• English
  • Login / Register

మార్చి 2023లో విడుదల కానున్న 4 కొత్త కార్‌లు ఇవే

సిట్రోయెన్ ఈసి3 కోసం tarun ద్వారా ఫిబ్రవరి 28, 2023 11:56 am ప్రచురించబడింది

  • 46 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

కొత్త తరం సెడాన్ మరియు దాని ఫేస్‌లిఫ్టెడ్ ప్రత్యర్థితో పాటు కొత్త SUV-క్రాస్‌ఓవర్ ఈ మార్చిలో మార్కెట్‌లోకి ప్రవేశించనున్నాయి.

Upcoming Cars March 2023

2023 సంవత్సరం మూడవ నెలలో అతి ముఖ్యమైన కొన్ని వాహనాలు విడుదల అవ్వనున్నాయి. పూర్తిగా-కొత్త జనరేషన్ సెడాన్‌ను హ్యుందాయ్ ప్రవేశపెట్టనుంది, తన ప్రధాన పోటీదారు అయిన హోండా నుండి కూడా ఒక నవీకరణను ఆశించవచ్చు. అంతేకాకుండా, మారుతి నుండి కొత్త క్రాస్ఓవర్-SUV, కొత్త ఎలక్ట్రిక్ హ్యాచ్ؚబ్యాక్ కూడా రావచ్చు. 

ఈ నాలుగు కార్‌లు మార్చి నెలలో వస్తాయని ఆశిస్తున్నాము

కొత్త హ్యుందాయ్ వెర్నా

New Hyundai Verna front design sketch

విడుదల తేదీ – 21 మార్చి

అంచనా ధర –రూ. 10 లక్షల నుండి

సరికొత్త వెర్నాను మార్చిలో విడుదల చేయబోతున్నట్లు హ్యుందాయ్ ధృవీకరించింది. ఈ సెడాన్ బుకింగ్ؚలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి, ఇది నిలిపివేస్తున్న మోడల్ కంటే స్పోర్టీగా-కనిపిస్తుందని ముందుగా విడుదలైన స్కెచ్ؚలు సూచిస్తున్నాయి. కొత్త వెర్నా పెద్దదిగా, మరింత ఎక్కువ ధరతో వస్తుంది. ఫీచర్‌ల విషయానికి వస్తే మరింత పెద్దదైన టచ్ స్క్రీన్ సిస్టమ్, కొత్త డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, ADASలు ఉంటాయని ఆశిస్తున్నాము. డీజిల్ ఇంజన్ؚను నిలిపివేసి, 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ؚను కొనసాగించనున్నాను. అంతేకాకుండా, కొత్త వెర్నా 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ؚతో వస్తుంది, ఇది 160PS పవర్‌ను విడుదల చేస్తుంది. 

నవీకరించబడిన హోండా సిటీ

విడుదల తేదీ – 2 మార్చి

అంచనా ధర –రూ.11 లక్షల నుండి

Honda City facelift

వెర్నా పోటీదారు కూడా మార్చి ప్రారంభంలో తేలికపాటి నవీకరణలతో ముందుకు రానుంది. కొత్త హోండా సిటీ వాహనం లోపలి భాగం, వెలుపలి భాగంలో తేలికపాటి మార్పులను పొందనుంది, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్‌లు, వైర్ؚలెస్ ఫోన్ చార్జర్, ADAS (హైబ్రిడ్ వేరియెంట్ నుండి) వంటి కొత్త ఫీచర్‌లు ఉంటాయని అంచనా. ఇటీవల సమాచారం బట్టి, ఈ నవీకరణతో సిటీ మరింత చవకైన ‘SV’ వేరియెంట్ؚను కూడా పొందుతుంది. అంతేకాకుండా, దీని ప్రతిరూపం అయిన హైబ్రిడ్ వాహనం మరింత ప్రాప్యతను కలిగి ఉండే ‘V’ వేరియెంట్‌తో వస్తుందని అంచనా. ఈ సెడాన్ 1.5-లీటర్ పెట్రోల్, బలమైన-హైబ్రిడ్ పవర్ ట్రెయిన్ؚలను కొనసాగిస్తుంది అయితే BS6 ఫేజ్2కు అనుగుణంగా ఇవి ఉంటాయి. 

మారుతి ఫ్రాంక్స్ 

అంచనా విడుదల తేదీ – మార్చి మధ్యలో

అంచనా ధర – రూ. 8 లక్షల నుండి

Maruti Fronx front

ఫ్రాంక్స్ SUV-క్రాస్ ఓవర్ ధరలను మారుతి మార్చి మధ్యలో వెల్లడిస్తుందని ఆశిస్తున్నాం. ఫ్రాంక్స్ వాహనం బాలెనో, గ్రాండ్ విటారాల మిశ్రమ స్టైలింగ్‌తో ఉండబోతుంది. దీని క్యాబిన్ బాలెనో క్యాబిన్ؚను పోలి ఉంటుంది, మారుతి SUV నుండి తీసుకున్న బలమైన-హైబ్రిడ్‌లు కొన్ని ముఖ్య అంశాలు కూడా ఉంటాయి. ఈ వాహనం బాలెనో 1.2-లీటర్ పెట్రో ఇంజన్ؚను పొందుతుంది, ఫ్రాంక్స్ మారుతి 1-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ؚను మైల్డ్-హైబ్రిడ్ వెర్షన్‌తో తిరిగి తెస్తుంది. ఫీచర్‌ల విషయానికి వస్తే ఫ్రాంక్స్ؚలో తొమ్మిది-టచ్ స్క్రీన్ సిస్టమ్, వైర్ؚలెస్ చార్జర్, హెడ్-అప్ డిస్ప్లే, 360-డిగ్రీ కెమెరా, ఆరు వరకు ఎయిర్ బ్యాగ్ؚలను కలిగి ఉంటుంది. 

ఇది కూడా చదవండి: మారుతి ఫ్రాంక్స్ అంచనా ధరలు: బాలెనో కంటే దీని ధర ఎంత ఎక్కువ ఉంటుంది?

సిట్రోయెన్ eC3 

అంచనా విడుదల తేదీ – మార్చి ప్రారంభంలో

అంచనా ధర – రూ 11 లక్షల నుండి

Citroen eC3

C3 హ్యాచ్ؚబ్యాక్ ఎలక్ట్రిక్ వర్షన్ అమ్మకాలు మార్చి ప్రారంభంలో మొదలవుతాయని అంచనా. ఈ వాహనం దీని పెట్రోల్ వాహనానికి ప్రతిరూపంగా కనిపిస్తుంది, ఇందులో ఎగ్జాస్ట్ పైప్ ఉండదు. ఇది 320 కిమీ మైలేజ్ అందిస్తుంది అని అంచనా (ARAI-దృవీకరించింది) 29.2kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. eC3 మరింత వేగంగా 57PS, 143Nm పవర్, టార్క్‌ను అందిస్తుంది. ఫీచర్‌ల విషయానికి వస్తే ఇది తన ప్రతిరూపమైన పెట్రోల్ వాహనంలో ఉన్న విధంగానే ఉంటాయి, ఇందులో 10-అంగుళాల టచ్-స్క్రీన్ సిస్టమ్, కీలెస్ ఎంట్రీ, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ؚబ్యాగ్ؚలు ఉంటాయి. 

టయోటా ఇన్నోవా క్రిస్టా

Toyota Innova Crysta

అంచనా విడుదల తేదీ – మార్చి మధ్యలో

అంచనా ధర – రూ. 20 లక్షల నుండి

ఇన్నోవా క్రిస్టా అమ్మకాలు ఫిబ్రవరి నుంచి ప్రారంభమవుతాయని ఆశించాము, కానీ అది జరగలేదు, ఇప్పుడు, ఈ MPV ధరలు ఈ నెలలో వెల్లడి అవుతాయని ఆశిస్తున్నాము. కొత్త జనరేషన్ ఇనోవా ఇప్పటికే మార్కెట్‌లో అందుబాటులో ఉంది, పాత మోడల్ మాత్రం ఏకైక డీజిల్-మాన్యువల్ రూపంలో మార్కెట్‌లో కొనసాగుతుంది. ఆటోమ్యాటిక్ ప్రొజెక్టర్ హెడ్ؚల్యాంపులు, పవర్డ్ డ్రైవర్ సీట్, టచ్ؚస్క్రీన్ సిస్టమ్, క్రూజ్ కంట్రోల్, ఏడు వరకు ఎయిర్ؚబ్యాగ్ؚలు వంటి ఫీచర్‌లతో బహుళ వేరియెంట్‌లు అందుబాటులో ఉంటాయి. 

ఈ కార్‌లు మాత్రమే కాకుండా కొత్త-జెన్ లెక్సస్ RH, మారుతి బ్రెజ్జా CNG ధరలు కూడా వెల్లడిస్తారని ఆశిస్తున్నాము. ఈ కార్‌లు ఆశించిన విధంగా ఫిబ్రవరి నెలలో విడుదల కాలేదు.

was this article helpful ?

Write your Comment on Citroen ఈసి3

explore similar కార్లు

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience