• English
  • Login / Register

సరికొత్త హ్యుందాయ్ వెర్నా వేరియెంట్-వారీ ఫీచర్లు

హ్యుందాయ్ వెర్నా కోసం tarun ద్వారా మార్చి 24, 2023 12:53 pm ప్రచురించబడింది

  • 49 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

సరికొత్త వెర్నా నాలుగు వేరియెంట్ؚలలో, అదే సంఖ్యలో పవర్‌ట్రెయిన్ ఎంపికలతో లభిస్తుంది.

Hyundai Verna 2023

కొత్త హోండా సిటీ, స్కోడా స్లావియా మరియు వోక్స్వాగన్ విర్టస్ వంటి కొత్త మోడల్‌లతో ఇటీవల కాంపాక్ట్ సెడాన్ విభాగం కొంత మేరకు పునరుద్ధరించబడింది అని చెప్పవచ్చు. తన ముందు జనరేషన్ వేరియెంట్ కంటే పెద్దదైన, నాణ్యమైన, సాంకేతికతను కలిగి ఉండి మరింత శక్తివంతమైన ఆరవ-జనరేషన్ వెర్నాతో హ్యుందాయ్ ఈ విభాగంలో అడుగుపెట్టింది. స్టైల్  పరంగా ఇది మరింత స్పోర్టీగా మరియు దూకుడుగా ఉంటుంది. కొత్త వెర్నా శ్రేణి పరిచయ ధరలు రూ.10.90 లక్షల నుండి రూ.17.38 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటాయి.

ఈ సెడాన్ 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ (NA) మరియు టర్బో-పెట్రోల్ ఇంజన్‌లతో వస్తుంది, ఇవి రెండు 6-స్పీడ్‌ మాన్యువన్ ట్రాన్స్ؚమిషన్ؚతో జత చేయబడి ప్రామాణికంగా వస్తాయి. నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజన్ CVT ఎంపికను పొందుతుంది, టర్బో యూనిట్ 7-స్పీడ్‌ DCT (డ్యూయల్ క్లచ్ ట్రాన్స్ؚమిషన్) ఆటోమ్యాటిక్ؚతో వస్తుంది.  

ఇది కూడా చదవండి: 10 చిత్రాలలో కొత్త హ్యుందాయ్ వెర్నా ఫస్ట్ లుక్

కొత్త వెర్నా నాలుగు విస్తృత వేరియెంట్ؚలలో అందుబాటులో ఉంటుంది: EX, S, SX మరియు SX (O) మరియు ప్రతిదానిలో ఉండే ఫీచర్‌లను ఇక్కడ అందించాము:

హ్యుందాయ్ వెర్నా EX వేరియెంట్

Hyundai Verna 2023

(డ్యూయల్-టోన్ రిఫరెన్స్ కోసం చిత్రం ఉపయోగించబడింది)

ధర: రూ. 10.90 లక్షలు 

పవర్‌ట్రెయిన్: ఆరు-స్పీడ్‌ల MTతో 1.5-లీటర్ పెట్రోల్ 

ఎక్స్ؚటీరియర్

ఇంటీరియర్ 

సౌకర్యం మరియు అనుకూలత 

ఇన్ఫోటైన్ؚమెంట్ 

భద్రత 

  • ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ؚలు
  • గ్రిల్ؚకు నలుపు రంగు క్రోమ్ ఫినిష్ 
  • కవర్‌లతో 15-అంగుళాల స్టీల్ వీల్  
  • డ్యూయల్-టోన్ నలుపు రంగు మరియు గోధుమ రంగు థీమ్
  • పార్కింగ్ బ్రేక్ మరియు డోర్ హ్యాండిల్స్ కోసం మెటల్ ఫినిష్ 
  • ఎత్తును సవరించగలిగే డ్రైవర్ సీట్ 
  • ఫ్రంట్ మరియు రేర్ సర్దుబాటు చేయగలిగిన హెడ్ؚరెస్ట్ؚలు​​​​​​​
  • కప్ హోల్డర్ؚలతో రేర్ సెంటర్ ఆర్మ్ రెస్ట్ 

​​​​​​​

  • ఫ్రంట్ మరియు రేర్ పవర్ విండోలు 
  • మాన్యువల్ AC​​​​​​​
  • టిల్ట్‌ను సర్దుబాటు చేయగలిగిన స్టీరింగ్ ​​​​​​​
  • ఫ్రంట్ మరియు రేర్ USB టైప్-C చార్జర్ ​​​​​​​
  • ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ORVMలు

-

  • ఆరు ఎయిర్ؚబ్యాగ్ؚలు​​​​​​​
  • EBDతో ABS 
  • రివర్స్ పార్కింగ్ సెన్సర్‌లు​​​​​​​
  • ఆటోమ్యాటిక్ హెడ్ؚల్యాంప్ؚలు​​​​​​​
  • రేర్ డిఫోగ్గర్ ​​​​​​​
  • అన్ని సీట్‌లకు సీట్ బెల్ట్ రిమైండర్​​​​​​​
  • అన్ని సీట్‌లకు మూడు పాయింట్‌ల సీట్ బెల్ట్ؚలు​​​​​​​
  • ISOFIX చైల్డ్ సీట్ మౌంట్ؚలు

బేస్-స్పెక్ EX వేరియెంట్ ఆరు ఎయిర్ బ్యాగ్ؚలు, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్ؚలు మరియు ఆటోమ్యాటిక్ హెడ్‌ల్యాంప్ؚలతో తగినన్ని ఫీచర్‌లు ఉన్న భద్రతా ప్యాకేజీని కలిగి ఉంటుంది. అంతేకాకుండా, ఈ వేరియంట్ చాలా ప్రాథమికమైనది, ఇందులో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు వెనుక AC వెంట్‌ల ఉండవు. ఈ వేరియంట్ కేవలం పెట్రోల్-మాన్యువల్ పవర్‌ట్రెయిన్‌కు మాత్రమే పరిమితం చేయబడింది.

హ్యుందాయ్ వెర్నా S వేరియెంట్

Hyundai Verna 2023

ధర: రూ. 11.96 లక్షలు 

పవర్‌ట్రెయిన్: 6-స్పీడ్ MTతో 1.5-లీటర్ పెట్రోల్ 

ఫీచర్‌లు:

(వెర్నా EX వేరియెంట్ తరువాత వేరియెంట్)

ఎక్స్ؚటీరియర్ 

ఇంటీరియర్ 

సౌకర్యం మరియు అనుకూలత 

ఇన్ఫోటైన్ؚమెంట్

భద్రత                                                                                    

  • హారిజన్ LED పొజిషనింగ్ ల్యాంప్ؚలు మరియు DRLలు​​​​​​​
  • కనెక్టెడ్ LED టెయిల్ ల్యాంప్ؚలు​​​​​​​
  • టర్న్ ఇండికేటర్స్ ఆన్ ORVMలు​​​​​​​
  • 15-అంగుళాల ఆలాయ్ వీల్స్​​​​​​​
  • షార్క్ ఫిన్ ఆంటెనా
  • స్లైడింగ్ ఫ్రంట్ సెంటర్ ఆర్మ్ؚరెస్ట్ 
  • ఐడిల్ స్టాప్ మరియు గో ​​​​​​​
  • ఆటోమ్యాటిక్ AC​​​​​​​
  • రేర్ AC వెంట్ؚలు​​​​​​​
  • కూల్డ్ గ్లోవ్ బాక్స్​​​​​​​
  • టెలిస్కోపిక్ స్టీరింగ్ అడ్జస్ట్ 
  • క్రూజ్ కంట్రోల్ ​​​​​​​
  • ఆడియో మరియు ఫోన్ కంట్రోల్ؚలతో స్టీరింగ్ వీల్ 
  • 8-అంగుళాల టచ్ؚస్క్రీన్ ఇన్ఫోటైన్ؚమెంట్  ​​​​​​​
  • అండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్ؚప్లే​​​​​​​
  • వాయిస్ అసిస్ట్​​​​​​​
  • ఫ్రంట్ మరియు రేర్ స్పీకర్‌లు ​​​​​​​
  • డిజిటైజ్ చేయబడిన ఇన్ؚస్టృؚమెంట్  క్లస్టర్
  •  

 

  • హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్ ​​​​​​​
  • ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ​​​​​​​
  • TPMS​​​​​​​
  • వెహికిల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్ 

ఆటోమ్యాటిక్ AC, రేర్ AC వెంట్‌లు, క్రూజ్ కంట్రోల్ మరియు 8-అంగుళాల టచ్ స్క్రీన్ సిస్టమ్ؚ వంటి ఫీచర్‌లతో కొన్ని అవసరమైన జోడింపులను S వేరియెంట్ పొందింది. ఇది సరికొత్త వెర్నా ప్రత్యేకమైన లైటింగ్ ఎలిమెంట్ؚలు(ముందు మరియు వెనుక భాగంలో) కలిగిన ఎంట్రీ-లెవెల్ వేరియెంట్. హిల్ స్టార్ట్ అసిస్ట్, ESC, మరియు TPMSలతో ఇందులో భద్రత స్థాయి మెరుగ్గా ఉంటుంది. అయితే రేర్ కెమెరా లేదా ఆటోమ్యాటిక్ ట్రాన్స్ؚమిషన్ ఎంపిక లేదు. 

వెర్నా SX వేరియెంట్ 

Hyundai Verna 2023

ధర: రూ.12.99 లక్షల నుండి రూ.14.24 లక్షల వరకు 

ఇంజన్: 6-స్పీడ్ MT మరియు IVTతో (ఆటోమ్యాటిక్) 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్

ఫీచర్‌లు:

(వెర్నా S వేరియెంట్ తరువాత వేరియెంట్)

ఎక్స్ؚటీరియర్ 

ఇంటీరియర్

సౌకర్యం మరియు అనుకూలత 

ఇన్ఫోటైన్ؚమెంట్ 

భద్రత 

  • LED హెడ్ؚల్యాంప్ؚలు
  • కార్నరింగ్ ల్యాంప్ؚలు​​​​​​​
  • 16-అంగుళాల ఆలాయ్ వీల్స్ ​​​​​​​
  • క్రోమ్ డోర్ హ్యాండిల్స్ మరియు విండో లైన్ 
  • స్టీరింగ్ వీల్ మరియు గేర్ నాబ్ؚకు లెదరెట్ ఫినిష్ ​​​​​​​
  • ఆంబియెంట్ లైటింగ్ 
  • ప్యాడిల్ షిఫ్టర్ లు (IVT)​​​​​​​
  • ఎలక్ట్రిక్ సన్ؚరూఫ్​​​​​​​
  • డ్రైవ్ మోడ్ ఎంపిక (IVT)​​​​​​​
  • స్మార్ట్ ట్రంక్ ​​​​​​​
  • పుష్ బటన్ స్టార్ట్ ​​​​​​​
  • వైర్ؚలెస్ చార్జర్ ​​​​​​​
  • డ్రైవర్ రేర్ వ్యూ మానిటర్ ​​​​​​​
  • ఆటో-ఫోల్డింగ్ ORVMలు
  • ఆడియో సిస్టమ్ؚకు ఫ్రంట్ ట్వీటర్ లు 
  • ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్ లు​​​​​​​
  • రేర్ పార్కింగ్ కెమెరా ​​​​​​​
  • ఎలక్ట్రో క్రోమిక్ మిర్రర్ ​​​​​​​
  • స్మార్ట్ కీ ​​​​​​​
  • హైట్ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్ బెల్ట్ؚలు

LED హెడ్ؚల్యాంప్ؚలు, భారీ ఆలాయ్ వీల్స్ మరియు కొన్ని క్రోమ్ ఎలిమెంట్‌లతో ఈ వేరియెంట్ వెలుపల వైపు నుంచి చాలా భిన్నంగా మరియు ప్రీమియంగా కనిపిస్తుంది. కానీ లోపలి వైపు ఇది దాదాపుగా S వేరియెంట్ؚ విధంగానే ఉంటుంది. ఎలక్ట్రిక్ సన్ؚరూఫ్, వైర్ؚలెస్ చార్జర్, ఆంబియెంట్ లైటింగ్ జోడించబడ్డాయి, ఆటోమ్యాటిక్ ఎంపికతో ప్యాడిల్ షిఫ్టర్‌లు మరియు డ్రైవ్ మోడ్ؚలు ఉన్నాయి. మరింత సౌకర్యం కోసం ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్‌లు మరియు రేర్ పార్కింగ్ కెమెరాలను జోడించారు. అయితే, కొత్త జనరేషన్ సెడాన్ స్టార్ ఫీచర్‌లు ఈ వేరియెంట్ؚలో లేవు. 

ఇది కూడా చదవండి: 2023 హ్యుందాయ్ వెర్నాను 9 విభిన్న రంగులలో కొనుగోలు చేయవచ్చు

వెర్నా SX (టర్బో)

Hyundai Verna 2023 Turbo

ధర: రూ.14.84 లక్షల నుండి రూ.16.08 లక్షల వరకు

ఇంజన్: ఆరు-స్పీడ్‌ల MT మరియు ఏడు-స్పీడ్‌ల DCTతో 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ 

(SX ఫీచర్‌లకు అదనంగా)

ఎక్స్ؚటీరియర్

ఇంటీరియర్ 

సౌకర్యం మరియు అనుకూలత 

ఇన్ఫోటైన్ؚమెంట్

భద్రత

  • ఎరుపు రంగు బ్రేక్ క్యాలిపర్స్ ​​​​​​​
  • 16-అంగుళాల నల్ల రంగు ఆలాయ్ వీల్స్  ​​​​​​​
  • డ్యూయల్-టోన్ పెయింట్ 
  • రెడ్ యాక్సెంట్ؚతో పూర్తి నలుపు రంగు ఇంటీరియర్  ​​​​​​​
  • మెటల్ పెడల్స్​​​​​​​
  • మెత్తని డోర్ ట్రెయిమ్ మరియు క్రాష్ ప్యాడ్
  • ఇంటిగ్రేటెడ్ ఎయిర్ ప్యూరిఫయ్యర్ 
  • 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్ؚమెంట్  ​​​​​​​
  • బ్లూలింక్ కనెక్టెడ్ కార్ టెక్నాలజీ 
  •  
  • ఎమర్జెన్సీ స్విచ్ؚలతో ఎలెక్ట్రోక్రోమిక్ మిర్రర్ 

అవును, SX వేరియెంట్ టర్బో-పెట్రోల్ వర్షన్ؚ NA SX కంటే అదనపు ఫీచర్‌లను కలిగి ఉంది. ఇది సరికొత్త వెర్నా పనితీరు-ఆధారిత పవర్‌ట్రెయిన్ ఎంట్రీ-లెవెల్ వేరియెంట్. వెలుపల స్పోర్టీ లుక్ కోసం నలుపు రంగు ఆలాయ్ వీల్స్, రెడ్ బ్రేక్ క్యాలిపర్స్ మరియు డ్యూయల్-టోన్ రంగులు (బ్లాక్ రూఫ్ ఎంపిక) ఉంటాయి.

క్యాబిన్ؚలో పూర్తి నలుపు రంగు ఇంటీరియర్, రెడ్ యాక్సెంట్ؚలు, మెటల్ పెడల్స్ؚతో రేసీ అప్పీల్ ఉంటుంది. SX పెట్రోల్ వేరియెంట్‌తో పోలిస్తే, ఇది ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిస్ప్లే, 10.25-అంగుళాల టచ్ؚస్క్రీన్ సిస్టమ్ మరియు మెత్తని మెటీరియల్స్ؚతో ఇది క్యాబిన్ؚను మరింతగా మెరుగు పరిచినట్లు కనిపిస్తుంది. ఇక్కడ డ్రైవ్ మోడ్ؚలు ఆటోమ్యాటిక్ ఎంపికకు మాత్రమే పరిమితం కాదు. 

వెర్నా SX(O)

Hyundai Verna 2023 Variants

ధర: రూ.14.66 లక్షల నుండి రూ.16.20 లక్షల వరకు

ఇంజిన్: 6-స్పీడ్ MT మరియు IVT ఆటోమేటిక్‌తో 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్

(SX టర్బో ఫీచర్‌లకు అదనంగా)

ఎక్స్ؚటీరియర్ 

ఇంటీరియర్ 

సౌకర్యం మరియు అనుకూలత 

ఇన్ఫోటైన్ؚమెంట్ 

భద్రత

 

  • డ్యాష్ؚబోర్డ్‌పై మెత్తని మెటీరీయల్ మరియు డోర్ ట్రిమ్స్ (ఓవర్ SX) ​​​​​​​
  • లెదరెట్ సీట్ అప్ؚహోల్ؚస్ట్రీ 
  • ఫ్రంట్ వెంటిలేటెడ్ మరియు హీటెడ్ సీట్లు
  • పవర్డ్ డ్రైవర్ సీట్ ​​​​​​​
  • మాన్యువల్ రేర్ కర్టైన్ ​​​​​​​
  • ఇంటిగ్రేటెడ్ ఎయిర్ ప్యూరిఫయ్యర్ (ఓవర్ SX)
  • 8- స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్ 
  • బ్లూ లింక్ కనెక్టెడ్ కార్ టెక్ؚతో 10.25-అంగుళాల టచ్ؚస్క్రీన్ ఇన్ఫోటైన్ؚమెంట్ (ఓవర్ SX)  
  • ఎమర్జెన్సీ స్విచ్ؚలతో ఎలక్ట్రోక్రోమిక్ మిర్రర్  (ఓవర్ SX)
  • ADAS (కేవలం IVTలో)
  • రేర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్ మరియు కొలిషన్ అవాయిడెన్స్ 
  • బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ ​​​​​​​
  • స్మార్ట్ క్రూజ్ కంట్రోల్ 
  • ఆటోమ్యాటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ ​​​​​​​
  • లేన్ కీప్ అసిస్ట్ 
  • హై బీమ్ అసిస్ట్ 

SX (O) వేరియెంట్ భిన్నమైన ఆలాయ్ వీల్స్‌ను మినహాయించి పూర్తిగా SX వేరియెంట్ విధంగానే కనిపిస్తుంది. లెదర్ సీట్ అప్ؚహోల్ؚస్ట్రీ మరియు మెత్తని మెటీరియల్స్ؚను చేర్చడంతో క్యాబిన్ మరింత ఖరీదైనదిగా కనిపిస్తుంది. కొత్త ఫీచర్‌లలో, విభాగంలో మొదటిసారి హీటెడ్ మరియు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్‌లు, పవర్డ్ డ్రైవర్ సీట్ కూడా ఉన్నాయి. ఈ వేరియెంట్ USP రాడార్-ఆధారిత ADAS, అయితే, ఇది కేవలం CVT ఆటోమ్యాటిక్ వేరియెంట్ؚలకు మాత్రమే పరిమితం అయ్యింది.

వెర్నా SX (O) టర్బో

Hyundai Verna 2023

ధర: రూ.15.99 లక్షల నుండి రూ.17.38 లక్షల వరకు

ఇంజన్: 6-స్పీడ్‌ల MT మరియు 7-స్పీడ్‌ల DCTతో 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ 

(SX (O) మరియు SX టర్బో ఫీచర్‌లకు అదనంగా)

ఎక్స్ؚటీరియర్ 

ఇంటీరియర్

సౌకర్యం మరియు అనుకూలత 

ఇన్ఫోటైన్ؚమెంట్

భద్రత

 

  • ఓవర్ SX 
  • టర్బో లెదరేట్ సీట్ అప్ؚహోల్ؚస్ట్రీ 
  • ఓవర్ SX టర్బో
  • ఫ్రంట్ వెంటిలేటెడ్ మరియు హీటెడ్ సీట్ؚలు​​​​​​​
  • పవర్డ్ డ్రైవర్ సీట్ ​​​​​​​
  • మాన్యువల్ రేర్ కర్టైన్
  • ఓవర్ SX టర్బో
  • 8-స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్ 
  • రేర్ డిస్క్ బ్రేక్ؚలు (DCT)​​​​​​​
  • ADAS (MT మరియు DCT వేరియెంట్ؚలు రెండిటికీ)
  • అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ (DCT)
  • లీడింగ్ వెహికిల్ డిపార్చర్ అలర్ట్ (DCT)
  • ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్

ఇది అన్ని ప్రధాన ఫీచర్‌లను కలిగి ఉన్న సరికొత్త వెర్నా వేరియెంట్. SX టర్బోతో పోలిస్తే వెలుపలి వైపు ఏకరితిలో ఉంటుంది కానీ లెదర్ అప్ؚహోల్ؚస్ట్రీ, ప్రీమియం ఆడియో సిస్టమ్ మరియు ఫీచర్-లోడెడ్ ముందు సీట్‌లను కలిగి ఉంటుంది. రేర్ డిస్క్ బ్రేక్ؚలు, ADAS (ప్రామాణికం) మరియు ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ؚలతో భద్రతను మెరుగు పరిచారు. SX (O) కంటే ఎక్కువగా, DCT ఎంపికకు పరిమితమైన హ్యుందాయ్ అడాప్ؚటివ్ క్రూయిజ్ కంట్రోల్ దీనిలో ఉంది. 

సరికొత్త హ్యుందాయ్ వెర్నా వేరియెంట్-వారీ వివరాలు ఇవి. ఈ సెడాన్ గురించి మరిన్ని వివరాల కోసం కార్‌దేఖోؚను సందర్శించండి, మేము ఈ కార్ రివ్యూను, మొదటి డ్రైవింగ్ ఇంప్రెషన్ؚను త్వరలోనే పంచుకుంటాము. 

ఇక్కడ మరింత చదవండి: హ్యుందాయ్ వెర్నా ఆన్ؚరోడ్ ధర

 

was this article helpful ?

Write your Comment on Hyundai వెర్నా

explore మరిన్ని on హ్యుందాయ్ వెర్నా

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉంది సెడాన్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience