మారుతి స్విఫ్ట్

` 4.7 - 7.4 Lac*

:బ్రాండ్ :మోడల్ నమూనాలు మరియు ధరలు

క్రింద వీక్షించండి - జాబితా యొక్క

ప్రకటన

మారుతి ఇతర కారు మోడల్లు

 
*Rs

మారుతి స్విఫ్ట్ వీడియోలు

మేము యూట్యూబ్ నుండి ఉత్తమ వీడియోలను తీసుకున్నాము - అన్నింటిని వీక్షించండి

యొక్క సమీక్ష :బ్రాండ్ :నమూనా :దేశం

 

అవలోకనం:


కొద్ది నెలల క్రితం మారుతి స్విఫ్ట్ హ్యాచ్బ్యాక్ సిరీస్ 'ఎల్ఎక్స్ఐ ఎంపిక' రూపంలో ఒక కొత్త వేరియంట్ ని మందుకు తెచ్చింది . ఎర్టిగా ఎంపివి ప్రారంభానికి కొద్ది రోజుల ముందే ఎంఎస్ఐఎల్ ఈ హాచ్బాక్ సిరీస్ లో ఒక ప్రత్యేక వెర్షన్ తయారు చేసి వార్తలలోనికి వచ్చింది. ఇది 'స్విఫ్ట్ గ్లోరీ ఎడిషన్' గా నామకరణం చేయబడుతున్నది మరియు విఎక్స్ఐ ఇంకా విడిఐ వేరియంట్ లో అందించబడుతున్నది. వీటి మధ్య, విఎక్స్ఐ ట్రిం ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ తో పాటూ యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ని మరియు బ్రేక్ అసిస్ట్ ని ప్రామాణికంగా కలిగి ఉంది. అయితే, ముఖ్యమైన ఈ వెర్షన్లు డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్బ్యాగ్స్ ని కలిగి లేవు. ఈ గ్లోరీ ఎడిషన్ చాలా ఆకర్ష్ణీయమైన అంతర మరియు బాహ్య భాగాలను కలిగి ఉంది. ఈ తాజా వెర్షన్ ఎర్రని రూఫ్ తో తెలుపు రంగు శరీరం మరియు రేసింగ్ చారలు కలిగి ఉంటుంది. అయితే, ముఖ్యమైన ఈ వెర్షన్లు డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్బ్యాగ్స్ ని కలిగి లేవు. ఈ గ్లోరీ ఎడిషన్ చాలా ఆకర్ష్ణీయమైన అంతర మరియు బాహ్య భాగాలను కలిగి ఉంది. ఈ తాజా వెర్షన్ ఎర్రని రూఫ్ తో తెలుపు రంగు శరీరం మరియు రేసింగ్ చారలు కలిగి ఉంటుంది. దీని అంతర్భాగాలలో సీట్లు డ్యుయల్ టోన్ ఎరుపు మరియు నలుపు రంగు లోపలి సౌకర్యపు అపోలిస్ట్రీ ని కలిగి ఉన్నాయి. అలానే గేర్ నాబ్ తో పాటు స్టీరింగ్ వీల్ కి కవర్ అందించబడుతుంది. అంతేకాకుండా తయారీదారుడు స్టీరింగ్ పై అమర్చబడియున్న ఆడియో నియంత్రణలతో పాటూ బ్లూటూత్ ని కలిగియున్న ఆడియో వ్యవస్థను కూడా జోడించడం జరిగింది. వీటితోపాటు, అన్ని ఇతర సౌకర్యాలు 'వి ' గ్రేడ్ వెర్షన్ నుండి తీసుకోబడినవి. నవీకరణ చేయడం వలన భారతీయ ఆటోమొబైల్ మార్కెట్ లో హ్యట్చ్ బ్యాక్ విభాగంలో ఉన్న కార్లకు మంచి పోటీను ఇస్తుంది. నవీకరణ చేయడం అంటే ముఖ్యంగా సాంకేతిక నిర్దేశాలు మరియు లక్షణాలను మార్చడం. అంతేకాకుండా ఈ మొడల్ సిరీస్ పాత వేరియంట్లను కొనసాగిస్తూ ఒక క్రొత్త వేరియంట్ ను జతచేసింది. ఆ వేరియంట్ ఏమిటంటే ఎల్ఎక్స్ఇ ఆప్షన్. ప్రస్తుతం ఈ హెచ్బ్యాక్ మొడల్ కొనుగోలుదారులు ఎంచుకోవడానికి 4 పెట్రోల్ వేరియంట్లను మరియు 3 డీజిల్ వేరియంట్లను అందుబాటులో ఉంచుతుంది. వాహన కూడా అదే పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్ల ను కలిగి ఉంది, ఎందుకంటే మొత్తం ఇంధన సామర్థ్యం మెరుగుపరచడానికి కొన్ని సర్దుబాటులు చేసింది. అన్ని పెట్రోల్ వేరియంట్స్ ఇప్పుడు 20.4 Kmpl మైలేజ్ ను ఇవ్వడం తో పాటుగా ఈ ఇంజిన్లు 1.2 లీటర్ ఇంజన్ ను, కలిగి ఉంటాయి. మరోవైపు, డీజిల్ ఇంజిన్లు 25.2 Kmpl అత్యదిక మైలేజ్ ఉత్పత్తి చేసే 1.3 లీటర్ మల్టిజెట్ ఇంజిన్ బిగించి ఉంటుంది. బాహ్య పరంగా, ఫాగ్ ల్యాంప్ కన్సోలులో వెండి చేరికలతో పాటు గాలి ఆనకట్టతో పునఃరూపకల్పన చేసిన బంపర్ ను పొంది ఉంది. ఇంతేకాకుండా, మరియు కొత్తగా రూపొందించిన అల్లాయ్ వీల్స్ తో పాటు ఒక కొత్త హనీ కోంబ్ ఉండే రేడియేటర్ గ్రిల్ ను పొందుపరచారు . వీటితోపాటు, ఈ మోడల్ సిరీస్ మిస్టీరియస్ వైలెట్, గ్రానైట్ గ్రే మరియు ఫైర్ రెడ్ అలాగే ఈ మూడు కొత్త బాహ్య పెయింట్ ఎంపికలు తో ఇప్పుడు అందుబాటులో ఉంది. దాని లోపలి భాగం మరింత స్పోర్టీ వెండి రూపు తో అమర్చబడి అందంగా మెరుగుపర్చిన రంగుల పథకం తో మార్పు చేశారు. వీటితోపాటు, సీట్లు వెన్ను మరియు తొడల భాగాలకు మెరుగైన మద్దతుతో మార్పు చేశారు. దాని సౌకర్యాలను మరియు లక్షణాలు చాలా వరకు మార్పు చేశారు వీటిలో భాగంగా ప్రవేశ స్థాయిలో ఉన్న వేరియంట్స్ లో సర్దుబాటయ్యే ఒక జంట హెడ్రెస్ట్ ను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా వెనుక సీటు బెంచ్ మడత తో ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. మధ్య శ్రేణి వేరియంట్స్ లో ఎలెక్ట్రానిక్ గా సర్దుబాటు చేసుకునే వెలుపల మిర్రర్స్ తో పాటు సంగీత వ్యవస్థ ను కూడా కలిగి ఉంటాయి. మరోవైపు, దీని యొక్క అగ్ర శ్రేణి వేరియంట్లలో చాలా రకాల ఆధునిక లక్షణాలను కలిగి ఉన్నాయి, అవి వరుసగా బ్లూటూత్ కనెక్టివిటీ, వెనుక పార్కింగ్ సెన్సార్లు మరియు పుష్ బటన్ ఇంజిన్ ప్రారంభం వంటి లక్షణాలను కలిగి ఉంది. మరోవైపు, భద్రత అంశాలపై పరంగా, దాని మధ్య శ్రేణి వేరియంట్లలో ప్రామాణిక ఫిట్మెంట్ వంటి ఏభ్డ్ వ్యవస్థ తో పాటు నైపుణ్యం కలిగిన యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ తో అమర్చబడి ఉంటుంది. ఈ పునరుద్ధరించిన వెర్షన్ భారత ఆటోమొబైల్ మార్కెట్లో టొయోటా ఎతియోస్ లివా, ఫోక్స్వ్యాగన్ పోలో, ఫియట్ పుంటో ఎవో మరియు ఫోర్డ్ ఫిగో యొక్క ఇష్టాలు వ్యతిరేకంగా ఉంచుతారు. దీని యొక్క ప్రామాణిక వారంటీ కాలం 24 నెలలు లేదా 40,000 కిలోమీటర్లు, ఈ రెండిటిలో ఏ ఒక్కటి విస్తరించినా వారెంటీ కాల పరిధి ముగిసినట్టే.

మైలేజ్ మరియు ఇంధన సామర్థ్యం:


ఈ మోడల్ సిరీస్ కొనుగోలుదారులు ఎంచుకోవడానికి పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ రెండింటినీ అందుబాటులో కలిగి ఉంది. మార్పు చేయబడిన కె-సిరీస్ పెట్రోల్ ఇంజన్ ఒక మల్టీ పాయింట్ ఫ్యూయెల్ ఇంజెక్షన్ సాంకేతికతను కలిగి ఉంటుంది. పెట్రోల్ వేరియంట్ ఇప్పుడు (ఏఆర్ఏఐ ధ్రువీకరణ ప్రకారం) గరిష్టంగా 20.4 కి.మీ. మైలేజ్ ఇస్తుంది. మరోవైపు, డీజిల్ ఇంజిన్ నవీకరించబడిన ఇసియు (ఇంజిన్ నియంత్రణ యూనిట్) కలిగి ఉంటుంది. దాని ఫలితంగా, అది ఇప్పుడు చాలా గరిష్టంగా అంటే 25.2 కి.మీ. మైలేజ్ ని ఇ స్తుంది.

శక్తి సామర్థ్యం:


పెట్రోల్ ఇంజన్ DOHC వాల్వ్ ఆకృతీకరణ ఆధారంగా 4-సిలిండర్లను కలిగి ఉంటుంది. దీని పవర్ ప్లాంట్ 83.1Bhp శక్తి ని ఉత్పత్తి చేస్తుంది, అలాగే టార్క్ కూడా గరిష్టంగా 115Nm వరకు ఉత్పత్తి చేస్తుంది. మరోవైపు, డీజిల్ ఇంజన్ కూడా 4-సిలిండర్ లను కలిగి ఉంటుంది. దీని పవర్ ప్లాంట్ 74Bhp గరిష్ట శక్తి ని ఉత్పత్తి చేస్తుంది, అలాగే టార్క్ కూడా గరిష్టంగా 190Nm ని ఉత్పత్తి చేస్తుంది.

ఏక్సలరేషన్ మరియు పికప్:


ఈ కారు యొక్క పెట్రోల్ మరియు డీజిల్ రెండు ఇంజిన్లు కూడా 5- స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ను కలిగి ఉంటుంది. దీని పెట్రోల్ వేరియంట్ 0 నుండి 100kmph వేగాన్ని చేరడానికి 14 సెకన్లు సమయం పడుతుంది, అదే సమయంలో, అది గరిష్ట్టం గా 150 నుండి 155 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. మరోవైపున, డీజిల్ వెర్షన్ 100kmph ను దాటి 160kmph ను చేరడానికి సుమారుగా 15 - 16 సెకన్ల సమయం పడుతుంది.

వెలుపలి డిజైన్:


కొద్ది నెలల క్రితం, ఈ మోడల్ సిరీస్ నవీకరించబడిన బంపర్ మరియు ఫాగ్ ల్యాంప్ కన్సోల్ తో స్టైలింగ్ గా ఉంటుంది. ఇప్పుడు ఈ కొత్త గ్లోరీ ఎడిషన్ దీని బాహ్య మరియు అంతర్భాగాలలో చేర్చబడిన స్పోర్టీ లక్షణాలతో మరింత సౌందర్యంగా కనిపిస్తుంది. మేము ఈ కొత్త వెర్షన్ లో ఎరుపు పెయింట్ రూఫ్ తో తెలుపు రంగు బాడీ అందించబడుతుంది. అలానే దిగువ విభాగంలో ఎరుపు రంగు స్కర్టులు వాహనం యొక్క సాహసోపేత వైఖరిని మరింతగా పెంచుతున్నది. అంతేకాకుండా బోనెట్, ప్రక్క భాగాలు మరియు వెనుక విభాగంలో రేసింగ్ చారలు ఉండి మరింత స్పోర్టీ లుక్ ని ఇస్తుంది. ఈ అప్డేట్స్ 'వి ' ట్రిమ్స్ ఆధారిత వెర్షన్లకు మాత్రమే అందించబడుతున్నాయి. మిగిలిన వెర్షన్లు అదే విధంగా ఉన్నాయి. పైన చెప్పిన మాదిరిగానే, ఈ హాచ్బాక్ కొన్ని నెలల క్రితం దాని బాహ్య భాగాలలో కనిష్ఠ సౌందర్య నవీకరణలను పొందింది. అలానే దీనిలో రేడియేటర్ గ్రిల్ హనీ కోంబ్ మెష్ తో మరియు సుజుకి యొక్క లోగోతో అందించబడుతున్నది. దీని హెడ్ లైట్ క్లస్టర్ లో శక్తివంతమైన హాలోజన్ ల్యాంప్స్ కలిగి మరియు టర్న్ సూచికలను కూడా కలిగి ఉంటుంది. ముందు బంపర్ ఒక కొత్త డిజైన్ మరియు అది ఒక స్పోర్టి లుక్ ను ఇస్తుంది. అంతేకాకుండా, ఈ మారుతి స్విఫ్ట్ సిరీస్ ఫాగ్ ల్యాంప్స్ కలిగి మరియు దాని లోపల భాగం అంతా వెండి చారలు తో అలంకరించబడి ఉంటుంది. ఇది స్టైలిష్ అల్లాయ్ చక్రాలతో పాటు సంస్థ యొక్క బాడ్జ్ ను కలిగి ఉంటుంది. అయితే, దాని దిగువ మరియు మధ్య రేంజ్ మోడళ్ళు స్టీలు రిమ్స్ ను మరియు చక్రం క్యాప్స్ లను కలిగి ఉంటాయి. ఓఆర్విఎం క్యాప్స్ కారు రంగు లో మరియు దాని విండో ఫ్రేమ్లను నలుపు లో అలంకరించబడి ఉంటాయి. అంతేకాకుండా, దాని ఓఆర్విఎం పై అదనపు భద్రత అందిస్తుంది. దాని అర్దం ఏమిటంటే ఓఆర్విఎంతో పాటుగా టర్న్ సూచికలను కలిగి ఉంటుంది.

వెలుపలి కొలతలు:


ఈ ప్రీమియం హ్యాచ్బ్యాక్ మొత్తం పొడవు 3850mm, ఓఆర్విఎం తో పాటు మొత్తం వెడల్పు 1695mm తో వస్తుంది. దాని కనీస గ్రౌండ్ క్లియరెన్స్ చాలా ఎక్కువగా అంటే 170mm, అయితే అప్పుడు దాని మొత్తం ఎత్తు 1530mm కు చేరుకుంటుంది. దీని టర్నింగ్ వ్యాసార్థం 4.8 మీటర్లు కలిగి ఉంటుంది. అయితే దీని వీల్బేస్ ఒక సౌకర్యవంతమైన 2430mm ఉంటుంది.

లోపలి డిజైన్:


కొత్త గ్లోరీ ఎడిషన్ సీట్ల కొరకు కొత్త ఎరుపు మరియు నలుపు రంగు అపోలిస్ట్రీ ని కలిగి ఉంటుంది. అలానే స్టీరింగ్ వీల్ మరియు ఫ్లోర్ మ్యాట్స్ కూడా కారు యొక్క ప్రతేకతను పెంచేందుకు ఎరుపు రంగు చేరికలతో అందించబడతాయి. అదనంగా, ఫ్లోర్ మ్యాట్స్ దాని ప్రత్యేకతను చూపే ఎంబెడెడ్ గ్లోరీ ఎడిషన్ అక్షరాలతో ఉంటుంది. మిగిలిన వేరియంట్స్ సొగసైన రాప్అరౌండ్స్ మరియు విస్తృతమైన లోహ చేరికలతో అదే డిజైన్ కలిగి కొనసాగుతున్నాయి. ఇంకా అదనంగా చెప్పాలంటే, ఈ సిరీస్ యొక్క సీట్లు కాస్త మెరుగ్గా తొడ భాగం దగ్గర మరియు వెన్నుముక భాగం లో సౌకర్యవంతంగా ఉంటుంది. ఇప్పుడు, బేస్ వేరియంట్స్ లో కూడా 60:40 స్ప్లిట్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. మరోవైపు సర్దుబాటు హెడ్రెస్ట్ ను కూడా కలిగి ఉంటుంది. ఇది ఒక మెరుగైన సౌలభ్యాన్ని అందిస్తుంది. అంతేకాకుండా మరోవైపు, దీని యొక్క అగ్ర శ్రేణి వేరియంట్ లో ,డ్రైవర్ సౌకర్యాలకు అనుగుణంగా బహుళ స్టీరింగ్ వీల్ ను కలిగి ఉంటుంది. అవుట్గోయింగ్ మోడల్ తో పొలిస్తే డాష్ బోర్డ్ లోహపు చేరికలతో పై భాగం అంతా అమర్చబడి ఉంటుంది . దీని వల్ల డాష్ బోర్డ్ కు మరింత అందాన్ని ఇస్తుంది. అంతేకాకుండా క్యాబిన్ లోపల డ్రింక్ హోల్డర్స్, యాక్సెసరీ పవర్ సాకెట్, డ్యూయల్ ఫ్రంట్ సన్ విసర్స్, మరియు అలాగే క్యాబిన్ లోపల చాలా ఖాళీ ప్రదేశం వంటి అనేక ముఖ్యమైన లక్షణాలు ఉన్నాయి.

లోపలి సౌకర్యలు:


తయారీదారుడు ఈ మారుతి స్విఫ్ట్ హ్యాచ్బ్యాక్ సిరీస్ అంతర్భాగాలలో కొన్ని సృజనాత్మక అంశాలను అందించడం వలన ఈ కారు మనకు ఆహ్లాదకరమైన మరియు సౌకర్యవంతమైన రైడ్ ను అందిస్తుంది. ఈ కారు కుషన్ సౌకర్యాన్ని అందజేస్తుంది. వెనుక సీటు కి 60:40 స్ప్లిట్ మడత సౌకర్యం ఉండటం వల్ల లోపల ఎక్కువ లగేజ్ తీసుకోవడానికి అనుమతిస్తుంది. విద్యుత్ తో సర్దుబాటయ్యే వెలుపలి రేర్ వ్యూ మిర్రర్స్ తో పాటుగా టర్న్ సూచికలు ఉండటం వల్ల ట్రాఫిక్ లో ఉన్నప్పుడు కారు యొక్క విండోను తెరవక్కర్లేకుండా సులభంగా టర్న్ చేయడానికి ఈ టర్న్ సూచికలు ఉపయోగపడతాయి. అగ్ర శ్రేణి వేరియంట్లలో నాలుగు పవర్ ఆపరేటెడ్ విండోస్ ఉన్నాయి. అయితే ఎల్ఎక్స్ఐ వేరియంట్లో ముందు మాత్రమే రెండు పవర్ విండోస్ కలిగి ఉన్నాయి. ఇది ఒక టిల్ట్ సర్దుబాటు స్టీరింగ్ వీల్ కలిగి ఉంటుంది. దాని తో పాటుగా ఆడియో మరియు బ్లూటూత్ నియంత్రణలు స్టీరింగ్ వీల్ పై అమర్చబడి ఉంటాయి. వీటితోపాటు, కొన్ని ఖాళీ ప్రదేశాలు ఉంటాయి, అవి ఏమిటంటే కప్ హోల్డర్స్, ముందు సీటు వెనుక పాకెట్స్, డోర్ పాకెట్స్, రేర్ పార్సెల్ షెల్ఫ్, టికెట్ హోల్డర్లు, గ్లోవ్ బాక్స్ మరియు ఇతరాత్రా. వెనుక సర్దుబాటయ్యే హెడ్రెస్ట్ మరియు డ్రైవర్ సీటు ఎత్తు సర్దుబాటయ్యే సదుపాయం మరింత సౌకర్యవంతంగా ఉండేలా చేస్తుంది. అగ్ర శ్రేణి వేరియంట్లలో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వ్యవస్థను కలిగి ఉంటుంది. అది లోపల ఉండే ఉష్ణోగ్రతను దానంతట అదే మార్చుకుంటుంది. అయితే ఇతర వేరియంట్లలో మానవీయ ఎయిర్ కండిషనర్ వ్యవస్థ ఉంటుంది. కారు లో వినోదాన్ని అందిచడానికి మధ్య మరియు అగ్ర శ్రేణి వేరియంట్లలో సెంటర్ కన్సోల్ లో మ్యూజిక్ సిస్టమ్ బిగించబడి ఉంటుంది. సౌకర్యాన్ని అందించడానికి మరిన్ని లక్షణాలను కలిగి ఉంది. అవి ఏమిటంటే లేన్ మార్పు సూచిక, విద్యుత్ అయస్కాంత బ్యాక్ డోర్ ఓపెనర్, రిమోట్ ఫ్యూయెల్ లిడ్ ఓపెనర్, పుష్ ప్రారంభం బటన్ తో రిమోట్ లాకింగ్, రీడింగ్ లైట్ వంటి లక్షణాలను కలిగి ఉంటుంది.

లోపలి కొలతలు:


ఈ మారుతి స్విఫ్ట్ ఐదుగురు సౌకర్యవంతంగా కుర్చునేలా ఉంటుంది. ఇది ఒక ప్రీమియం హ్యాచ్బ్యాక్ అని చెప్పవచ్చు. దీని యొక్క ముందరి హడ్రూం 1000mm పరిమాణాన్ని మరియు వెనుక హడ్రూం 910mm కలిగి ఉంటుంది. అంతేకాకుండా షొల్డర్ రూం 1290mm తో పాటుగా వెనుక మోకాలి స్పేస్ యొక్క పరిమాణం గరిష్టంగా 855mm. అయితే, ఇది గరిష్టంగా 1150mm లెగ్రూం ను కలిగి ఉంది. ఇదియే కాకుండా, ఒక పెద్ద గ్లోవ్ బాక్స్ , పార్శిల్ షెల్ఫ్ మరియు అలాగే వెనుక ఒక మంచి లగేజ్ స్పేస్ వంటి ఇతర కంపార్ట్మెంట్ల ను కూడా కలిగి ఉంది.

ఇంజిన్ మరియు దాని పనితీరు:


ఈ మారుతి స్విఫ్ట్ హ్యాచ్బ్యాక్ సిరీస్ అన్ని పెట్రోల్ వేరియంట్స్ లో ఒక బహుళ ఇంధన ఇంజెక్షన్ వ్యవస్థను కలిగి స్వల్పంగా మార్పు చేయబడిన 1.2 లీటర్ కె-సిరీస్ పెట్రోల్ ఇంజన్ కలిగి ఉంటాయి. ఈ ఇంజిన్ 1197cc స్థానభ్రంశాన్ని అందిస్తుంది మరియు డిఓహెచ్సి వాల్వ్ ఆకృతీకరణ ఆధారంగా 4-సిలిండర్లుమరియు 16-కవాటాలు కలిగి ఉంటుంది. దీని యొక్క పవర్ ప్లాంట్ 6000Rpm వద్ద 83.1Bhp గరిష్ట శక్తి ఉత్పత్తి చేస్తుంది, కానీ కేవలం 4000Rpm వద్ద 115Nm ఒక మెరుగైన టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. మరోవైపు, దాని డీజిల్ వేరియంట్లలో ఉన్న ఇంజిన్ కంట్రోల్ యూనిట్ (ఏసియు ) 1.3 లీటర్ మల్టిజెట్ డీజిల్ ఇంజన్ కలిగి ఉంటుంది. దీని ఇంజిన్ కంట్రోల్ యూనిట్ (ఈసియు) సవరించబడింది. దీని పవర్ ప్లాంట్ డిఓహెచ్సి వాల్వ్ ఆకృతీకరణ ఆధారంగా 4-సిలిండర్లు మరియు 16-కవాటాలను కలిగి ఉంటుంది. దీని యొక్క స్థానభ్రంశం 1248cc. దీని యొక్క పవర్ ప్లాంట్ 4000Rpm వద్ద 74Bhp గరిష్ట శక్తి ఉత్పత్తిని అనుమతిస్తుంది. ఇది కూడా కేవలం 2000Rpm వద్ద 190Nm టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఈ డీజిల్ ఇంజిన్ ఒక టర్బోచార్జర్ కూడా కలిగి ఉంది. పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్ రెండు కూడా అధునాతన 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్బాక్స్ ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా, దీని యొక్క టార్క్ ను ముందు రెండు చక్రాలకి ఉత్పత్తి చేస్తుంది.

స్టీరియో మరియు ఉపకరణాలు:


ఈ హ్యాచ్బ్యాక్ ప్రయాణికులకు వారి ప్రయాణమంతటా ఇష్టమైన రాగాలు వినడానికి ఒక ఆడియో వ్యవస్థను కలిగి ఉంది. ఇది ఒక సిడి ప్లేయర్, రెండు ముందు ట్విట్టర్లను, ముందు మరియు వెనుక నాలుగు పెద్ద స్పీకర్లను కలిగియున్న రేడియో ట్యూనర్ ని కలిగి ఉంది. ఇది యుఎస్బి పోర్ట్, ఆక్సిలరీ ఇంపుట్, బ్లూటూత్ కనెక్టివిటీ మరియు స్పీడ్ ఆధారిత ఆటోమేటిక్ వాల్యూమ్ నియంత్రణను కలిగి ఉంది. ఈ సౌకర్యం ఇప్పుడు కొత్తగా ప్రారంభించబడిన గ్లోరీ ఎడిషన్ లో కూడా అందించబడుతుంది. అంతేకాకుండా, దీని స్టీరింగ్ వీల్ పైన ప్రకాశవంతమైన ఆడియో మరియు ఫోన్ నియంత్రణలు డ్రైవర్ యొక్క సౌలభ్యం కోసం అందించబడుతున్నవి. దీనిలో మంచి రేడియో సిగ్నల్స్ పొందేందుకు ఒక స్పోర్టి యాంటెన్నా కూడా ఉంది.

వీల్స్ పరిమాణం:


ఈ హాచ్బాక్ సిరీస్ లో దిగువ మరియు మధ్య శ్రేణి వేరియంట్లలో 14-అంగుళాల స్టీలు చక్రాలను కలిగి ఉంటుంది మరియు ట్యూబ్ లేని రేడియల్ టైర్ల తో వస్తుంది. దీని యొక్క పరిమాణం 165/80 R14. మరోవైపు అగ్ర శ్రేణి వేరియంట్ లో ఒక సరికొత్త 15 అంగుళాల అందమైన అల్లాయ్ వీల్స్ తో పాటు 185/65 R15 పరిమాణం గల ట్యూబ్ లేని రేడియల్ టైర్లను కలిగి ఉంటుంది. ఈ అల్లాయ్ వీల్స్ ను కలిగి ఉండటం వల్ల కారుని మరింత అందంగా కనబడేటట్లు చేస్తుంది. అదే కాకుండా ఒక అదనపు చక్రాన్ని కూడా లగేజ్ విభాగం లో అమర్చబడి ఉంటుంది.

బ్రేకింగ్ మరియు హ్యాండ్లింగ్:


ఈ హాచ్బాక్ సిరీస్ అత్యాధునిక బ్రేకింగ్ వ్యవస్థ కలిగి ఉంటుంది, దీని వల్ల అన్ని సార్లు సురక్షితంగా డ్రైవ్ చేయగలుగుతాము. దీని అగ్ర శ్రేణి వెరియంట్ లో మాత్రమే ఏ.బి.ఎస్(యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్) ఉంటుంది. ఈ ఏ.బి.ఎస్ వల్ల సడన్ గా బ్రేక్ వేసినప్పుడు చక్రాలు లాక్ పడిపోకుండా సహాయపడుతుంది. దీని ముందు చక్రాలు వెంటిలేటెడ్ డిస్కులను తో అమర్చబడి ఉంటుంది, అదేవిదంగా వెనుక డ్రమ్ బ్రేక్లు ను కలిగి ఉంటుంది. ఈ మారుతి స్విఫ్ట్ హ్యాచ్బ్యాక్ సిరీస్ కూడా ఒక మెరుగైన హ్యాండ్లింగ్ వ్యవస్థను కలిగి ఉంటుంది. దీని ముందు ఆక్సిల్ మక్ఫెర్సొన్ స్ట్రట్ ను కలిగి మరియు ఒక కాయిల్ స్ప్రింగ్ తో అమర్చబడి ఉంటుంది. అదేవిదంగా వెనుక ఆక్సిల్ కూడా అదే రకమైన కాయిల్ స్ప్రింగ్ తో పాటు టోర్షన్ బీమ్ కలిగి ఉంటుంది. అంతేకాకుండా దీని ముందు సస్పెన్షన్ మక్ఫెర్సొన్ స్ట్రట్ ఉండటం వల్ల ఏ రోడ్డు పరిస్థితి లోనైనా మంచి స్థిరతత్వాన్ని మరియు డ్రైవింగ్ సౌకర్యాన్ని అందిస్తుంది.

భద్రత మరియు రక్షణ:


ఈ కొత్త స్విఫ్ట్ హాచ్బాక్ సిరీస్ లో అనేక ఆధునిక భద్రతా లక్షణాలు అందుబాటులో ఉన్నాయి . ఈ సిరీస్ ముందు బాగం లో రెండు ఎయిర్ బాగ్స్ ను కలిగి ఉంటాయి. ఈ ఎయిర్ బాగ్స్ ఉండటం వల్ల తాకిడి ప్రభావాలలో కలిగే ప్రమాదాల బారి నుండి వాహనాన్ని రక్షిస్తుంది. దీని అగ్ర శ్రేణి వేరియంట్ లో మాత్రమే ఏ.బి.ఎస్(యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్) ఉంటుంది. ఈ ఏ.బి.ఎస్ వల్ల సడన్ గా బ్రేక్ వేసినప్పుడు చక్రాలు లాక్ పడిపోకుండా సహాయపడుతుంది మరియు దాని స్థిరత్వాన్ని కూడా నియంత్రిస్తుంది. భద్రతా పరిమాణల్ని మరింత పెంపొందించేందుకు కారు తయరీదారుడు ఈ సిరీస్ అగ్ర శ్రేణి వేరియంట్లకు బ్రేక్ అసిస్ట్ ను అందించాడు. అంతేకాకుండా ఈ వాహనం స్పీడ్ సెన్సింగ్ అటోమెటిక్ డోర్ లాక్ వ్యవస్థ ను కలిగి ఉంటుంది. కారు స్పీడ్ గా వెళుతున్నపుడు ఆటోమేటిక్ గా వాటంతట అవే డోర్స్ లాక్ పడిపోతాయి మరియు అది మాత్రమే కాకుండా కారు ప్రమాదానికి గురి అయినప్పుడు కొన్ని కార్లలో డోర్స్ లాక్ పడిపోతాయి, కాని ఈ అగ్ర శ్రేణి వేరియంట్ లో అటోమేటిక్ గా డోర్స్ తెరుచుకోబడతాయి. ఇది యాంటీ థెఫ్ట్ వ్యవస్థ ను కూడా కలిగి ఉంటుంది. దీని వల్ల అపరిచిత వ్యక్తుల దొంగతనాల బారి నుండి కారుని రక్షించుకోవచ్చు. ఇది హాలోజెన్ హెడ్ల్యాంప్స్ ను కలిగి ఉంటుంది. ఈ హాలోజెన్ హెడ్ల్యాంప్స్ రోడ్లకు ఒక స్పష్టతను ఇస్తుంది. దీని వల్ల ప్రమాదాల బారి నుండి జాగ్రత్త పడొచ్చు. వాతావరణం బాగాలేని పరిస్థితుల్లో డ్రైవింగ్ చేసేటప్పుడు ముందు మరియు వెనుక ఫాగ్ ల్యాంప్స్ లభ్యత ఒక రక్షకభటులు గా పనిచేస్తాయి. ముందు మరియు వెనుక సీటు బెల్టులు ఢీకొన్న సందర్భంలో గాయాలు తగలకుండా ఉండేటట్లు చేస్తాయి. అంతేకాకుండా, డ్రైవర్ కి పార్కింగ్ సులభతరం చేయడానికి వెనుక పార్కింగ్ సెన్సార్లుజెడ్ఎక్స్ఐ మరియు జెడ్‌డిఐ వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా పిల్లల భద్రతా స్థాయి పెంచడానికి చైల్డ్ సేఫ్టీ లాక్స్, హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్, డబుల్ హార్న్, సైడ్ ఇంపాక్ట్ బీమ్స్ మరియు హెడ్ రిస్ట్రైన్స్ వంటి ఇతర భద్రతా చర్యలను కూడా కలిగి ఉంటుంది.

అనుకూలాలు:1. ఈ స్విఫ్ట్ హాచ్బాక్ లో అదనంగా లక్షణాలను జోడించడం వల్ల మార్కెట్ లో ముందు స్థానం లో ఉంది.
2. మెరుగైన ఇంధన సామర్థ్యం ఉండటం ఒక అదనపు ప్రయోజనం అని చెప్పవచ్చు.
3. ఈ సిరీస్ యొక్క బాహ్య స్వరూపాలు మరింత ఆకర్షణీయంగా ఉంటాయి.
4. మొత్తం మీద ఇంజిన్ పనితీరు చాలా మెరుగుగా ఉంటుంది.
5. సరసమైన ధర ఉండటమనేది ఒక అదనపు ప్రయోజనం అని చెప్పవచ్చు.

ప్రతికూలాలు:1. ఈ సిరీస్ యొక్క లోపలి భాగం మరింతగా మెరుగుపరచే ఆస్కారం ఉంటుంది.
2. డిక్కి లోపలి భాగం మరింత ఖాళీ ఉండేలా చేయవచ్చు.
3. వెనుక సీటు లెగ్ రూం చాలా తక్కువగా ఉంటుంది.
4. డీజిల్ ఇంజన్ శబ్దాన్ని తగ్గించవచ్చు.
5. ఆటోమాటిక్ వేరియంట్స్ ఈ రెండు వెర్షన్ల లోను అందుబాటులో లేవు.