మార్కెట్ؚలో అత్యధిక మైలేజ్‌ను అందించే 10 ఉత్తమ EV వాహనాలు
మెర్సిడెస్ ఈక్యూఎస్ కోసం shruti ద్వారా మే 03, 2023 02:52 pm ప్రచురించబడింది
- 25 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ధర అడ్డంకి కాకపోతే, వేర్వేరు రీచార్జ్ సమయాలను కలిగి ఉన్న వాహనాలలో అధిక మైలేజ్ ను అందించగల EVల వివరాలను క్రింద అందించబడ్డాయి.
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణ నెమ్మదిగా, స్థిరంగా ఉన్నపటికి, అనేక వాహన తయారీదారులు నెమ్మదిగా తమ ఎలక్ట్రిక్ కార్‌ల పరిధిని విస్తరిస్తున్నాయి. పెరిగిన స్థానికీకరణ మరియు మరింత ఇంధన సామర్ధ్య సాంకేతికత వలన EVల ఇన్ؚపుట్ ధరలు తగ్గుతున్నాయి, పరిధి మరియు ధరల అందుబాటుల నిష్పత్తి సరైన స్థాయిలో ఉంటాయని మనం ఆశించవచ్చు. అప్పటి వరకు, భారతదేశంలో గరిష్ట పరిధిని అందిస్తున్న 10 ఉత్తమ ఎలక్ట్రిక్ కార్‌ల వివరాలు కింద అందించబడ్డాయి:
మోడల్ పేరు |
క్లెయిమ్ చేసిన పరిధి |
మెర్సిడెస్-బెంజ్ EQS |
857కిమీ |
కియా EV6 |
708కిమీ |
BMW i7 |
625కిమీ |
హ్యుందాయ్ అయోనిక్ 5 |
631 కిమీ |
BMW i4 |
590 కిమీ |
BYD అట్టో 3 |
521 కిమీ |
ఆడి e-ట్రాన్ GT |
500 కిమీ |
ఆడి e-ట్రాన్ (SUV) |
484 కిమీ |
జగ్వార్ I-పేస్ |
470 కిమీ |
MG ZS EV |
461 కిమీ |
మెర్సిడెస్-బెంజ్ EQS
క్లెయిమ్ చేసిన పరిధి : 857కిమీ
-
మెర్సిడెస్-బెంజ్ 400V ఎలక్ట్రిక్ట్ ఆర్కిటెక్చర్ؚను ఉపయోగిస్తుంది. అంతేకాకుండా, బ్యాటరీ 10 సంవత్సరాలు లేదా 250,000 కిమీ వారెంటీతో వస్తుంది.
-
EQSను 107.8kWh బ్యాటరీ ప్యాక్ؚతో అందిస్తున్నారు మరియు ఇది 857కిమీ పరిధిని అందిస్తుంది.
కియా EV6
క్లెయిమ్ చేసిన పరిధి: 708కిమీ
- EV6 77.4 kWh బ్యాటరీ ప్యాక్ؚతో వస్తుంది మరియు ఒక ఛార్జింగ్ؚతో 708 కిమీ మైలేజ్‌ను అందిస్తుంది.
- కియా EV6 GTను లైన్ మరియు GT లైన్ AWD అనే రెండు వేరియెంట్ؚలలో అందిస్తుంది.
- AWD వేరియెంట్ 325PS మరియు 605Nm పీక్ అవుట్ؚపుట్ అందించే రెండు ఎలక్ట్రిక్ మోటార్‌లను ఉపయోగిస్తుంది. EV6 AC మరియు DC ఫాస్ట్ ఛార్జింగ్ రెండిటికీ మద్దతు ఇస్తుంది (100kW కంటే ఎక్కువ)
హ్యుందాయ్ అయానిక్ 5
క్లెయిమ్ చేసిన పరిధి: 631km
-
అయోనిక్ 5, 217PS పవర్ మరియు 350 Nm టార్క్‌ను అందించే ఏకైక మోటార్ؚతో జోడించిన 72.5kWh బ్యాటరీ ప్యాక్ؚతో వస్తుంది.
-
ఇది ARAI క్లెయిమ్ చేసిన 631కిమీ పరిధిని అందిస్తుంది.
-
WLTP ప్రకారం, అయోనిక్ 5 యూజర్‌లు 100 కిమీ పరిధిని పొందటానికి తమ వాహనాన్ని కేవలం ఐదు నిమిషాలు ఛార్జ్ చేయవలసి ఉంటుంది.
BMW i7
క్లెయిమ్ చేసిన పరిధి : 625కిమీ
-
BMW I7 Xడ్రైవ్ 60 మోడల్ؚలో ఆకట్టుకునే 544hp మరియు 745NM టార్క్ అవుట్ؚపుట్ؚను ప్రతి ఆక్సిల్‌పై అందించే రెండు ఎలక్ట్రిక్ మోటార్‌లను కలిగి ఉంటుంది.
-
BMW ప్రకారం, i7 0-100kphని 4.7 సెకన్‌లలో అందుకుంటుంది మరియు దీని గరిష్ట వేగ పరిమితి 239kph.
-
ఎలక్ట్రిక్ 7 సీరీస్ AC సిస్టమ్‌పై 11kW వరకు మరియు DC సిస్టమ్‌పై 195kW వరకు ఛార్జ్ అవ్వగలదు.
BWM i4
క్లెయిమ్ చేసిన పరిధి : 590కిమీ
-
BMW i4 రెండు బ్యాటరీ ప్యాక్ ఎంపికలు – 80kWh బ్యాటరీ ప్యాక్ మరియు చిన్నదైన 63 kWh బ్యాటరీ ప్యాక్ؚను కలిగి ఉంటుంది.
-
i4లో రేర్ ఆక్సిల్ؚకు ఏకైక ఎలక్ట్రిక్ మోటార్ అమరిక ఉంటుంది మరియు ప్రతి ఆక్సిల్ؚకు ఒకొక్క మోటార్‌తో డ్యూయల్ మోటార్ సెట్అప్ؚను కలిగి ఉంటుంది.
-
ఇది డ్యాష్‌బోర్డుపై వంపు తిరిగిన ఇంటిగ్రేటెడ్ డిస్ప్లేలతో సహా 3 సీరీస్ ఏకరితి ఫీచర్‌ల సెట్‌పై ఆధారపడుతుంది.
BYD అట్టో 3
క్లెయిమ్ చేసిన పరిధి: 521కిమీ
-
అట్టో 3లో, BYD బ్లేడ్ బ్యాటరీ సాంకేతికతతో 60.48kWh బ్యాటరీ ప్యాక్ కలిగి ఉంటుంది.
-
ఫ్రంట్-వీల్ డ్రైవ్ అట్టో 3 శాశ్వత మాగ్నెట్ సింక్రోనస్ ఎలక్ట్రిక్ మోటార్ؚతో నడుస్తుంది, ఇది 204hp మరియు 310Nm టార్క్‌ను అందిస్తుంది. 80kW DC ఫాస్ట్ ఛార్జర్ؚను ఉపయోగించి దీన్ని 80% వరకు కేవలం 50 నిమిషాలలో ఛార్జ్ చేయవచ్చు.
ఆడి e-ట్రాన్ GT
క్లెయిమ్ చేసిన పరిధి : 500కిమీ
-
e-ట్రాన్ GT ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌లో రెండు ఎలక్ట్రిక్ మోటార్‌లు (ఒకటి ముందు, ఒకటి వెనుక) ఉంటాయి. 93kWh బ్యాటరీ ప్యాక్ؚతో, ఆడి e-ట్రాన్ GT ఒక ఛార్జ్‌తో(ARAI ప్రకారం) 500కిమీ కంటే ఎక్కువ పరిధిని అందిస్తుంది.
-
637hp మరియు 830Nm టార్క్ؚను అందించే స్పోర్టీయర్ RS e-ట్రాన్ GT వేరియంట్ కూడా ఉంది మరియు ఇది 481కిమీ పరిధిని అందిస్తుంది.
ఆడి e-ట్రాన్ (SUV)
క్లెయిమ్ చేసిన పరిధి : 484కిమీ వరకు
-
ఆడి నుండి వస్తున్న మొదటి ఎలెక్ట్రిక్ వాహనం e-ట్రాన్ SUV, 95kWh బ్యాటరీ ప్యాక్ؚతో భారతదేశంలో ఒకే ఒక వేరియెంట్ؚగా అందించబడుతుంది.
-
ఈ వాహనం డ్యూయల్ ఎలక్ట్రిక్ మోటార్ సెట్అప్ కలిగి ఉంది, అత్యధిక సామర్ధ్యంతో 408PS పవర్ మరియు 664Nm టార్క్‌ను అందిస్తుంది.
-
విభిన్న కూపే-స్టైల్ బాడీ షేప్ ఎంపికలు కూడా అందుబాటులో ఉన్నాయి, e-ట్రాన్ స్పోర్ట్ؚబ్యాక్. ఇది ఈ సంవత్సరం చివరిలో నవీకరణకు సిద్దామవుతుంది.
జగ్వార్ I-పేస్
క్లెయిమ్ చేసిన పరిధి : 470కిమీ
-
జాగ్వార్ I-పేస్ పూర్తి ఎలక్ట్రిక్ SUV, ఇది 90 kWh బ్యాటరీ ప్యాక్, డ్యూయల్ ఎలక్ట్రిక్ మోటార్‌లు మరియు 394 hp మరియు 696 Nm టార్క్ అవుట్ؚపుట్ కలయికతో వస్తుంది.
-
ఇది భారతదేశంలో ప్రవేశించిన స్పోర్టీ మరియు లగ్జరీ ఎలక్ట్రిక్ SUVలలో ఇది మొదటిది మరియు ఈ విభాగంలో దీని డిజైన్ కారణంగా ప్రత్యేకంగా నిలుస్తుంది.
MG ZS EV
క్లెయిమ్ చేసిన పరిధి : 461కిమీ
-
MG ZS EV కాంపాక్ట్ SUV విభాగంలో నిలుస్తుంది, ఇది 44.5 kWh బ్యాటరీ ప్యాక్ؚతో 143 hp మరియు 353 Nm టార్క్ؚను అందించే ఏకైక ఎలక్ట్రిక్ మోటార్ؚతో వస్తుంది.
-
ఈ జాబితాలోని అత్యంత చవకైన ఎంపిక MG లైన్అప్ నుండి వస్తుంది, భారతదేశంలో మొదట విడుదల అయినప్పటి నుండి ఎక్కువ శ్రేణిని అందించడానికి ఈ లైన్అప్ ఇటీవల నవీకరించబడింది.
ఇక్కడ మరింత చదవండి : EQS ఆటోమ్యాటిక్