భారతదేశ రోడ్‌లపై మొదటిసారిగా కనిపించిన హోండా సరికొత్త SUV, మారుతి గ్రాండ్ విటారాతో పోటీ పడనుంది
హోండా ఎలివేట్ కోసం sukrit ద్వారా మార్చి 02, 2023 12:15 pm ప్రచురించబడింది
- 25 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఈ కాంపాక్ట్ SUV, హోండా సిటీ విధంగానే సెడాన్ స్ట్రాంగ్-హైబ్రిడ్ డ్రైవ్ؚట్రెయిన్ؚతో సహా అవే పవర్‌ట్రెయిన్ ఎంపికలను పొందనుంది.
-
2023 హోండా SUV, మృదువైన ముందు భాగంతో సొగసైన డిజైన్, వెనుక భాగంలో క్రాస్ؚఓవర్ డిజైన్ కలిగి ఉంటుంది.
-
వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్‌లు, ADAS వంటి ఆనేక ఫీచర్‌లతో రానుంది.
-
ఈ వాహనం, సిటీ e-HEV బలమైన-హైబ్రిడ్ؚతో పాటు సిటీ 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ؚను పొందవచ్చు.
-
2023 సంవత్సరం మధ్యలో విడుదలై, రూ.11 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరను కలిగి ఉండవచ్చు.
భారతదేశంలో హోండా ఒక కొత్త SUVని ప్రవేశపెట్టనుంది, కెమెరాకు చిక్కిన కొత్త ఫోటోలు ఈ వాహన రోడ్ టెస్ట్ؚలు ప్రారంభమయ్యాయని తెలియచేస్తున్నాయి. రానున్న రహస్య SUV ఫస్ట్ లుక్ 2023 సంవత్సరం మధ్యలో విడుదల అవుతుంది అని ఆశిస్తున్నాము. ఇది మారుతి గ్రాండ్ విటారాకు పోటీ ఇస్తుంది, రూ. 11 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో రావచ్చు.
రహస్య చిత్రాలు ఏమి తెలియచేస్తున్నాయి
కొత్త హోండా కాంపాక్ట్ SUV ఒక సరికొత్త ఉత్పత్తిగా రానుంది, కాబట్టి అది ఎలా కనిపిస్తుందో, ఏ విభాగానికి చెందుతుందో ఇప్పటికీ ఖచ్చితంగా తెలియదు. ఈ SUV, LED DRLలతో ఆకర్షణీయంగా కనిపించే హెడ్ؚలైట్‌లు ఉండే పెద్ద గ్రిల్ ఉన్నట్లు రహస్యంగా చిక్కిన ఫోటోలలో చూడవచ్చు.
భారీగా కప్పి ఉన్నట్లు కనిపించినప్పటికి, క్లామ్‌షెల్ బోనెట్, దిగువ గ్రిల్ؚతో మృదువైన భారీ ఫ్రంట్ బంపర్ؚలను గుర్తించవచ్చు. మొత్తంగా దీని రూపం నిటారుగా, SUVలా కనిపిస్తుంది.
వెనుక మూడు వంతుల కోణం నుండి, ఈ SUV వాలుగా ఉన్న వెనుక విండ్ؚషీల్డ్ؚతో మరింత నాజూకుగా, క్రాస్-ఓవర్ؚలాగా కనిపించింది. లైట్‌లు విడిపోయి, చుట్టినట్లుగా కనిపిస్తున్నాయి, నెంబర్ ప్లేట్ టైల్ؚగేట్ؚకు అమర్చబడి ఉంది.
ఇంజన్ లు మరియు ఫీచర్ లు
SUV బోనెట్ క్రింద, హోండా సిటీలో విధంగా 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ఉండవచ్చు, ఇది ఆరు-స్పీడ్ మాన్యువల్, CVT ఆటోమ్యాటిక్ ట్రాన్స్ؚమిషన్ ఎంపికలతో జతచేయబడవచ్చు, అదనంగా, 126PS పవర్‌తో సిటీ హైబ్రిడ్ బలమైన-హైబ్రిడ్ పవర్ؚట్రెయిన్ కూడా ఈ SUVలో ఉండవచ్చు. డీజిల్ పవర్ؚట్రెయిన్ؚను అందించకపోవచ్చు.
ఫీచర్‌ల విషయానికి వస్తే, రహస్యంగా చిక్కిన ఫోటోలలో సన్ؚరూఫ్ ఇప్పటికే కనిపిస్తుంది. పరికరాల జాబితాలో వైర్ؚలెస్ అండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్ؚప్లే కనెక్టివిటీؚతో పెద్ద టచ్ؚస్క్రీన్, సెమీ-డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, వైర్ؚలెస్ ఫోన్ ఛార్జింగ్, ఆరు ఎయిర్ బ్యాగులు, 360-డిగ్రీల కెమెరా ఉండవచ్చు.
రానున్న హోండా కాంపాక్ట్ SUV, పైన పేర్కొన్న గ్రాండ్ విటారాతో పాటు హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, వోక్స్ వ్యాగన్ టైగూన్, స్కోడా కుషాక్, టయోటా హైరైడర్, MG ఆస్టర్లతో పోటీ పడుతుంది.
ఇక్కడ మరింత చదవండి: మారుతి గ్రాండ్ విటారా ఆన్-రోడ్ ధర