• English
  • Login / Register

భారతదేశంలో నవీకరించబడిన వోక్స్వాగన్ వెంటో, పోలో లను పరీక్షిస్తున్న సమయంలో బహిర్గతమయ్యాయి

వోక్స్వాగన్ వెంటో 2015-2019 కోసం dinesh ద్వారా మార్చి 18, 2019 03:40 pm ప్రచురించబడింది

  • 24 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి
  • వెంటో మరియు పోలో లు బహుశా నవీకరించబడిన వెనుక బంపర్ను దాచడం కోసం ముసుగుతో బహిర్గతం అవుతున్నాయి.
  •  ముందు భాగంలో కూడా సున్నితమైన సౌందర్య మార్పులను పొందడానికి ఎదురుచూడండి.
  •  నవీకరించిన నమూనాలు త్వరలోనే రానున్నట్లయితే, పవర్రైన్లు మాత్రం ముందు వాటినే తీసుకొచ్చే ఆలోచనలు ఉన్నాయి.

2019 VW Vento

వోక్స్వ్యాగన్ సంస్థ, భారతదేశంలో కొన్ని సంవత్సరాల నుండి రెండవ తరం వెంటో మరియు పోలో లాంచ్ ముందు, పోలో రెండు వాహనాలు మరొక నవీకరణ లతో రాబోతున్నాయి. కారు తయారీదారుడు ఈ విషయాలను ఇప్పటికీ నిర్ధారించకపోయినా, ఒక ముసుగు తో ఉన్న వెంటో మరియు పోలో లు భారతదేశంలో పరీక్షలు నిర్వహిస్తున్న సమయంలో కనిపించాయి.

కొత్త తరం స్కొడా రాపిడ్, వోక్స్వాగన్ పోలో, అమీయో, వెంటో ఇన్ పైప్లైన్ ఫర్ ఇండియా

చిత్రపటం: రష్యా-స్పెక్స్ పోలో జిటి

Updated Volkswagen Vento, Polo Spied Testing In India

పరీక్షించబడిన కార్లు భారీగా మభ్యపెట్టబడినప్పటికీ, మేము ఒక నవీకరించబడిన వెనుక బంపర్ని గుర్తించగలిగాము. ఇది రష్యా-స్పెక్ పోలో జిటి (రష్యా మార్కెట్లో వంటోని- పోలో అని పిలుస్తారు) వలె ఉంటుంది. రష్యా-స్పెక్ పోలో జిటిలో, వెనుక బంపర్ ద్వంద-టోన్ ముగింపును పొందుతుంది, అయితే ఇండియా-స్పెక్ వెంటో ఒకే ఒక టోన్ బంపర్తో వస్తుంది.

చిత్రపటం: రష్యా-స్పెక్స్ పోలో జిటి

రష్యన్ మోడల్ వలే, పోలో యొక్క రెండు వాహనాలు కూడా ఇతర సౌందర్య మార్పులును కలిగి ఉంటాయని భావిస్తున్నాము. రష్యన్ పోలో జిటి యొక్క ముందు బంపర్ మరియు గ్రిల్ ఇప్పుడు నిలిపివేయబడిన భారత-స్పెక్ పోలో జిటిఐకి సమానంగా కనిపిస్తోంది అయినప్పటికీ పోలియో జిటిఐలో ఎరుపు ముఖ్యాంశాలకు బదులుగా క్రోమ్ ఇన్సర్ట్ లను కలిగి ఉంది. నవీకరించబడిన పోలో యొక్క ఫీచర్లు- నవీకరించిన వెంటో ను పోలిన రూపకల్పన మార్పులు ఉండవచ్చు.

Updated Volkswagen Vento, Polo Spied Testing In India

రాబోయే కొన్ని నెలల్లో ప్రారంభించినట్లయితే, నవీకరించబడిన వెంటో ముందు వెర్షన్ లో ఉన్న అదే పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్ల సెట్ను తీసుకెళ్లగలదని భావిస్తున్నారు. పెట్రోల్ వెంటో రెండు ఇంజిన్లతో లభిస్తుంది: 1.6 లీటర్ పెట్రోల్ ఇంజన్- 105 పిఎస్ పవర్ను అలాగే 153 ఎం ఎమ్ గల టార్క్ లను ఉత్పత్తి చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ ఇంజన్, 5- స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో జత చేయబడి ఉంటుంది. మరోవైపు 1.2 లీటర్ ఇంజన్ విషయానికి వస్తే, 105 పిఎస్ పవర్ను అలాగే 175 ఎంఎమ్ గల టార్క్ లను ఉత్పత్తి చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ ఇంజన్, 7- స్పీడ్ డిఎస్జి ట్రాన్స్మిషన్ తో జత చేయబడి ఉంటుంది. వెంటో డీజిల్ వెర్షన్, 1.5 లీటర్ డీజిల్ ఇంజన్తో లభ్యమౌతుంది, ఈ ఇంజన్ గరిష్టంగా 110పిఎస్ పవర్ ను మరియు 250 ఎంఎమ్ గల టార్క్ లను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5- స్పీడ్ మాన్యువల్ లేదా 7- స్పీడ్ డిఎస్జి ట్రాన్స్మిషన్ తో అందుబాటులో ఉంటుంది.

అయినప్పటికీ, ఏప్రిల్ 2020 నుండి భారతదేశంలో బిఎస్VI ప్రవేశపెట్టిన తరువాత, వోక్స్వాగన్ సంస్థ వెంటో ను మాత్రమే పెట్రోల్ తో అందించవచ్చు. వెంటోలో- పోలో మరియు అమెయో నుండి 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ను కార్ల తయారీ సంస్థ ప్రవేశపెట్టవచ్చు. అలా ప్రవేశపెట్టినట్లు అయితే, 1.0-లీటర్ యూనిట్ టర్బోచార్జెడ్ అవతార్లో లభిస్తుంది, ఈ వెర్షన్- మరింత శక్తిని మరియు టార్క్ లను ఉత్పత్తి చేస్తుంది.

  • రాబోయే స్కొడా, వోక్స్వాగన్ ఎస్యువి లను 1.0-లీటర్ టిఎస్ఐ  టర్బో పెట్రోల్ ఇంజిన్ ను స్థానికంగా తయారు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి

Updated Volkswagen Vento, Polo Spied Testing In India

వోంటో మరియు పోలోలతో పాటు, వోక్స్వ్యాగన్ అమియోని కూడా నవీకరణ చెంది కొనుగోలుదారుల ముందుకు రాబోతుందని భావిస్తున్నాము. నవీకరించబడిన అమియో ప్రస్తుత వెంటో మాదిరిగానే ఉంటుంది. ఇది వెంటో లో ఉండే విషంగా అడ్డంగా స్లాటెడ్ క్రోమ్ గ్రిల్, కొత్త ముందు బంపర్ మరియు టైల్ లైట్లు పొందవచ్చు.

నవీకరణ చేయబడిన వోక్స్వాగన్ కార్లు ఈ సంవత్సరం తర్వాత అమ్మకాలకు రాబోతున్నాయి. నవీకరించబడిన కార్ల ధరలు- ప్రస్తుత నమూనా ధరలకు ఎక్కువ పోలిక ఉండవచ్చు. పోలో యొక్క ధర రూ 5.70 లక్షల నుంచి రూ. 9.99 లక్షలు, అమియో మరియు వెంటో ల ధరలు రూ 5.82 లక్షల నుంచి రూ. 9.99 లక్షలు,  8.63 లక్షల నుంచి రూ. 14.32 లక్షలు (ఎక్స్ షోరూమ్ పాన్ ఇండియా) ఉంటాయి.

2020 నుంచి రాబోయే కొత్త తరం స్కొడా- వోక్స్వాగన్ కార్లు సిఎంజి ను పొందేందుకు అవకాశం ఉంది

మరింత చదవండి: వోక్స్వ్యాగన్ ఆటో ఆటోమేటిక్

 

was this article helpful ?

Write your Comment on Volkswagen వెంటో 2015-2019

explore similar కార్లు

ట్రెండింగ్‌లో ఉంది సెడాన్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience