వోక్స్వ్యాగన్ ఏమియో కాంపాక్ట్ సెడాన్ అనధికారికంగా కనిపించింది
వోక్స్వాగన్ అమియో కోసం manish ద్వారా జనవరి 22, 2016 01:18 pm ప్రచురించబడింది
- 21 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
నామకరణం జరిగిన తరువాత, వోక్స్వ్యాగన్ ఏమియో ఇప్పుడు పూర్తిగా స్పష్టంగా అనధికారికంగా కనిపించింది. ఈ కారు ఫిబ్రవరి 2న ప్రపంచ ప్రదర్శన చేయనున్నది మరియు 2016 భారత ఆటో ఎక్స్పో వద్ద కూడా ప్రదర్శితం కానుంది. కానీ వాటన్నికంటే ముందే దీని యొక్క అనధికారిక చిత్రాలు ఆన్లైన్ లో బహిర్గతం అయ్యాయి. ఈ కారు యొక్క వెనుక చిత్రాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీని ద్వారా ఈ మోడల్ టిడి ఐ వేరియంట్ లా అనిపిస్తుంది. వెనుక భాగం గురించి మాట్లాడుకుంటే, ఈ కారు బ్రాండ్ కొత్త టెయిల్ గేట్స్ తో అమర్చబడి ఉంటుంది. అదే విధంగా బూట్ లిడ్ వోక్స్వాగన్ యొక్క చెక్ అనుబంధ స్కొడా అందించే రాపిడ్ సెడాన్ లో ఉన్న డిజైన్ ని పోలి ఉంటుంది. ఇంకా దీనిలో నంబర్ ప్లేట్ కి ఇరువైపులా కొద్దిగా లోపలికి ఉన్న లైన్లను గుర్తించడం ఇంకా ఆకర్షణీయంగా కనిపించవచ్చు.
ముందు అనధికారిక చిత్రాల నుండి ఈ కారు యొక్క బూట్ చంకీ గా ఉండి సబ్-4 మీటర్ కాంపాక్ట్ సెడాన్ వాహనం టాక్స్ బ్రాకెట్ లోనికి వస్తుంది మరియు ఇది నాచ్ బ్యాక్ అనే పుకార్లను అవాస్తవికం చేసింది. అలానే ఈ కారు యొక్క వెనుక భాగం ప్రొమినియంట్ లైన్స్ తో స్పోర్టీ లుక్ ఇస్తుంది. దీనిలో టెయిల్ లైట్ క్లస్టర్ ఒక రిఫ్రెష్ డిజైన్ కలిగి ఉంటుంది. అయితే, గతంలో చూసిన మునుపటి చిత్రాల ప్రకారం క్లస్టర్ పోలో హ్యాచ్బ్యాక్ ని పోలి ఉంటుంది.
చిత్రంలో చూసిన టోశా అలాయ్ వీల్స్ పోలో లో చూసిన విధంగానే ఉన్నాయి. ఈ మోడల్ టిడిఐ గా అనధికారికంగా కనిపించింది, ఇది 4-సిలిండర్ 1.5 లీటర్ మిల్లు తో అమర్చబడి వెంటో మరియు పోలో లో ఉన్న 90PS మరియు 105PS రెండు వైవిధ్యాల శక్తితో అందుబాటులో ఉంటుండే అవకాశం ఉంది. కానీ ఇదే యూనిట్లు రాబోయే కాంపాక్ట్ సెడాన్ లో ఉంటాయా లేవా అనేది ఇంకా అస్పష్టంగానే ఉంది. ఈ పవర్ప్లాంట్స్ 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 7-స్పీడ్ DSGఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఎమిప్క రెండిటితో అందించబడుతుంది. వోక్స్వ్యాగన్ ఏమియో మారుతి స్విఫ్ట్ డిజైర్, టాటా జెస్ట్, ఫోర్డ్ ఆస్పైర్ మరియు హ్యుందాయ్ ఎక్సెంట్ వంటి వాటితో పోటీ పడవచ్చు.
ఇంకా చదవండి: పోలో జిటి ఐ ను 2016 భారత ఆటో ఎక్స్పోలో ప్రదర్శించనున్న వోక్స్వాగన్
0 out of 0 found this helpful