• English
    • Login / Register

    కుషాక్ & స్లావియా 1.5-లీటర్ పెట్రోల్ వేరియెంట్ ప్రారంభ ధరను తగ్గించిన స్కోడా

    స్కోడా స్లావియా కోసం ansh ద్వారా మార్చి 30, 2023 05:08 pm ప్రచురించబడింది

    • 49 Views
    • ఒక వ్యాఖ్యను వ్రాయండి

    ఇంతకు ముందు టాప్ వేరియెంట్‌లకు మాత్రమే పరిమితమైన, టర్బో పెట్రోల్ పవర్ యూనిట్ؚను ఇప్పుడు రెండు మోడల్‌లు అయిన మిడ్-స్పెక్ యాంబిషన్ వేరియెంట్ؚలలో అందిస్తున్నారు.

    Skoda Kushaq and Slavia

    • ఈ 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ యూనిట్ 150PS పవర్ మరియు 250Nm టార్క్‌ను అందిస్తుంది.

    • ఇది 6-స్పీడ్ మాన్యువల్ లేదా 7-స్పీడ్ DCTతో అందించబడుతుంది. 

    • యాంబిషన్ వేరియంట్ రెండు మోడల్‌లు డ్యూయల్-టోన్ రంగులలో కూడా వస్తాయి. 

    • కుషాక్ యాంబిషన్ వేరియెంట్ ధర రూ.14.99 లక్షల (ఎక్స్-షోరూమ్) వద్ద ప్రారంభమవుతుంది మరియు స్లావియా ధర రూ.14.94 లక్షల (ఎక్స్-షోరూమ్) వద్ద ప్రారంభమవుతుంది. 

    మీ డబ్బుకు తగిన విలువను అందించే ప్రయత్నంలో, కుషాక్ కాంపాక్ట్ SUV యాంబిషన్ వేరియెంట్ మరియు స్లావియా సెడాన్ؚలను 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ యూనిట్ؚతో అందించాలని స్కోడా నిర్ణయించింది. ఇంతకు ముందు ఈ ఇంజన్ కేవలం స్కోడా కుషాక్ మరియు స్లావియా టాప్-స్పెక్ స్టైల్ వేరియెంట్ؚలలో మాత్రమే అందుబాటులో ఉండేది. 

    ధరలు

    స్కోడా స్లావియా

    వేరియెంట్ 

    1.5-లీటర్ టర్బో పెట్రోల్ 

    1.0-లీటర్ టర్బో పెట్రోల్ 

    తేడా 

    స్లావియా యాంబిషన్ MT

    రూ. 14.94 లక్షలు 

    రూ. 12.99 లక్షలు  

    +రూ. 1.95 లక్షలు

    స్లావియా యాంబిషన్ AT

    రూ. 16.24 లక్షలు 

    రూ. 14.29 లక్షలు 

    +రూ. 1.95 లక్షలు

    ఇది కూడా చదవండి: రూ.12.39 లక్షల ధరతో వస్తున్న స్కోడా కుషాక్ ఆనిక్స్ ఎడిషన్

    స్కోడా కుషాక్

    వేరియెంట్ 

    1.5-లీటర్ టర్బో-పెట్రోల్ 

    1.0-లీటర్ టర్బో-పెట్రోల్ 

    తేడా 

    కుషాక్ యాంబిషన్ MT

    రూ. 14.99 లక్షలు

    రూ. 13.19 లక్షలు

    + రూ. 1.8 లక్షలు

    కుషాక్ యాంబిషన్ AT

    రూ. 16.79 లక్షలు

    రూ. 14.99 లక్షలు

    + రూ. 1.8 లక్షలు

    *అన్నీ ఎక్స్-షోరూమ్ ఢిల్లీ ధరలు

    స్లావియా 1.5-లీటర్ యాంబిషన్ వేరియెంట్ ధర 1.0-లీటర్ వేరియెంట్‌తో పోలిస్తే రూ.1.95 లక్షలు అధికం మరియు కుషాక్ ధర రూ.1.8 లక్షలు ఎక్కువగా ఉంది. మిడ్-స్పెక్ వేరియెంట్‌లలో ఈ పవర్‌ట్రెయిన్ ఎంపికను అందించడం ద్వారా, కుషాక్ మరియు స్లావియా 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ వేరియెంట్‌ల ప్రారంభ ధరను స్కోడా వరుసగా రూ.2.8 లక్షలు మరియు రూ.2.16 లక్షలు తగ్గించింది.

    Skoda Kushaq
    Skoda Slavia

    యాంబిషన్ 1.5-లీటర్ ఆటోమ్యాటిక్ వేరియెంట్ؚలతో రెండు మోడల్‌లు డ్యూయల్-టోన్ రంగు ఎంపికలను (రూ.5,000 ఎక్కువ ధరతో) పొందాయి. స్లావియా యాంబిషన్ 1.5-లీటర్ ఆటోమ్యాటిక్ వేరియెంట్ నలుపు రంగు రూఫ్ؚతో క్రిస్టల్ బ్లూ రంగు మరియు కుషాక్ ఇదే వేరియెంట్ నలుపు రంగు రూఫ్ؚతో హనీ ఆరెంజ్ రంగు ఎంపికను పొందాయి. రెండు మోడల్‌లలో నలుపు రంగు రూఫ్ؚతో కార్బన్ స్టీల్ రంగు ఎంపిక కూడా ఉంటుంది. 

    నవీకరించబడిన పవర్ ట్రెయిన్ؚలు

    Slavia 1.5-litre Engine

    రెండు మోడల్‌లు ఒకే ఇంజన్ ఎంపికలతో విడుదలయ్యాయి: 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ మరియు 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ యూనిట్. స్కోడా ఈ ఇంజన్‌లను రానున్న RDE నిబంధనలకు అనుగుణంగా నవీకరించింది మరియు ఇవి ఇప్పుడు E20 ఇంధనానికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ నవీకరణతో ఈ కారు మోడల్‌లలో ఇంధన సామర్ధ్యాన్ని కూడా ఏడు శాతం వరకు పెంచిందని కారు తయారీదారు ప్రకటించారు. 

    ఇది కూడా చదవండి: టయోటా హైరైడర్ Vs స్కోడా కుషాక్ Vs హ్యుందాయ్ క్రెటా Vs మారుతి గ్రాండ్ విటారా Vs వోక్స్వాగన్ టైగూన్: స్పేస్ మరియు ప్రాక్టికాలిటీ పోలిక 

    1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ 115PS పవర్ మరియు 178Nm టార్క్‌ను అందిస్తుంది మరియు ఆరు-స్పీడ్‌ల మాన్యువల్ లేదా ఆరు-స్పీడ్‌ల టార్క్ కన్వర్టర్‌తో జత చేయబడింది. 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ 150PS పవర్ మరియు 250Nm టార్క్‌ను అందిస్తుంది మరియు ఆరు-స్పీడ్‌ల మాన్యువల్ ట్రాన్స్ؚమిషన్ లేదా ఏడు-స్పీడ్‌ల DCTతో (డ్యూయల్-క్లాచ్ ట్రాన్స్ؚమిషన్) జత చేయబడింది. ఇప్పుడు, స్లావియా మరియు కుషాక్ రెండిటి యాంబిషన్ వేరియెంట్ؚతో అన్నీ పవర్ؚట్రెయిన్ؚలను అందిస్తున్నారు. 

    పోటీదారులు

    Skoda Slavia
    Skoda Kushaq

    స్లావియా ధర రూ.11.29 లక్షలు మరియు రూ.18.40 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది, ఇది వోక్స్వాగన్ విర్టస్, హోండా సిటీ, హ్యుందాయ్ వెర్నా మరియు మారుతి సియాజ్ؚలతో పోటీ పడుతుంది. కుషాక్ ధర రూ.11.59 లక్షలు మరియు రూ.19.69 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది మరియు ఇది వోక్స్వాగన్ టైగూన్, హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, టయోటా హైరైడర్ మరియు మారుతి గ్రాండ్ విటారాలతో పోటీ పడుతుంది. 

    ఇక్కడ మరింత చదవండి: స్లావియా ఆన్ؚరోడ్ ధర

    was this article helpful ?

    Write your Comment on Skoda స్లావియా

    explore similar కార్లు

    సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

    *ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

    ట్రెండింగ్‌లో ఉంది సెడాన్ కార్లు

    • లేటెస్ట్
    • రాబోయేవి
    • పాపులర్
    ×
    We need your సిటీ to customize your experience