• English
  • Login / Register

త్వరలోనే రానున్న “టయోటా ఫ్రాంక్స్ ”, 2024 మే నెలలో రావచ్చు!

జూలై 25, 2023 10:25 pm rohit ద్వారా ప్రచురించబడింది

  • 4.4K Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

టయోటా-బ్యాడ్జ్‌తో రానున్న ఫ్రాంక్స్, టయోటా మరియు మారుతి మధ్య ఉన్న ఇతర ఉమ్మడి మోడల్‌ల విధంగానే లోపల మరియు వెలుపల లుక్ పరంగా మరియు బ్యాడ్జింగ్ తేడాలను పొందవచ్చు.

Maruti Fronx

  • టయోటా మరియు మారుతి మధ్య ఇది ఐదవ ఉమ్మడి మోడల్‌గా నిలుస్తుంది.

  • కొత్త సబ్-4మీ ‘SUV’ ఆఫరింగ్ؚగా తమ సొంత ఫ్రాంక్స్ؚను కలిగి ఉండడం టయోటాకు లాభం చేకూరుస్తుంది.

  • CNG పవర్‌ట్రెయిన్ؚతో సహా, మారుతి ఫ్రాంక్స్ؚతో ఇంజన్ ఎంపికలను పంచుకోవచ్చు.

  • ఇందులో 9-అంగుళాల టచ్ؚస్క్రీన్ మరియు ఆటో ACతో సహా ఫ్రాంక్స్ ఫీచర్‌లను కలిగి ఉంటుందని అంచనా.

  • ఇది 2024లో విడుదల కావచ్చు, ధరలు రూ.8 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం కావచ్చు.

మారుతి సుజుకి-టయోటా ఒప్పందంలో భాగంగా పరిచయం చేస్తున్న కొన్ని మోడల్‌లు క్రాస్-బ్యాడ్జ్ ఉత్పత్తులు అని ఇప్పటికే మీరు గమనించే ఉంటారు. కొన్ని ప్రసిద్ది చెందిన మోడల్‌లలో మారుతి గ్రాండ్ విటారా-టయోటా హైరైడర్ SUVలు ఉన్నాయి మరియు ఇటీవలి టయోటా ఇన్నోవా హైక్రాస్-ఆధారిత మారుతి ఇన్విక్టో ప్రీమియం MPV జంట కూడా ఉంది. 2024లో టయోటా మారుతి ఫ్రాంక్స్ సొంత వర్షన్ؚను విడుదల చేస్తుందని సమాచారం.

టయోటాకు ఫ్రాంక్స్ ఎందుకు అవసరం?​​​​​​Maruti Fronx side

టయోటా రీబ్యాడ్జ్ ఫ్రాంక్స్ؚను అందించడానికి ప్రధాన కారణాలలో ఒకటి, దీని భారత పోర్ట్ؚఫోలియోలో సబ్-4మీ SUV లేకపోవడమే, మరొక వైపు, టయోటా ఒప్పంద భాగస్వామి – మారుతి సుజుకి వద్ద ఈ విభాగంలో రెండు మోడల్‌లు ఉన్నాయి, రూ.10 లక్షల కంటే తక్కువ సంభావ్య ప్రారంభ దఃరతో దీని SUV శ్రేణి మరింత అందుబాటులో ఉన్నాయి.

పునశ్చరణ చేసుకుంటే, గతంలో మారుతి విటారా బ్రెజ్జాకు తన సొంత వర్షన్ؚ అయిన అర్బన్ క్రూయిజర్‌ను టయోటా అందించింది, అయితే 2022 చివరిలో దీన్ని నిలిపివేసింది. ప్రస్తుతం, టయోటా SUV పరిధి నేరుగా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ కాంపాక్ట్ SUV నుండి ప్రారంభం అవుతుంది, దీని ప్రారంభ ధర రూ.10 లక్షల కంటే ఎక్కువగా ఉంది (ఎక్స్-షోరూమ్). 

సుపరిచిత పద్ధతి

Maruti Fronx front

బాలెనో-గ్లాంజా మరియు ఇన్నోవా హైక్రాస్-ఇన్విక్టో జంట వంటి జంట కారు తయారీదారుల కొన్ని ఉమ్మడి ఉత్పత్తులలో చూసినట్లు మారుతి క్రాస్ఓవర్ SUV మరియు టయోటా-బ్యాడ్జ్ కలిగిన ఫ్రాంక్స్ؚల మధ్య లుక్ మరియు బ్యాడ్జింగ్ పరంగా కొన్ని తేడాలు ఉంటాయి. ప్రముఖంగా కనిపించే విజువల్ మార్పులలో గ్రిల్, హెడ్‌లైట్ؚలు మరియు ఇంటీరియర్ కలర్ స్కీమ్ ఉంటాయని అంచనా.

ఇది కూడా చదవండి: మారుతి ఇన్విక్టో మరియు టయోటా ఇన్నోవా హైక్రాస్ మధ్య 5 ముఖ్యమైన తేడాలు 

మారుతి ఫ్రాంక్స్ పవర్ؚట్రెయిన్ వివరాలు 

స్పెసిఫికేషన్

1.2-లీటర్ పెట్రోల్

1-లీటర్ టర్బో పెట్రోల్ 

1.2-లీటర్ పెట్రోల్ +CNG

పవర్

90PS

100PS

77.5PS

టార్క్

113Nm

148Nm

98.5Nm

ట్రాన్స్ؚమిషన్

5-స్పీడ్ MT, 5-స్పీడ్ AMT

5-స్పీడ్ MT, 6-స్పీడ్ AT

5-స్పీడ్ MT

క్లెయిమ్ చేసిన మైలేజీ

21.79kmpl, 22.89kmpl

21.5kmpl, 20.1kmpl

28.51km/kg

మారుతి ఫ్రాంక్స్ 1-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ మైల్డ్-హైబ్రిడ్ సాంకేతికతతో వస్తుంది. ఫ్రాంక్స్ టయోటా వర్షన్ కూడా అదే పవర్ؚట్రెయిన్ؚల సెట్ؚతో వస్తుంది అని అంచనా, అలాగే CNG వేరియెంట్ؚలను తరువాత లాంచ్ చేయవచ్చు.

ఉమ్మడి ఫీచర్‌ల జాబితా

Maruti Fronx interior

టయోటా-బ్యాడ్జ్ కలిగిన ఫ్రాంక్స్ దాదాపుగా మారుతి క్రాస్ؚఓవర్ SUVలో ఉండే ఫీచర్‌ల జాబితాతో వస్తుంది అని అంచనా. ఇందులో 9-అంగుళాల టచ్ؚస్క్రీన్, హెడ్స్-అప్ డిస్ప్లే, ఆటో క్లైమేట్ కంట్రోల్ మరియు క్రూయిజ్ కంట్రోల్ ఉండవచ్చు. దీని భద్రతా ఫీచర్‌లలో ఆరు ఎయిర్ؚబ్యాగ్ؚలు, 360-డిగ్రీ కెమెరా, ISOFIX చైల్డ్ సీట్ యాంకరేజీలు మరియు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP) ఉన్నాయి. ఈ ఫీచర్‌లు అన్నీ బాలెనో-గ్లాంజా హ్యాచ్ؚబ్యాక్ؚలలో అందించడం సహాయకరంగా ఉంటుంది.

ఇది కూడా చదవండి: మరింత చల్లదనం పొందండి: రూ.30 లక్షల కంటే తక్కువ ధరలో అందుబాటులో ఉన్న డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ కార్ ల వివరాలు

ధర మరియు పోటీదారులు

Maruti Fronx rear

టయోటా వెర్షన్ ఫ్రాంక్స్ؚ రూ.8 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరను కలిగి ఉండవచ్చు అని అంచనా. దీని పోటీదారులలో మారుతి ఫ్రాంక్స్, సిట్రోయెన్ C3 మరియు కియా సోనెట్, టాటా నెక్సాన్, మారుతి బ్రెజ్జా మరియు హ్యుందాయ్ వెన్యూ వంటి ఇతర సబ్-4మీ SUVలు ఉన్నాయి. 

ఇక్కడ మరింత చదవండి: మారుతి ఫ్రాంక్స్ AMT

was this article helpful ?

Write your వ్యాఖ్య

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
  • కియా syros
    కియా syros
    Rs.9.70 - 16.50 లక్షలుఅంచనా ధర
    ఫిబరవరి, 2025: అంచనా ప్రారంభం
  • M జి Majestor
    M జి Majestor
    Rs.46 లక్షలుఅంచనా ధర
    ఫిబరవరి, 2025: అంచనా ప్రారంభం
  • కొత్త వేరియంట్
    మహీంద్రా be 6
    మహీంద్రా be 6
    Rs.18.90 - 26.90 లక్షలుఅంచనా ధర
    మార, 2025: అంచనా ప్రారంభం
  • కొత్త వేరియంట్
    మహీంద్రా xev 9e
    మహీంద్రా xev 9e
    Rs.21.90 - 30.50 లక్షలుఅంచనా ధర
    మార, 2025: అంచనా ప్రారంభం
  • ఆడి క్యూ6 ఇ-ట్రోన్
    ఆడి క్యూ6 ఇ-ట్రోన్
    Rs.1 సి ఆర్అంచనా ధర
    మార, 2025: అంచనా ప్రారంభం
×
We need your సిటీ to customize your experience