కొత్త హ్యుందాయ్ వెర్నాలో ఉండే ఈ 5 ఫీచర్‌లు కేవలం టర్బో వేరియెంట్‌లకు మాత్రమే ప్రత్యేకం
హ్యుందాయ్ వెర్నా కోసం ansh ద్వారా మార్చి 23, 2023 09:51 pm ప్రచురించబడింది
- 52 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
శక్తివంతమైన పవర్‌ట్రెయిన్ؚలు మాత్రమే కాకుండా, టర్బో వేరియెంట్ؚలు భిన్నమైన క్యాబిన్ థీమ్ మరియు మరిన్ని ఫీచర్‌లను కూడా పొందాయి
హ్యుందాయ్ ఎట్టకేలకు ఆరవ-జనరేషన్ వెర్నాؚను విడుదల చేసింది, ఇది ఇప్పుడు ఆకర్షణీయమైన కొత్త డిజైన్, భారీ కొలతలు మరియు ఎన్నో కొత్త ఫీచర్‌లతో వస్తుంది. ఈ సెడాన్ రెండు పెట్రోల్ ఇంజన్ ఎంపికలతో వస్తుంది: ఒక 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరాటెడ్ యూనిట్ (115PS మరియు 144Nm) మరియు 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ (160PS మరియు 253Nm). టర్బోచార్జెడ్ ఇంజన్ؚతో వస్తున్న వెర్నా శక్తివంతమైనది మాత్రమే కాకుండా మరింత ఇంధన సామర్ధ్యన్ని కూడా కలిగి ఉంది. అంతేకాకుండా, కొన్ని ప్రత్యేకమైన అంశాలతో వస్తుంది.
స్పోర్టీయర్ ఎక్స్ؚటీరియర్
టర్బో-పెట్రోల్ ఇంజన్ؚను 2023 వెర్నా టాప్-స్పెక్ SX మరియు SX(O) వేరియంట్‌లలో అందిస్తున్నారు. ఈ వేరియెంట్ మరియు పవర్‌ట్రెయిన్ కాంబోలో మాత్రమే డ్యూయల్-టోన్ ఎక్స్ؚటీరియర్ రంగుల ఎంపిక, ఎరుపు రంగు ఫ్రంట్ బ్రేక్ క్యాపిలర్స్ మరియు నలుపు రంగు 16-అంగుళాల అలాయ్ వీల్స్ ఉంటాయి. వీటి ఫీచర్‌లు ఈ మెరుగైన పనితీరు ఆధారిత వేరియెంట్‌లను స్పోర్టీ స్టైలింగ్ డీటైల్స్ؚతో ప్రత్యేకంగా నిలుపుతాయి.
విభిన్న క్యాబిన్ థీమ్
నాన్-టర్బో వేరియెంట్ؚలు డ్యూయల్-టోన్ నలుపు మరియు లేత-గోధుమ రంగు క్యాబిన్ థీమ్ؚతో వస్తాయి, టర్బో వేరియెంట్ؚలు పూర్తి నలుపు క్యాబిన్ؚతో కలిగి స్టీరింగ్ వీల్, గేర్ షిఫ్టర్, అప్ؚహోల్ؚస్ట్రీ మరియు డోర్ హ్యాండిల్స్ లోపల ఎరుపు రంగు ఇన్సర్ట్ؚతో వస్తాయి. డ్యాష్ؚబోర్డు అంతటా ఎరుపు రంగు యాంబియంట్ లైట్ స్ట్రిప్ కూడా ఉంటుంది. ఈ ఎరుపు రంగు ఇన్సర్ట్ؚలు లోపల నుండి కూడా టర్బో వేరియెంట్‌ల స్పోర్టీ భావనను పెంచుతాయి.
మరిన్ని ADAS ఫీచర్‌లు
కొత్త హ్యుందాయ్ వెర్నా ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్, ఫార్వర్డ్ కొలిషన్ అవాయిడెన్స్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, లేన్-కీప్ అసిస్ట్, హై బీమ్ అసిస్ట్ మరియు డ్రైవర్ అటెన్షన్ వార్నింగ్ వంటి రాడార్-ఆధారిత ADASతో వస్తుంది. అయితే, లీడింగ్ వెహికిల్ డిపార్చర్ అలర్ట్ మరియు అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్‌లు టాప్-స్పెక్ టర్బో-పెట్రోల్ DCT SX(O) వేరియెంట్ؚలలో ప్రత్యేకంగా ఉంటాయి.
రేర్ డిస్క్ బ్రేక్ؚలు
SX(O) టర్బో DCT వేరియెంట్ؚలకు మాత్రమే పరిమితం అయిన మరొక ఫీచర్ వెనుక డిస్క్ బ్రేక్ؚలు. ఇతర అన్ని వేరియెంట్‌లలో రేర్ డ్రమ్ బ్రేక్ؚలు ఉంటాయి.
ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్
ఫీచర్ పరంగా పెద్ద తేడా కాకపోయినా, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ కారుకు మరింత ప్రీమియం భావనను కలిగిస్తుంది మరియు సౌకర్యవంతంగా చేస్తుంది. వెర్నా టర్బో వర్షన్ టాప్-స్పెక్ SX(O) DCT వేరియెంట్ؚలో మాత్రమే ఈ ఫంక్షన్ ఉంటుంది. సెడాన్ ఇతర వేరియెంట్ؚలు అన్నీ సంప్రదాయ హ్యాండ్ బ్రేక్ؚతో వస్తాయి.
ఇది కూడా చదవండి: సరికొత్త హ్యుందాయ్ వెర్నా వేరియెంట్-వారీ ఫీచర్‌లను కనుగొనండి
2023 హ్యుందాయ్ వెర్నా ధర రూ.10.90 లక్షల నుండి రూ.17.38 లక్షల వరకు ఉంటుంది, టర్బో-పెట్రోల్ వేరియెంట్ؚల ధర రూ.14.84 లక్షల (ప్రారంభ ధర, ఎక్స్-షోరూమ్) వద్ద ప్రారంభమవుతుంది. ఇది హోండా సిటీ, స్కోడా స్లావియా,వాక్స్వాగన్ విర్టస్ మరియు మారుతి సియాజ్ؚలతో పోటీని కొనసాగిస్తుంది.
ఇక్కడ మరింత చదవండి: వెర్నా ఆన్ؚరోడ్ ధర
0 out of 0 found this helpful