Citroen C3 Aircross: సిట్రోయెన్ C3 ఎయిర్‌క్రాస్ ఫీచర్ల వివరాలు
సిట్రోయెన్ aircross కోసం tarun ద్వారా ఆగష్టు 03, 2023 10:23 pm ప్రచురించబడింది
- 300 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
విడుదల కానున్న సిట్రోయెన్ C3 ఎయిర్ؚక్రాస్ ధరను మినహహించి, సాంకేతిక స్పెసిఫికేషన్‌లు మరియు ఫీచర్‌లతో సహా అన్నీ వివరాలను వెల్లడించారు
-
C3 ఎయిర్ؚక్రాస్ ఏకైక ‘మాక్స్’ వేరియెంట్ؚగా అందించనున్నారు.
-
తొలగించగలిగే మూడవ వరుస సీట్లు మరియు రెండవ వరుస సీట్ల కోసం 60:40 స్ప్లిట్ సెట్అప్ؚను పొందుతుంది.
-
10.2-అంగుళాల టచ్ؚస్క్రీన్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, డ్యూయల్ ఎయిర్ బ్యాగ్ؚలు, TPMS, మరియు వెనుక కెమెరా వంటి ఫీచర్‌లతో వస్తుంది
-
6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ؚమిషన్ؚతో 110PS 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ నుండి శక్తిని పొందుతుంది.
-
దీని ధర సుమారు రూ.9 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంటుందని అంచనా.
భారతదేశంలో, ఫ్రెంచ్ కార్‌మేకర్ అందించిన నాల్గవ మోడల్, సిట్రోయెన్ C3 ఎయిర్‌క్రాస్. ఇది కాంపాక్ట్ SUV విభాగంలోకి ప్రవేశిస్తుంది. సిట్రోయెన్ ఇప్పుడు SUV యొక్క అన్ని సాంకేతిక లక్షణాలను వెల్లడించింది మరియు దానితో వచ్చే అన్ని ఫీచర్లు ఇక్కడ ఉన్నాయి:
ఫీచర్లు
ఎక్స్టీరియర్స్ |
ఇంటీరియర్ |
సౌకర్యం మరియు సౌలభ్యం |
ఇన్ఫోటైన్‌మెంట్ |
భద్రత |
|
|
|
|
|
C3 ఎయిర్క్రాస్ ఫీచర్ల జాబితాలో వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లేతో కూడిన 10.2-అంగుళాల టచ్‌స్క్రీన్ సిస్టమ్, 7-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, మాన్యువల్ AC, రూఫ్-మౌంటెడ్ AC వెంట్‌లు, కీలెస్ ఎంట్రీ, ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగల ORVMలు మరియు అన్ని వరుసల కోసం USB ఛార్జింగ్ పోర్ట్‌లు ఉన్నాయి.
భద్రత పరంగా, ఇందులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ESP, హిల్ హోల్డ్ అసిస్ట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ మరియు వెనుక పార్కింగ్ కెమెరా వంటి ఫీచర్లు అందించబడ్డాయి.
సీటింగ్ కాన్ఫిగరేషన్ؚలు
మూడు-వరుసల స్పెసిఫికేషన్‌లో, C3 ఎయిర్‌క్రాస్‌లో తొలగించగలిగే మూడువ వరుస సీట్లను కలిగి ఉంటుంది, తద్వారా కొనుగోలుదారులకు మరింత బూట్‌స్పేస్‌ను అందిస్తుంది. దిని ఐదు-సీటర్‌ల మోడల్ ఈ విభాగంలోనే అత్యధికంగా 511 లీటర్‌ల బూట్ సామర్ధ్యాన్ని అందిస్తుంది. మరింత ఉపయోగించగలిగే బూట్‌స్పేస్ కోసం, రెండవ వరుస సీట్లను కూడా 60:40 స్ప్లిట్-ఫోల్డ్ చేయవచ్చు, మూడవ-వరుస వర్షన్ؚలో వీటిని రీక్లైన్ కూడా చేయవచ్చు. పూర్తి స్పెసిఫికేషన్‌లతో వచ్చే ఏకైక వేరియెంట్ సెమీ-లెదర్ సీట్ అప్ؚహోల్ؚస్ట్రీతో వస్తుంది, ప్రీమియం క్యాబిన్ అనుభవాన్ని అందిస్తుంది.
ఇది కూడా చదవండి: హోండా ఎలివేట్ Vs హ్యుందాయ్ క్రెటా Vs కియా సెల్టోస్ Vs మారుతి గ్రాండ్ విటారా Vs టయోటా హైరైడర్: స్పెసిఫికేషన్‌ల పోలిక
పవర్ؚట్రెయిన్ؚలు
C3 ఎయిర్‌క్రాస్ బోనెట్‌లో 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ ఉంటుంది, ఇది 110PS పవర్ మరియు 190Nm టార్క్‌ను విడుదల చేస్తుంది. ప్రస్తుతానికి ఇది 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ؚమిషన్‌తో వస్తుంది, కానీ తరువాత ఆటోమ్యాటిక్ ఎంపికలో వస్తుందని అంచనా.
ఇది కూడా చదవండి: సిట్రోయెన్ C3 ఎయిర్ؚక్రాస్ Vs పోటీదారులు: క్లెయిమ్ చేసిన ఇంధన సామర్ధ్యాల పోలిక
ఇది ఏకైక వేరియెంట్‌గా లభిస్తున్నందున, C3 ఎయిర్‌క్రాస్ ధర రూ.9 లక్షల నుండి (ఎక్స్-షోరూమ్) ఉంటుందని భావిస్తున్నాము. అనేక ఫీచర్‌లతో వచ్చే కాంపాక్ట్ SUV పోటీదారులు అయిన హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, వోక్స్వాగన్ టైగూన్, స్కోడా కుషాక్, MG ఆస్టర్, మారుతి గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ మరియు హోండా ఎలివేట్ వంటి వాటితో పోటీ పడుతుంది.
ఇక్కడ మరింత చదవండి: సిట్రోయెన్ C3 ఆన్ؚరోడ్ ధర
0 out of 0 found this helpful