ వచ్చే ఏడాది విడుదల కానుంది. కొత్త XUV400 EV ప్రత్యేకత ఏంటో తెలుసుకోండి.
సిట్రోయెన్ eC3
ధర శ్రేణి: రూ.11.61 లక్షల నుండి రూ.12.79 లక్షలు
సిట్రోయెన్ eC3 భారత మార్కెట్లో మరొక సరసమైన EV కారు. ఇది C3 హ్యాచ్ బ్యాక్ యొక్క ఎలక్ట్రిక్ వెర్షన్. ఇందులో సిట్రోయెన్ ఎలక్ట్రిక్ మోటారును అందించారు, ఇది 29.2 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ నుండి శక్తిని పొందుతుంది. ఇది 57 PS మరియు 143 Nm శక్తిని ఉత్పత్తి చేస్తుంది. దీని ARAI-పరిధి 320 కిలోమీటర్లు. మీరు eC3 గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే, ఇక్కడ క్లిక్ చేయండి.
MG కామెట్ EV
ధర శ్రేణి: రూ.7.98 లక్షల నుండి రూ.9.98 లక్షలు
టాటా టియాగో EV కంటే చౌకగా లభించే ఎంట్రీ లెవల్ ఎలక్ట్రిక్ కారుగా MG కామెట్ EVని ఈ ఏడాది ప్రారంభంలో విడుదల చేశారు. ఈ సబ్-3m 2-డోర్ ఎలక్ట్రిక్ కారు 17.3 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్తో పనిచేస్తుంది మరియు పూర్తి ఛార్జ్ చేస్తే 230 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటుంది. ఈ చిన్న ఎలక్ట్రిక్ కారు ఫాస్ట్ ఛార్జర్లను సపోర్ట్ చేయదు. 3.3 కిలోవాట్ల ఛార్జర్ ఉన్న దీని బ్యాటరీ ఛార్జ్ కావడానికి 7 గంటల సమయం పడుతుంది. దీని గురించి మరింత తెలుసుకోవడానికి కామెట్ EV విడుదలకి సంబంధించిన సమాచారాన్ని చదవండి.
ఇది కూడా చదవండి: 2024 లో ఇండియాకు రానున్న అన్ని ఎలక్ట్రిక్ వాహనాలు ఇవే
ఆడి Q8 e-ట్రాన్ & Q8 e-ట్రాన్ స్పోర్ట్ బ్యాక్
ధర (Q8 ఈ-ట్రాన్): రూ.1.14 కోట్ల నుంచి రూ.1.26 కోట్లు
ధర (Q8 ఈ-ట్రాన్ స్పోర్ట్బ్యాక్): రూ.1.18 కోట్ల నుంచి రూ.1.31 కోట్లు
ఫేస్ లిఫ్ట్ ఆడి Q8 e-ట్రాన్ కూడా ఈ సంవత్సరం విడుదల చేయబడింది. ఇది SUV మరియు స్పోర్ట్ బ్యాక్ (కూపే-SUV) అనే రెండు బాడీ రకాల్లో లభిస్తుంది. రెండు వెర్షన్లు రెండు బ్యాటరీ ప్యాక్ ఎంపికలతో అందించబడతాయి: 89 కిలోవాట్ మరియు 114 కిలోవాట్, ఈ రెండూ డ్యూయల్-మోటార్ ఆల్-వీల్-డ్రైవ్ సెటప్ను పొందుతాయి. Q8 e-ట్రాన్ పూర్తి ఛార్జ్ చేస్తే 600 కిలోమీటర్ల వరకు సర్టిఫైడ్ పరిధిని కలిగి ఉంటుంది. దీని బ్యాటరీని 10 నుండి 80 శాతం ఛార్జ్ చేయడానికి 31 నిమిషాలు పడుతుంది. ఆడి Q8 e-ట్రాన్ విడుదలకి సంబంధించిన సమాచారాన్ని ఇక్కడ చదవండి.
వోల్వో C40 రీఛార్జ్
ధర: రూ.62.95 కోట్లు
వోల్వో C40 రీఛార్జ్ ఎలక్ట్రిక్ SUVని సెప్టెంబర్ లో విడుదల చేశారు. ఇది XC40 రీఛార్జ్ పై ఆధారపడి ఉంటుంది. ఈ కూపే స్టైల్ ఎలక్ట్రిక్ SUVలో 78 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఉంది. ఇది డ్యూయల్-మోటార్ ఆల్-వీల్ డ్రైవ్ సెటప్ను కలిగి ఉంది, ఇది 408 PS శక్తిని మరియు 660 Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. C40 రీఛార్జ్ గంటకు 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడానికి 4.7 సెకన్లు పడుతుంది మరియు ఫుల్ ఛార్జ్ చేస్తే 530 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటుంది. దీని గురించి మరింత తెలుసుకోవడానికి, C40 రీఛార్జ్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ చదవండి.
టాటా నెక్సాన్ EV ఫేస్ లిఫ్ట్
ధర శ్రేణి: రూ.14.74 లక్షల నుండి రూ.19.94 లక్షలు
టాటా నెక్సాన్ EV 2020 లో మార్కెట్లోకి విడుదలైంది, ఇది ఎలక్ట్రిక్ కార్ మార్కెట్ లో విప్లవాన్ని సృష్టించింది. ఈ ఏడాది ఈ ఎలక్ట్రిక్ SUV ఫేస్ లిఫ్ట్ మోడల్ ను విడుదల చేశారు. నెక్సాన్ EV ఇప్పటికీ రెండు బ్యాటరీ ప్యాక్ ఎంపికలను పొందుతుంది: 30 కిలోవాట్ మరియు 40.5 కిలోవాట్. దీని పూర్తి ఛార్జ్ 465 కిలోమీటర్ల వరకు సర్టిఫైడ్ పరిధిని కలిగి ఉంటుంది. దీని గురించి మరింత తెలుసుకోవడానికి టాటా నెక్సాన్ EV ఫస్ట్ డ్రైవ్ రివ్యూకి సంబంధించిన సమాచారాన్ని ఇక్కడ చదవండి.
మెర్సిడెస్-బెంజ్ EQE SUV
ధర: రూ.1.39 కోట్లు
భారతదేశంలో EV పోర్ట్ ఫోలియోను విస్తరించడానికి, మెర్సిడెస్-బెంజ్ ఈ ఏడాది EQE SUVని విడుదల చేశారు. ఈ ఎలక్ట్రిక్ వాహనంలో 90.56 కిలోవాట్ల బ్యాటరీ మరియు డ్యూయల్-మోటార్ సెటప్ ఉంది, ఇది 408 PS మరియు 858 Nm ఉత్పత్తి చేస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 210 కిలోమీటర్లు మరియు WLTP-సర్టిఫైడ్ పరిధి 550 కిలోమీటర్లు. దీని గురించి మరింత సమాచారం కోసం, దాని విడుదలకు సంబంధించిన సమాచారాన్ని ఇక్కడ చదవండి.
ఇది కూడా చదవండి: భారతదేశంలో విడుదల అయిన కొత్త మెర్సిడెస్-AMG C43 సెడాన్, దీని ధర రూ.98 లక్షలు
BMW iX1
ధర: రూ.66.90 లక్షలు
BMW iX1 2023 అక్టోబర్ లో భారతదేశంలో విడుదల అయింది. ఈ ఎలక్ట్రిక్ SUVని ICE ఆధారిత మోడల్ BMW ఎక్స్ 1 ప్లాట్ ఫామ్ పై నిర్మించారు. ఇందులో 66.4 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఉంది. ఇది డ్యూయల్ ఎలక్ట్రిక్ మోటార్ సెటప్ కలిగి ఉంది, ఇది అన్ని చక్రాలకు శక్తిని సరఫరా చేస్తుంది. ఇది 313 PS మరియు 494 Nm శక్తిని ఉత్పత్తి చేస్తుంది. దీని సర్టిఫైడ్ పరిధి 440 కిలోమీటర్ల వరకు ఉంటుంది. BMW iX1 గురించి మరింత తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
లోటస్ ఎలెట్రె
ధర శ్రేణి: రూ.2.55 కోట్ల నుండి రూ.2.99 కోట్లు
భారత మార్కెట్లోకి ప్రవేశించిన లోటస్ ఈ సంవత్సరం వారి మొదటి కారు అయిన లోటస్ ఎలెట్రె ను భారతదేశంలో విడుదల చేశారు. ఈ హై పెర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ SUVలో 112 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ మరియు రెండు పవర్ట్రెయిన్ ఎంపికలు ఉన్నాయి. దీని పవర్ అవుట్ పుట్ 918 PS మరియు 985 Nm వరకు ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ కారును పూర్తిగా ఛార్జ్ చేస్తే 600 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. దీని గురించి మరింత తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
రోల్స్ రాయిస్ స్పెక్టర్
ధర: భారతదేశంలో అధికారికంగా ఈ కారు విడుదల కాలేదు
రోల్స్ రాయిస్ యొక్క ఈ స్వచ్ఛమైన ఎలక్ట్రిక్ మోడల్ భారతదేశంలో అధికారికంగా విడుదల కాలేదు, కానీ కొంతమంది దీనిని విదేశాల నుండి దిగుమతి చేసుకున్నారు. రోల్స్ రాయిస్ స్పెక్టర్ 700 కిలోల బ్యాటరీ ప్యాక్ తో పనిచేస్తుంది, ఇది 100 కిలోవాట్ల శక్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది 595 PS శక్తిని మరియు 900 Nm టార్క్ ను ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ మోటారుతో పనిచేస్తుంది. ఇది WLTP-సర్టిఫైడ్ పరిధి 520 కిలోమీటర్లు. ఎలక్ట్రిక్ రోల్స్ రాయిస్ గురించి ఇక్కడ వివరంగా చదవండి.
మరింత చదవండి : i7 ఆటోమేటిక్
0 out of 0 found this helpful