• English
  • Login / Register

2016 చేవ్రొలెట్ క్రుజ్ బహిర్గతం

చేవ్రొలెట్ క్రూజ్ కోసం raunak ద్వారా జూన్ 26, 2015 01:03 pm ప్రచురించబడింది

  • 15 Views
  • 1 వ్యాఖ్యలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ప్రస్తుతం ఉన్న క్రూజ్ మోడల్ కంటే, రాబోయే క్రూజ్ తేలికగా మరియు దృడంగా 113 కేజీలతో 27% తక్కువ బరువుతో తదుపరి సంవత్సరం యుఎస్ లో అమ్మకాలను ప్రారంబించనుంది. ఇప్పుడు రాబోయే క్రూజ్, ప్రస్తుతం ఉన్న దానిని భర్తీ చేయనుందని జనరల్ మోటార్స్ చెప్పారు.   

జైపూర్: చేవ్రొలెట్, రెండవ తరం క్రూజ్ ను పరిచయం చేసింది. జిఎం మోటార్ ఈ క్రూజ్ అమ్మకాలను, ప్రపంచవ్యాప్తంగా 40 దేశాలలో కొనసాగిస్తుంది. 2016 సెడాన్ ప్రారంభం తరువాత, దీని యొక్క అమ్మకాలను మొదటిసారిగా ఉత్తర అమెరికాలో ప్రారంబించడానికి సన్నాహాలు జరిపుతుంది. వీటితో పాటు, ఈ ఆటోమొబైల్ వేదికపై కొత్త లుక్ తో రాబోతుంది. ఈ క్రూజ్ కొత్త డీజిల్, టర్బో పెట్రోల్ ఇంజిన్ లతో పాటు ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో వంటి అత్యుత్తమ లక్షణాలతో రాబోతుంది.

  

డిజైన్ గురించి మాట్లాడటానికి వస్తే, రెండవ తరం క్రుజ్, ప్రస్తుత సెడాన్ కు భిన్నంగా కనబడబోతుంది. 2016 క్రూజ్, కొత్త మల్లిబు మరియు 2014 ఇంపాలా కార్ మోడళ్ళ ఆకృతి ఆధారంగా రాబోతుంది. అంతేకాకుండా ఈ క్రూజ్, ప్రపంచ డిజైన్ లాంగ్వేజ్ తో మరియు స్టైలింగ్ తో ఈ విభాగంలో అడుగు పెట్టబోతుంది. అయితే, 2016 క్రూజ్, ప్రస్తుతం ఉన్న క్రూజ్ లక్షణాలతో పాటు మరింత ఆకర్షణీయంగా అధనపు లక్షణాలతో రాబోతుంది. 

ఈ క్రూజ్ బాహ్య భాగాల విషయానికి వస్తే, ఈ క్రూజ్ ఎల్ ఈడి ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్ తో పాటు ఎల్ ఈడి డే టైం రన్నింగ్ లైట్స్ తో రాబోతుంది. అంతేకాకుండా, 15- 18 అంగుళాల అల్లయ్ వీల్స్ అందించబడతాయి. అంతేకాక, వాహనం పరిమాణం పరంగా 68 మ్మ్ పెరిగి రాబోతుంది మరియు ఈ విభాగంలో అత్యంత ఉత్తమ వీల్బేస్ అయిన 2700 mm తో రాబోతుంది. ఎత్తు పరంగా 25 mm తగ్గి రాబోతుంది మరియు పొడవుగా, సన్నటి రూపంతో రాబోతుంది.  

ఇంజన్ విషయానికి వస్తే, రాబోయే క్రూజ్ 1.4 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ తో రాబోతుంది. ఈ ఇంజన్, అత్యధికంగా 153 భ్ప్ పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. అదే విధంగా, అత్యధికంగా 240 ణ్మ్ గల టార్క్ ను విడుదల చేస్తుంది. ఈ చెవ్రోలెట్ క్రూజ్, 0కంఫ్ నుండి 100 కంఫ్ వేగాన్ని చేరడానికి 8 సెకన్ల సమయం పడుతుంది. ఈ ఇంజన్ లు, రహధారులపై, సుమారు 17 కంప్ల్ మైలేజ్ ను అందిస్తాయి. అంతేకాకుండా, ఈ వాహనాలు పెట్రోల్ ఇంజన్ తో మాతేమే కాకుండా డీజిల్ ఇంజన్ తో కూడా రాబోతుంది. ప్రస్తుతం ఉన్న 1.6 లీటర్ల డీజిల్ ఇంజన్ స్థానాన్ని 2.0 లీటర్ డీజిల్ ఇంజన్ భర్తీ చేయనుంది

ఈ కొత్త క్రూజ్ అంతర్గత భాగాలు చూడటానికి,  చైనా క్రూజ్ ఎక్స్క్లూజివ్ వెర్షన్ మాదిరిగానే కనిపిస్తాయి. అంతేకాకుండా 7- అంగుళాల మైలింక్ సమాచార టచ్ స్క్రీన్ వ్యవస్థ తో రాబోతుంది మరియు 8-అంగుళాల టచ్ స్క్రీన్ వ్యవస్థ ను ఆప్షనల్ ఎంపిక చేసుకోవచ్చు. ఈ సమాచార వ్యవస్థ, ఆపిల్ కార్ ప్లే మరియు ఆండ్రోయిడ్ ఆటో వంటి వాటిని కలిగి రాబోతుంది. అంతేకాక, డ్రైవర్ కొరకు, 4.2-అంగుళాల డియగ్నల్ హై రిజల్యూషన్ ఇన్స్ట్రుమెంటేషన్ క్లస్టర్ అందించబడుతుంది.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Chevrolet క్రూజ్

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది సెడాన్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience