• login / register

కొనాలా లేదా వేచి చూడాలా: హ్యుందాయ్ ఆరా కోసం వేచి చూడాలా లేదా వాటి ప్రత్యర్థులను కొనుక్కోవాలా?

published on జనవరి 16, 2020 02:04 pm by sonny కోసం హ్యుందాయ్ aura

  • 29 సమీక్షలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

కొత్త-జెన్ హ్యుందాయ్ సబ్ -4m సెడాన్ కోసం వేచి చూడడమనేది సబబా? లేదా ఇప్పటికే అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయాల కోసం వెళ్ళాలా?

Buy Or Hold: Wait For Hyundai Aura Or Go For Rivals?

హ్యుందాయ్ ఆరా అత్యంత పోటీతత్వ సబ్ -4m సెడాన్ విభాగంలో బ్రాండ్ యొక్క రెండవ కారు అని చెప్పవచ్చు. ఎక్సెంట్ ఎలా అయితే గ్రాండ్ ఐ 10 పై ఆధారపడి ఉందో అదే మాదిరిగా ఆరా కొత్త గ్రాండ్ ఐ 10 నియోస్‌ పై ఆధారపడి ఉంటుంది. ఆరా క్యాబిన్‌ కు అప్‌డేట్స్ మరియు ఫీచర్ జాబితా కు కొన్ని అదనపు లక్షణాలను పొందుతుంది. హ్యుందాయ్ సంస్థ ఆరాను జనవరి 21 న ప్రారంభించనుంది, ఇది మీరు ముందుగా బుక్ చేసుకోవాలా లేదా దాని బదులుగా అందుబాటులో ఉన్న ప్రత్యర్థులలో ఒకదానికి వెళ్లాలా అనే ప్రశ్న మనకి ఉంది. అయితే మేము ఏమి అనుకుటున్నామో ఇక్కడ చూడండి: 

సబ్ -4 మీ సెడాన్స్

ధర పరిధి (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

హ్యుందాయ్ ఆరా

రూ. 6 లక్షల నుండి రూ. 9 లక్షలు (అంచనా)

మారుతి సుజుకి డిజైర్

రూ. 5.83 లక్షల నుండి రూ. 9.53 లక్షలు

హోండా అమేజ్

రూ. 5.93 లక్షల నుండి రూ. 9.79 లక్షలు

ఫోర్డ్ ఆస్పైర్

రూ. 5.99 లక్షల నుండి రూ. 9.10 లక్షలు

టాటా టైగర్

రూ. 5.50 లక్షల నుండి రూ. 7.90 లక్షలు

వోక్స్వ్యాగన్ అమియో

రూ. 5.94 లక్షల నుండి రూ. 10 లక్షలు

ఇవి కూడా చదవండి: హ్యుందాయ్ ఆరా vs మారుతి డిజైర్ vs హోండా అమేజ్ vs ఫోర్డ్ ఆస్పైర్ vs టాటా టైగర్ vs VW అమియో vs హ్యుందాయ్ ఎక్సెంట్: స్పెసిఫికేషన్ పోలిక

Hyundai Aura vs Maruti Dzire vs Honda Amaze vs Ford Aspire vs Tata Tigor vs VW Ameo vs Hyundai Xcent: Specification Comparison

మారుతి సుజుకి డిజైర్: AMT ఆప్షన్ తో BS6 పెట్రోల్ ఇంజిన్, ప్రీమియం క్యాబిన్ మరియు లక్షణాల కోసం దీనిని కొనుక్కోవచ్చు 

ఈ జాబితాలో డిజైర్ మాత్రమే ప్రస్తుతం BS6 పెట్రోల్ ఇంజన్ ఎంపిక. దీని 1.2-లీటర్ పెట్రోల్ మోటారు 5-స్పీడ్ మాన్యువల్ మరియు 5-స్పీడ్ AMT రెండింటి తో లభిస్తుంది, ఇది 82PS పెట్రోల్ / 113Nm టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. డిజైర్ యొక్క 1.3-లీటర్ డీజిల్ ఇంజిన్ BS6 ఎరాలో  అందించబడదు, కాని ప్రస్తుతం మాన్యువల్ మరియు AMT ఎంపికలతో అందుబాటులో ఉంది. మారుతి యొక్క సబ్ -4 m సెడాన్ ప్రధానంగా లేత గోధుమరంగు ఇంటీరియర్ మరియు ఫాక్స్ వుడ్ ఇన్సర్ట్స్ తో అందించబడుతుంది. దీని ఫీచర్ జాబితాలో LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, DRL లు, వెనుక AC వెంట్స్‌తో ఆటో క్లైమేట్, పుష్-బటన్ స్టార్ట్-స్టాప్ మరియు ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ప్లే అనుకూలతతో 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ ఉన్నాయి.

Hyundai Aura vs Maruti Dzire vs Honda Amaze vs Ford Aspire vs Tata Tigor vs VW Ameo vs Hyundai Xcent: Specification Comparison

హోండా అమేజ్: డీజిల్-CVT పవర్‌ట్రెయిన్ మరియు క్యాబిన్ స్థలం కోసం దీనిని కొనుక్కోవచ్చు 

హోండా అమేజ్ ఈ విభాగంలో అత్యధికంగా అమ్ముడు పోయిన కారు కాకపోయినా ఇది ఒక మంచి కారు అని చెప్పవచ్చు, ఎందుకంటే క్యాబిన్ స్థలం మరియు లక్షణాలతో ఆకర్షణీయమైన ధర లను కలిగి ఉంటుంది. అమేజ్ 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజన్లతో అందించబడుతుంది, రెండూ 5-స్పీడ్ మాన్యువల్ లేదా CVT ఆటోమేటిక్ ఎంపికతో లభిస్తాయి. రాబోయే BS 6 నిబంధనల కోసం హోండా త్వరలో రెండు ఇంజిన్‌లను అప్‌డేట్ చేస్తుంది. అమేజ్ వీల్‌బేస్ 2470 mm వద్ద, డిజైర్ కంటే 20mm పొడవు ఉంటుంది. దీని వలన ఇది క్యాబిన్‌ లో ఎక్కువ లెగ్‌రూమ్‌ ను కలిగి ఉంటుంది మరియు ఇది 420 లీటర్ల వద్ద అతిపెద్ద బూట్‌ ను కలిగి ఉంది. ఇది క్రూయిజ్ కంట్రోల్ మరియు ఆటో AC వంటి ఫీచర్లను కూడా పొందుతుంది, కాని వెనుక AC వెంట్లను కోల్పోతుంది.

Buy Or Hold: Wait For Hyundai Aura Or Go For Rivals?

ఫోర్డ్ ఆస్పైర్: పనితీరు, భద్రత మరియు స్పోర్టి లుక్స్ కోసం కొనండి

ఫోర్డ్ ఆస్పైర్‌ కు 2018 చివరినాటికి పూర్తి అప్‌డేట్ ని అందుకుంది. ఈ ఆస్పైర్ ఇప్పుడు ఆటో AC, రియర్‌వ్యూ కెమెరా, ఆటో హెడ్‌ల్యాంప్స్ మరియు టాప్ వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగులు వంటి ఫీచర్లను కలిగి ఉంది. ఈ విభాగంలో ఇది 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ తో 6-స్పీడ్ ఆటోమేటిక్‌ తో 123Ps పవర్ మరియు 150Nm  టార్క్ లను ఉత్పత్తి చేస్తుంది. ఇతర ఇంజిన్ ఎంపికలలో 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఉన్నాయి, ఈ రెండూ కూడా 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో అందుబాటులో ఉన్నాయి. ఇది ప్రస్తుత ప్రత్యర్థుల కంటే స్పోర్టియర్ స్టైలింగ్‌ ను కలిగి ఉంది, ముఖ్యంగా టైటానియం బ్లూ వేరియంట్‌ లో స్పోర్టి డెకాల్స్, బ్లాక్ అలాయ్స్ మరియు నీలి ఆక్సెంట్స్ తో మరింత అందంగా కనిపిస్తుంది.

Hyundai Aura vs Maruti Dzire vs Honda Amaze vs Ford Aspire vs Tata Tigor vs VW Ameo vs Hyundai Xcent: Specification Comparison

టాటా టైగర్: ప్రత్యేకమైన కూపే లాంటి రూఫ్‌లైన్, లక్షణాలు మరియు తక్కువ ధర కోసం కొనండి

ఈ సబ్ -4m సెడాన్ డిజైన్‌ చేయడంలో టాటా కొద్దిగా భిన్నమైన విధానాన్ని తీసుకుంది. ఇది ప్రత్యేకమైన కూపే లాంటి రూఫ్ ను కలిగి ఉంది, దీనిని కార్‌మేకర్ ‘స్టైల్‌బ్యాక్’ డిజైన్ అని పిలుస్తారు. ఇది అన్నికంటే సరమైన ధరలో కొనుక్కొనే కారు అని చెప్పవచ్చు . ఇది 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.05-లీటర్ డీజిల్ అనే రెండు ఇంజిన్ల ఎంపికతో లభిస్తుంది, రెండూ 5-స్పీడ్ మాన్యువల్‌ తో జతచేయబడ్డాయి. పెట్రోల్ ఇంజిన్ మాత్రమే 5-స్పీడ్ AMT ఎంపికను పొందుతుంది మరియు ఇది మాత్రమే BS6 ఎరాలో అప్‌డేట్ అవుతుంది. 70PS పవర్ / 140Nm టార్క్ ని అందించే డీజిల్ మోటారు ఏప్రిల్ 2020 నాటికి నిలిపివేయబడుతుంది. టైగర్ యొక్క ఫీచర్ జాబితాలో డ్యూయల్-టోన్ 15- ఇంచ్ అలాయ్స్, డార్క్-నేపథ్య ఇంటీరియర్, ఆటో AC మరియు హర్మాన్ నుండి 8-స్పీకర్ ఆడియో తో 7- ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉన్నాయి. 

Cars In Demand: Maruti Dzire, Honda Amaze Top Segment Sales In August 2019

వోక్స్వ్యాగన్ అమియో: ఫీచర్స్ మరియు డ్రైవింగ్ ఫీల్ కోసం కొనండి

వోక్స్వ్యాగన్ అమియో కూడా BS 6 ఎరాలో పెట్రోల్ తో మాత్రమే అందించబడే మోడల్‌ గా మారబోతోంది. ఇది ప్రస్తుతం 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ (76 పిఎస్ / 95 ఎన్ఎమ్) మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ (110 పిఎస్ / 250 ఎన్ఎమ్) తో లభిస్తుంది, రెండూ 5-స్పీడ్ మాన్యువల్‌ తో జతచేయబడ్డాయి. అయితే, డీజిల్ మోటారు 7-స్పీడ్ DSG యొక్క ఎంపికను పొందుతుంది, ఈ విభాగంలో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనేది మంచి పనితీరుని అందిస్తుందని చెప్పవచ్చు. పోలో పై ఆధారపడి ఉన్న అమియో కొంచెం తక్కువ క్యాబిన్ స్పేస్ ని కలిగి ఉన్నా కాని  ఔత్సాహికులకు స్పోర్టి డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ఇది క్రూయిజ్ కంట్రోల్, రియర్ AC వెంట్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, ఆటో AC మరియు మరిన్నిలక్షణాలతో బాగా అమర్చబడి ఉంది. 

Buy Or Hold: Wait For Hyundai Aura Or Go For Rivals?

హ్యుందాయ్ ఆరా: సౌకర్య లక్షణాల కోసం మరియు పనితీరు కోసం చుస్తే గనుక దీని కోసం వేచి ఉండండి

హ్యుందాయ్ ఆరా యొక్క ఇంటీరియర్ ఇంకా వెల్లడి కాలేదు, అయితే ఇది గ్రాండ్ i10 నియోస్‌ పై ఆధారపడి ఉంటుందని భావిస్తున్నారు. కాబట్టి, హ్యుందాయ్ ఆరాలో ఆటో మరియు ఆపిల్ కార్ప్లేతో 8.0-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ మరియు హ్యాచ్‌బ్యాక్ వంటి వెనుక AC వెంట్స్ వంటి లక్షణాలను కలిగి ఉంటుందని భావిస్తున్నాము. ఆరా మూడు BS 6 ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది - 1.2-లీటర్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్లు మరియు కొత్త 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్. దీనికి CNG వేరియంట్ కూడా లభిస్తుంది. టర్బో-పెట్రోల్ వేరియంట్ 100 పిఎస్ శక్తిని మరియు 172 ఎన్ఎమ్ టార్క్ ని 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ తో BS 6 యుగంలో పనితీరు ఎంపికగా అందిస్తుంది.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన హ్యుందాయ్ aura

Read Full News
  • మారుతి డిజైర్
  • టాటా టిగోర్
  • హోండా ఆమేజ్
  • ఫోర్డ్ ఆస్పైర్
  • హ్యుందాయ్ aura
ఎక్కువ మొత్తంలో పొదుపు!!
% ! find best deals on used హ్యుందాయ్ cars వరకు సేవ్ చేయండి
వీక్షించండి ఉపయోగించిన <MODELNAME> లో {0}

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

Ex-showroom Price New Delhi
×
మీ నగరం ఏది?