స్విఫ్ట్ మరియు డిజైర్ ఇప్పుడు బేస్ వేరియంట్ నుండి అన్ని వేరియంట్స్ కొరకు ఆప్ష్నల్ ఎయిర్బ్యాగ్స్ మరియు ABS ని కలిగి ఉంటాయి

సవరించబడిన పైన Nov 26, 2015 01:24 PM ద్వారా Sumit for మారుతి స్విఫ్ట్

  • 11 సమీక్షలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

భారతదేశం యొక్క ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి, స్విఫ్ట్ మరియు డిజైర్ యొక్క అన్ని వేరియంట్లకు డ్యుయల్ ఎయిర్బ్యాగ్స్ మరియు ABS వంటి భద్రతా లక్షణాలను అందిస్తామని ప్రకటించింది. ఈ లక్షణాలు ప్రామాణికంగా కాకుండా  ఆప్షనల్ గా అందుబాటులో ఉంటాయి.

 మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్, మార్కెటింగ్ అండ్ సేల్స్ యొక్క  ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మాట్లాడుతూ " స్విఫ్ట్ మరియు డిజైర్ భారతదేశంలో అత్యంత ప్రముఖమైన కార్లు. ఈ రెండూ కూడా భారత ఆటోమొబైల్ పరిశ్రమ రూపొందించడంలో ఒక ప్రముఖ  పాత్ర పోషించాయి. ఈ కార్లు  సమకాలీన స్టైలింగ్, ఉన్నతమైన సౌలభ్యం, సౌకర్యం లక్షణాలు మరియు ప్రదర్శన కోసం ప్రముఖమైనవి. స్విఫ్ట్ మరియు డిజైర్ యొక్క అన్ని వేరియంట్లలో డ్రైవర్ మరియు సహ డ్రైవర్ ఎయిర్బ్యాగ్స్ మరియు యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబిఎస్) వంటి లక్షణాలు అందించడం ద్వారా వినియోగదారుల ఆదరణ మరింతగా పొందవచ్చు." అని వివరించారు.  

స్విఫ్ట్ అమ్మకాల గణాంకాలు దశాబ్దం అంతా గొప్ప ఉన్నాయి మరియు ఈ మోడల్ పోటీ పరంగా ఎదురు లేకుండా అనేక రికార్డులు సృష్టించింది. మరోవైపు, డిజైర్ 2008 లో ప్రారంభించబడింది మరియు 2013 నుండి భారతదేశం యొక్క ఉత్తమంగా అమ్ముడైన ఎంట్రీ సెడాన్ గా ఉద్భవించింది. భారత పాసింజర్ కార్ మార్కెట్లో మొదటి ఐదు కార్లు మధ్య ఒకే ఒక సెడాన్ గా విభాగంలో నాయకుడు గా ఉంటుంది. ఇది కారు పట్ల భారతీయ కొనుగోలుదారుల యొక్క నమ్మకాన్ని చాటుతోంది. మారుతి సుజుకి (డిజైర్ మరియు స్విఫ్ట్) కార్ల యొక్క అమ్మకాలు ఆటోమొబైల్ పరిశ్రమకు ఒక కొత్త నిదర్శకంగా నిలుస్తాయి మరియు వారు ఆర్థిక సంవత్సరం 2014-15 కొరకు నెలకు 17,000 యూనిట్లు సగటున అమ్మకాలు నమోదు చేశారు.       

ఇంకా చదవండి

మరింత చదవండి : మారుతి స్విఫ్ట్

ద్వారా ప్రచురించబడినది

Write your Comment పైన మారుతి స్విఫ్ట్

Read Full News

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

ఎక్స్-షోరూమ్ ధర కొత్త ధర
  • ట్రెండింగ్
  • ఇటీవల
×
మీ నగరం ఏది?