Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

2023 హోండా సిటీ మరియు సిటీ హైబ్రిడ్ అంచనా ధరలు: నవీకరించబడిన మోడల్ ధర ఎంత ఎక్కువగా ఉంటుంది?

హోండా సిటీ కోసం rohit ద్వారా మార్చి 01, 2023 01:28 pm ప్రచురించబడింది

నవీకరించబడిన సెడాన్ కొత్త ఎంట్రీ-లెవెల్ SV వేరియెంట్ؚను పొందుతుంది, ADASతో టాప్-ఎండ్ మరింత ఖరిదైనదిగా ఉంటుంది

హోండా సిటీ భారతదేశంలో సరికొత్త లుక్‌తో మార్చి 2న విడుదల కానుంది, నవీకరించబడిన సిటీ హైబ్రిడ్ (e:HEV) అమ్మకాలు కూడా అదే రోజున ప్రారంభం అవుతాయని అంచనా. విడుదలైన కొన్ని చిత్రాలు మరియు వివరాలు, ఈ నవీకరణతో సాధారణ సిటీ మరియు సిటీ హైబ్రిడ్ؚ రెండిటీలో కొత్త బేస్-వేరియంట్‌తో సహ ఎటువంటి అప్ؚడేట్ؚలో అందించబడుతున్నవి ఇప్పటికే తెలియచేస్తున్నాయి. అనేక డీలర్ؚషిప్ؚలు ఈ సెడాన్ కోసం ఆఫ్ؚలైన్ బుకింగ్ؚలను కూడా అంగీకరిస్తున్నాయి. వివిధ వేరియెంట్ వివరాలు మనకు ఇప్పటికే తెలిసినందున, కేవలం-పెట్రోల్ మోడల్, బలమైన-హైబ్రిడ్ రెండు వర్షన్ؚల వేరియెంట్-వారీ అంచనా ధరలు ఇక్కడ ఇవ్వబడాయి.

వేరియెంట్-వారీ అంచనా ధరలను చూడటానికి ముందుగా, నవీకరించబడిన సెడాన్ పవర్ؚట్రెయిన్ వివరాలను చూద్దాం.

స్పెసిఫికేషన్

1.5-లీటర్ పెట్రోల్

1.5-లీటర్ పెట్రోల్ హైబ్రిడ్

పవర్

121PS

126PS (కంబైన్డ్)

టార్క్

145Nm

253Nm (కంబైన్డ్)

ట్రాన్స్ؚమిషన్

6-స్పీడ్ల MT, 7-స్టెప్ CVT

e-CVT

ఈ నవీకరణతో, సెడాన్ ఇకపై 1.5-లీటర్ డీజిల్ పవర్ ట్రెయిన్‌తో(100PS/200Nm) అందుబాటులో ఉండదు. సిటీ హైబ్రిడ్, 0.7kWh బ్యాటరీ ప్యాక్ మరియు ఎలక్ట్రిక్ మోటార్ؚతో 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ؚను కూడా పొందుతుంది.

నవీకరించబడిన సిటీలో కొత్తగా వైర్ؚలెస్ ఫోన్ ఛార్జర్, యాంబియెంట్ లైటింగ్, వైర్ؚలెస్ అండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్ؚప్లే మరియు అన్నిటి కంటే ముఖ్యమైన అడ్వాన్సెడ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS) వంటి ఫీచర్‌లు ఉన్నాయి. ఈ సిటీ హైబ్రిడ్ అవతార్ؚలో పరిచయం చేసిన ఈ భద్రత సాంకేతికతను హోండా ఇప్పుడు సాధారణ పెట్రోల్ సెడాన్ؚలో కూడా అందిస్తుంది.

ఇది కూడా చదవండి: ChatGPT ప్రకారం 4 ఉత్తమ భారతీయ కార్లు ఇవే

వేరియెంట్-వారీ అంచనా ధరలను చూద్దాం:

వేరియెంట్

1.5-లీటర్ MT

1.5-లీటర్ CVT

1.5-లీటర్ పెట్రోల్ హైబ్రిడ్

SV (కొత్తది)

రూ.11 లక్షలు

V

రూ.12.20 లక్షలు

రూ.13.60 లక్షలు

రూ. 16.57 లక్షలు (కొత్తది)

VX

రూ.13.65 లక్షలు

రూ.14.95 లక్షలు

ZX

రూ.15.65 లక్షలు

రూ.16.95 లక్షలు

రూ. 20 లక్షలు

ఈ అప్ؚడేట్ؚతో, హోండా తన కాంపాక్ట్ సెడాన్ కోసం ఒక కొత్త బేస్-స్పెక్ SV వేరియెంట్ؚను పరిచయం చేస్తుంది. CVT ఎంపికను పొందని ఒకే ఒక వేరియెంట్ ఇది. CVT వేరియెంట్‌లు వాటి సరిపోలీన మాన్యువల్ వేరియెంట్‌లతో పోలిస్తే రూ.1.3 లక్షల నుండి 1.4 లక్షల వరకు అధిక ధరను కలిగి ఉంటాయి. టాప్-స్పెక్ ZM, VX కంటే రూ.రెండు లక్షల ధరను ఎక్కువగా కలిగి ఉండటానికి గల కారణం ఇందులో ADASను చేర్చడం. దీనిలో అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, లేన్ అసిస్ట్ వంటి ఫీచర్‌లు ఉంటాయి.

ఇది కూడా చూడండి: మొదటిసారి భారతదేశం రోడ్‌లపై కనిపించిన హోండా సరికొత్త SUV మారుతి గ్రాండ్ విటారాతో పోటీ పడుతుంది

నవీకరించబడిన సిటీ అంచనా ధరలను దాని పోటీదారుల ధరలతో పోల్చి చూద్దాం:

2023 హోండా సిటీ (అంచనా)

స్కోడా స్లేవియా

2023 హ్యుందాయ్ వెర్నా (అంచనా)

వోక్స్ؚవ్యాగన్ వర్చుస్

మారుతి సియాజ్

రూ.11 లక్షల నుండి రూ. 16.95 లక్షల వరకు

రూ. 11.29

లక్షల నుండి రూ. 18.40 లక్షల వరకు

రూ. 10 లక్షల నుండి రూ. 18 లక్షల వరకు

రూ. 11.32 లక్షల నుండి రూ. 18.42 లక్షల వరకు

రూ. 9.20 లక్షల నుండి రూ. 12.19 లక్షల వరకు

వోక్స్ వ్యాగన్ విర్టస్, స్కోడా స్లేవియా, మారుతి సియాజ్, హ్యుందాయ్ వెర్నా (దాని కొత్త-జనరేషన్ వెర్షన్ؚ)లతో హోండా సిటీ తన పోటీని కొనసాగిస్తుంది. మరోవైపు, సిటీ హైబ్రిడ్ؚకు ప్రత్యక్ష పోటీ వాహనం ఏది లేదు.

అన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు

మరింత చదవండి: సిటీ డీజిల్

r
ద్వారా ప్రచురించబడినది

rohit

  • 42 సమీక్షలు
  • 0 Comments

Write your Comment పైన హోండా సిటీ

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిసెడాన్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
ఫేస్లిఫ్ట్
Rs.73.50 - 78.90 లక్షలు*
ఎలక్ట్రిక్
Rs.2.03 - 2.50 సి ఆర్*
ఎలక్ట్రిక్
Rs.41 - 53 లక్షలు*
Rs.11.53 - 19.13 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర