కేవలం డీజిల్ ఇంజన్ ఎంపికతో తిరిగి వచ్చి, బుకింగ్ؚలను ప్రారంభించిన టయోటా ఇన్నోవా క్రిస్టా
టయోటా ఇన్నోవా హైక్రాస్ కోసం sonny ద్వారా జనవరి 30, 2023 12:19 pm ప్రచురించబడింది
- 73 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఇకపై దీని పెట్రోల్, ఆటోమ్యాటిక్ ఎంపికలు అందుబాటులో ఉండవు, కానీ సరికొత్త ముందు భాగంతో వస్తుంది
-
ఇన్నోవా హైక్రాస్ మార్కెట్‌లోకి వచ్చే ముందు ఇన్నోవా క్రిస్టా బుకింగ్ؚలు నిలిపివేయబడ్డాయి.
-
ఇది ఇప్పుడు కేవలం ఐదు-స్పీడ్‌ల మాన్యువల్ؚతో జత చేయబడిన 2.4-లీటర్ డీజిల్ ఇంజన్ؚతో తిరిగి వచ్చింది.
-
అవే నాలుగు వేరియెంట్ؚలతో అందించబడుతుంది, రూ. 50,000తో బుకింగ్ؚలు ప్రారంభమయ్యాయి.
-
ముఖ్యమైన అంశాలలో పవర్ అడ్ؚజస్టబుల్ డ్రైవర్ సీట్, ఆటో AC మరియు ఏడు ఎయిర్ؚబ్యాగ్ؚలు ఉన్నాయి.
-
రూ.20 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో ప్రారంభమయ్యే త్వరలోనే లాంచ్ చేయబడుతుంది అని ఆశిస్తున్నాము.
ఇన్నోవా హైక్రాస్ కోసం మార్గాన్ని సులభం చేయడానికి మార్కెట్ నుంచి కొంత విరామం తీసుకున్న తర్వాత, టయోటా ఇన్నోవా క్రిస్టా మళ్ళీ తిరిగి వచ్చింది. ఇప్పుడు ఇది కేవలం డీజిల్-మాన్యువల్ పవర్ ట్రెయిన్ؚతో ఇంతకు ముందువలే G, Gx, Vx అలాగే Zx వంటి నాలుగు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. నవీకరించిన క్రిస్టా బుకింగ్ ఇప్పుడు రూ.50,000 ముందస్తు డిపాజిట్‌తో ప్రారంభమయ్యాయి.
హైక్రాస్ؚకు ప్రత్యామ్నాయంగా (పోల్చినప్పుడు) క్రిస్టా చవకైనదిగా నిలుస్తుంది. ఇది ఐదు-స్పీడ్ మాన్యువల్ తో జత చేయబడిన 2.4 లీటర్ ల డీజిల్ యూనిట్ ను (రాబోయే ఉద్గార ప్రమాణాలను అందుకునేందుకు నవీకరించబడవచ్చు) నిలుపుకుంది, ఆరు-స్పీడ్‌ల ఆటోమ్యాటిక్ ట్రాన్స్ؚమిషన్ؚను విడిచిపెట్టింది. ఇప్పటి వరకు, ఇంజన్ 150PS మరియు 343Nmగా రేటింగ్ కలిగి ఉంది, కానీ దీని పనితీరు గణాంకాలు, నవీకరించిన మోడల్ؚలో కొద్దిగా భిన్నంగా ఉండవచ్చు.
హైక్రాస్ؚ పోలీకతో, ఇన్నోవా క్రిస్టా ఇప్పుడు నవీకరించిన ముందు భాగంతో ఆకర్షణీయమైన లుక్ తో వస్తుంది. దీని ఫీచర్ ల జాబితాలో ఎనిమిది-విధాలుగా సర్దుబాటు చేయగల పవర్ డ్రైవర్ సీట్, ఎనిమిది-అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోؚటైన్ؚమెంట్ సిస్టమ్, వెనుక వెంట్ؚతో ఆటో AC మరియు యాంబియంట్ లైటింగ్ కూడా ఇందులో ఉన్నాయి. భద్రత విషయానికి వస్తే, ఈ MPV ఏడు ఎయిర్ బ్యాగ్ؚలు, ముందు మరియు వెనుక పార్కింగ్ సెన్సర్ؚలు, వెహికిల్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ అసిస్ట్ؚలను కలిగి ఉంది.
ఇన్నోవా క్రిస్టా ఇప్పుడు బుక్ చేసుకునేందుకు అందుబాటులో ఉంది, ఇది వైట్ పర్ల్ క్రిస్టల్ షైన్, సూపర్ వైట్, సిల్వర్, ఆటిట్యూడ్ బ్లాక్ మరియు అవాంట్ గార్డ్ బ్రాంజ్ గల ఐదు రంగులలో వస్తుంది. ఇందులో ఏడు-సీట్ ల లేఅవుట్ؚ ప్రామాణికంగా ఉంది. G, Gx మరియు Vx వేరియంట్ లలో ఎనిమిది-సీటర్ లేఅవుట్ ఎంపిక కూడా అందుబాటులో ఉంది.
ఇది కూడా చదవండి: టయోటా ఇన్నోవా హైక్రాస్ Vs MPV పోటీదారులు – ధరల తనిఖీ
కేవలం డీజిల్ వెర్షన్ టయోటా ఇన్నోవా క్రిస్టా ధర సుమారు రూ.20 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుందని ఆశిస్తున్నాము, బేస్-స్పెక్ పెట్రోల్ ఇన్నోవా హైక్రాస్ కంటే దీని ఖరీదు ఎక్కువ. అయితే, ఇప్పటికీ క్రిస్టా, అనేక ఫీచర్ లతో నిండిన హైక్రాస్ హైబ్రిడ్ వేరియెంట్ కంటే తక్కువ ధరకే వస్తుంది. ఈ రెండు MPVలు కియా కేరెన్స్ؚ కంటే అధిక స్థానంలో, కియా కార్నివాల్ కంటే క్రింది స్థానంలో ఉన్నాయి.
ఇక్కడ మరింత చదవండి: టయోటా ఇన్నోవా హైక్రాస్ ఆటోమ్యాటిక్
0 out of 0 found this helpful