ఆడీ ఏ6 ఫేస్లిఫ్ట్ రూ.49.5 లక్షల ధరకి విడుదల అయ్యింది
ఆడి ఏ6 2015-2019 కోసం అభిజీత్ ద్వారా ఆగష్టు 20, 2015 02:24 pm సవరించబడింది
- 13 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్: ఆడీ వారి ఏ6 ఫేస్లిఫ్ట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న తరుణంలో ఈరోజు రూ.49.5 లక్షల ధరకి విడుదల చెయ్యడం జరిగింది (ఎక్స్-షోరూం డిల్లీ). ఈ వాహనం అధికారికంగా అక్టోబరు 2014 ప్యారిస్ మోటర్ షో లో ఆవిష్కరించడం అయ్యింది. ఇది బయట మరియూ లోపల కూడా మార్పులతో వస్తోంది కానీ సాకేతికంగా ఎటువంటి మార్పులు పొందలేదు. ఈ పునరుద్దరించిన ఏ6 కి పోటిగా బీఎండబ్ల్యూ 5-సీరీస్, మెర్సిడెజ్-బెంజ్ ఈ-క్లాస్ మరియూ జాగ్వార్ ఎక్సెఫ్ ఉన్నాయి. ధర పరంగా, ఇది ఇంతకు మునుపటి దాని కంటే కొంచం ఎక్కువగా ఉంది.
మార్పుల గురించి మాట్లాడుతూ, 2015 ఏ6 కి వంపు కలిగిన బంపర్లు మరియూ కొత్త సింగల్-ఫ్రేము కలిగిన గ్రిల్లు ఉన్నాయి. ఈ సలూన్ కి మాట్రిక్స్ ఎలీడీ హెడ్లైట్స్ తో పాటుగా పునరుద్దరించిన ఎలీడీ టెయిల్ ల్యాంప్స్ అమర్చారు. సైడ్ ప్రొఫైల్ చూసినట్టు అయితే, కొత్త అల్లోయ్ వీల్స్ తప్పించి ఎటువంటి మార్పులు లేవు. లోపల వైపున, కొత్త సీటు కవర్లు మరియూ పూతలు తో పాటుగా నూతన ఆడీ యొక్క ఎమెమై ఇంఫొటెయిన్మెంట్ సిస్టము ఉన్నాయి
అంతర్జాతీయంగా, ఏ6 ఫేస్లిఫ్ట్ కి టీఎఫెసై మరియూ టీడీఐ ఇంజిన్లు అమర్చారు. కాకపోతే, భారతదేశం లో ఆడీ వారు క్యూ3 కి ఉంచినట్టుగానే ప్రస్తుతం ఉన్న ఇంజిన్లు ఉంచుతోంది. అదే 2.0-లీటర్ టీఎఫెసై పెట్రోల్ తో పాటుగా 2.0-లీటర్ టీడీఐ డీజిల్ ఇంజిను తో రాబోతోంది. ఈ 2.0-లీటరు 35 టీఎఫెసై పెట్రోల్ ఇంజిను 4000-6000ఆర్పీఎం వద్ద 177బీహెచ్పీ శక్తిని మరియూ 1500-3900ఆర్పీఎం వద్ద 320ఎనెం యొక్క టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. మరోపక్క, 2.0-లీటరు 35 టీడీఐ దాదాపుగా 3750-4200ఆర్పీఎం వద్ద 174బీహెచ్పీ మరియూ 1750-2500ఆర్పీఎం వద్ద 380ఎనెం టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజిన్లు కి మల్టీట్రానిక్ సీవీటీ ట్రాన్స్మిషన్ ని ఫ్రంట్ వీల్ డ్రైవ్ ఔట్ కి ఇవ్వడం జరుగుతుంది.