• English
  • Login / Register

Citroen C3 Aircross SUV చూడండి: సిట్రోయెన్ C3 ఎయిర్ؚక్రాస్ SUV ఆఫ్ రోడ్ ప్రయాణానికి తగినదేనా?

సిట్రోయెన్ aircross కోసం tarun ద్వారా ఆగష్టు 09, 2023 05:19 pm ప్రచురించబడింది

  • 33 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

థార్ లేదా స్కార్పియో Nకు ఉన్నంత ఆఫ్ రోడ్ సామర్థ్యం లేకపోయినా, C3 ఎయిర్ؚక్రాస్ కొన్ని రోడ్లపై ప్రయాణానికి అనువైనదే

Citroen C3 Aircross

కాంపాక్ట్ SUV విభాగంలో ప్రవేశిస్తున్న తొమ్మిదవ మోడల్‌గా సిట్రోయెన్ C3 ఎయిర్ؚక్రాస్ నిలుస్తుంది. దీని బుకింగ్ؚలు మరియు డెలివరీలు సెప్టెంబర్ నుండి ప్రారంభం కానున్నాయి, అదే నెలలో ధరల వివరాలు కూడా అందించనున్నారు. 

C3 ఎయిర్ؚక్రాస్ ‘SUV’ విభాగానికి చెందింది, కానీ అన్నీ SUVలను నగరంలో మరియు హైవేలపై కంటే ఎక్కువగా మరెక్కడా ఉపయోగించలేము. కాబట్టి సిట్రోయెన్ ఆఫ్ రోడ్ సామర్ధ్యాన్ని మరియు అది ఎలా పనిచేస్తుందో పరిశీలించాలని నిర్ణయించుకున్నాము. ఈ రీల్ؚను చూడండి:

A post shared by CarDekho India (@cardekhoindia)

దాని పనితీరు ఎలా ఉంది?

మొదట, గ్రౌండ్ క్లియరెన్స్ టెస్ట్ నిర్వహించాము, అడుగున 200మిమీల ఖాళీతో C3 ఎయిర్ؚక్రాస్ దీన్ని సులభంగా పాస్ అయ్యింది. దీనితో పాటు హిల్ స్టార్ట్ అసిస్ట్ ఫీచర్ؚను కూడా టెస్ట్ చేశాము. దాని సామర్ధ్యతను చూపడానికి సైడ్ టిల్ట్ మరియు నీటిలో నడవడం వంటి పరీక్షలను కూడా చేశాము. 

వీల్ ఆర్టిక్యులేషన్ అనేది ఒక కీలకమైన ఆఫ్-రోడింగ్ టెస్ట్, దీన్ని C3 ఎయిర్ؚక్రాస్ అతి సులభంగా పాస్ అయ్యింది. చివరిగా, చదునైన అండర్ؚరూఫ్ؚను కలిగి ఉండటం వలన ఈ SUV రాళ్ళతో నిండిన టెస్ట్ ప్యాచ్ నుండి సురక్షితంగా ఉంది. అయితే, ఈ టెస్ట్ؚలు అన్నిటితో C3 ఆఫ్-రోడర్ؚగా అర్హత పొందుతుంది అని చెప్పలేము, కానీ చిన్నపాటి సాహసాలు మరియు కొన్నిసార్లు వర్షాకాలంలో పాడయ్యే నగర రోడ్లపై ప్రయాణానికి అనువైన సాఫ్ట్-రోడర్ కావచ్చు. 

ఇది కూడా చదవండి: సిట్రోయెన్ C3 ఎయిర్ؚక్రాస్ؚలో లభించే ఫీచర్‌లు

C3 ఎయిర్ؚక్రాస్: బోనెట్ క్రింద ఇవి ఉన్నాయి

Citroen C3 Aircross

C3 ఎయిర్ؚక్రాస్ 110PS 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ నుండి శక్తిని పొందుతుంది, ఇది 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ؚమిషన్ؚతో జోడించబడుతుంది. సిట్రోయెన్ దీనికి ఆటోమ్యాటిక్ ట్రాన్స్ؚమిషన్ ఎంపికను పూర్తి చేసే ప్రక్రియలో ఉంది, ఇది 2024 నాటికి SUVలో లభించవచ్చు.

ఫీచర్‌లు మరియు పోటీదారులు

Citroen C3 Aircross

ఇది కూడా చదవండి: హోండా ఎలివేట్ Vs హ్యుందాయ్ క్రెటా Vs కియా సెల్టోస్ Vs మారుతి గ్రాండ్ విటారా Vs టయోటా హైరైడర్: స్పెసిఫికేషన్ ల పోలిక

దీనిలో 10.2-అంగుళాల టచ్ؚస్క్రీన్ సిస్టమ్, వైర్ؚలెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్ؚప్లే, 7-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్ؚలు, రేర్ పార్కింగ్ కెమెరా మరియు హిల్ హోల్డ్ అసిస్ట్ ఉన్నాయి. C3 ఎయిర్ؚక్రాస్ ధర రూ.9 లక్షల (ఎక్స్-షోరూమ్) ఉంటుందని అంచనా మరియు ఇది హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, వోక్స్వాగన్ టైగూన్, స్కోడా కుషాక్, MG ఆస్టర్, మారుతి గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్, మరియు హోండా ఎలివేట్ؚలతో పోటీ పడుతుంది. 

ఇక్కడ మరింత చదవండి: సిట్రోయెన్ C3 ఆన్ؚరోడ్ ధర

was this article helpful ?

Write your Comment on Citroen aircross

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience