2023 మెర్సిడెస్-బెంజ్ GLC Vs ఆడి Q5, BMW X3, వోల్వో XC60: ధరల పోలిక
మెర్సిడెస్ జిఎల్సి కోసం shreyash ద్వారా ఆగష్టు 11, 2023 07:27 pm ప్రచురించబడింది
- 41 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ప్రస్తుతం 2023 GLC ధర రూ.11 లక్షలు వరకు అధికంగా ఉంది
రెండవ-జనరేషన్ మెర్సిడెస్-బెంజ్ GLC భారతదేశంలో విడుదలైంది, దీని ధర ప్రస్తుతం రూ.73.5 లక్షల (ఎక్స్-షోరూమ్ పాన్-ఇండియా) నుండి ప్రారంభం అవుతుంది. నాజూకైన స్టైలింగ్ؚతో పాటు, కొత్త మెర్సిడెస్ బెంజ్ GLC మునపటి పవర్ؚట్రెయిన్ ఎంపికలను కొనసాగిస్తుంది, అయితే ప్రస్తుతం మైల్డ్-హైబ్రిడ్ సాంకేతికతను పొందింది.
ఈ అప్‌డేట్‌తో, 2023 GLC ఆడి Q5, BMW X3 మరియు వోల్వో XC60లతో పోటీలో నిలుస్తుంది. పోటీదారులతో పోలిస్తే కొత్త GLC ధర ఎలా ఉందో ఇప్పుడు పరిశీలిద్దాము.
ధర తనిఖీ
మెర్సిడెస్ బెంజ్ GLC |
ఆడి Q5 |
BMW X3 |
వోల్వో XC60 |
|
|
|
B5 అల్టిమేట్ – రూ. 67.50 లక్షలు |
Xడ్రైవ్20d – రూ. 68.50 లక్షలు |
|
||
టెక్నాలజీ – రూ. 68.22 లక్షలు |
|
||
|
xడ్రైవ్20d M స్పోర్ట్ – రూ. 70.90 లక్షలు |
||
GLC 300 – రూ. 73.5 లక్షలు |
|
||
GLC 220d – రూ. 74.5 లక్షలు |
|||
|
xడ్రైవ్ M40i – రూ. 87.70 లక్షలు |
అన్నీ ఎక్స్-షోరూమ్ ఢిల్లీ ధరలు
ముఖ్యాంశాలు
-
కొత్త GLC దాని మునపటి వర్షన్ కంటే రూ.11 లక్షలు ఎక్కువ ధరతో వస్తుంది, ఈ విభాగంలో అత్యధిక ప్రారంభ ధరను కలిగి ఉంది. దీని పోటీదారులు – ఆడి A5, వోల్వో XC60, BMW X3ల ధరలు (M40i వేరియెంట్ మినహా) – 2023 GLC కంటే తక్కువగా ఉన్నాయి.
-
ఆడి Q5 టాప్-స్పెక్ టెక్నాలజీ వేరియెంట్‌ను సంబంధిత రేంజ్-టాపింగ్ GLC 220d 6 లక్షల కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.
-
ఈ పోలికలోని ఇతర మోడల్‌ల విధంగా కాకుండా, వోల్వో XC60 సింగిల్, ఫుల్లీ లోడెడ్ వేరియెంట్ؚగా అందించబడుతుంది, దీని ధర రూ. 67.50 లక్షలుగా ఉంది, కొత్త GLC కంటే దీని ధర సుమారు రూ.7 లక్షలు తక్కువ.
-
2023 GLC మునపటి 2-లీటర్‌ల 4-సిలిండర్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్‌ను నిలుపుకుంది, దీన్ని ప్రస్తుతం మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీతో అనుసంధానించబడింది. పెట్రోల్ పవర్‌ట్రెయిన్ 258PS మరియు 400Nm టార్క్‌ను అందిస్తుండగా. డీజిల్ ఇంజన్ 197PS మరియు 440Nm టార్క్‌ను అందిస్తుంది. రెండు ఇంజన్‌లు 9-స్పీడ్ ఆటోమ్యాటిక్ ట్రాన్స్ؚమిషన్ؚతో జోడించబడాయి మరియు ఆల్-వీల్-డ్రైవ్ ప్రామాణిక ఫీచర్‌గా వస్తుంది.
-
మెర్సిడెస్ GLC పెట్రోల్ ఇంజన్ మరియు డీజిల్ ఇంజన్ వరుసగా 19.4kmpl 14.7kmpl మైలేజ్‌ను అందిస్తున్నాయి, ఇక్కడ పేర్కొన్న పోటీదారుల కంటే ఇవి అధికం.
-
వోల్వో, XC60ను 2-లీటర్‌ల టర్బో పెట్రోల్ ఇంజన్ؚతో – మరియు మైడ్-హైబ్రిడ్‌టెక్‌తో అందిస్తుంది – ఇది 250PS మరియు 350Nm టార్క్‌ను అందిస్తుంది. ఇక్కడ 48V మైల్డ్-హైబ్రిడ్ సెట్అప్ؚతో ఉన్న రెండు వాహనాలు మెర్సిడెస్-బెంజ్ GLC మరియు వోల్వో XC60 మాత్రమే.
-
మరొక వైపు, ఆడి Q5 2-లీటర్ 4-సిలిండర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ؚను కలిగి ఉంది, ఇది 249PS మరియు 370Nm టార్క్‌ను అందిస్తుంది. ఈ ఇంజన్ 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్ؚమిషన్ؚతో (DCT) జోడించబడింది మరియు నాలుగు వీల్స్ؚకు శక్తిని అందిస్తుంది.
ఇది కూడా చూడండి: 530 కిలోమీటర్‌ల పరిధితో వోల్వో C40: ఆగస్ట్ؚలో విడుదల కానుంది
-
వీటన్నిటిలో BMW X3 M40i అత్యంత ఖరీదైనది, దీని ధర రూ.87.70 లక్షలు, ఇది X3కి స్పోర్టియర్ వర్షన్ మరియు 360PSని అందించే 3-లీటర్ ఇన్ؚలైన్ టర్బో-పెట్రోల్ ఇంజన్ؚతో వస్తుంది, అందువలన ఈ పోలికలో అత్యంత శక్తివంతమైనది కూడా అయ్యింది.
-
X3 రెగ్యులర్ వేరియెంట్ؚలు 2-లీటర్‌ల డీజిల్ ఇంజన్ؚను ఉపయోగిస్తాయి, ఇవి 190PS మరియు 400Nm టార్క్‌ను అందిస్తాయి. ఈ ఇంజన్ 8-స్పీడ్ ఆటోమ్యాటిక్ ట్రాన్స్ؚమిషన్ؚతో జోడించబడింది, ఆల్-వీల్-డ్రైవ్ ప్రామాణికంగా ఉంటుంది.
ఇది కూడా చూడండి: భారతదేశంలో రూ.86.50 లక్షలకు X3 M40iను విడుదల చేసిన BMW
-
2023 GLC పోర్ట్రైట్-స్టైల్ 11.9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్ మరియు 12.3-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లేలతో వస్తుంది. ఇది ఏడు ఎయిర్ బ్యాగ్ؚలు, 360-డిగ్రీల కెమెరా, TPMS మరియు అడ్వాన్సెడ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ؚను (ADAS) కూడా పొందింది.
-
GLC తరువాత వోల్వో XC60 మాత్రమే ADAS ఫీచర్‌లను అందిస్తుంది. అయితే, దీని 9-అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ ఈ విభాగంలోనే చిన్నది.
-
ఆడిలో పెద్దదైన 10.1-అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ ఉంది. ఇది కూడా 3-జోన్ క్లైమేట్ కంట్రోల్, ఆంబియంట్ లైటింగ్, వైర్ؚలెస్ ఫోన్ ఛార్జర్ మరియు క్రూయిజ్ కంట్రోల్ؚతో వస్తుంది.
-
ఈ పోలికలోని నాలుగు SUVలు 12.3-అంగుళాల డ్రైవర్ డిస్ప్లేను కలిగి ఉన్నాయి. అయితే, కొత్త GLC మరియు వోల్వో XC60 మాత్రమే 360-డిగ్రీల కెమెరాతో వస్తాయి. అదనంగా మెర్సిడెస్ SUV “పారదర్శక బోనెట్” ఫీచర్‌ను కలిగి ఉంది, ఇది బోనెట్ క్రింద ఉన్న నేలను చూపుతుంది, అపరిచిత పరిస్థితులలో ఆఫ్-రోడ్ ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ ఫీచర్ సహాయకరంగా ఉంటుంది.
ఇక్కడ మరింత చదవండి: GLC ఆటోమ్యాటిక్
0 out of 0 found this helpful