• English
  • Login / Register

గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మిశ్రమం = 14 దేశాలు, 1,864 కిలోమీటర్ల దూరం మరియు ఒక ఫుల్ ట్యాంక్ ఇంధనం

ఆడి ఏ6 2015-2019 కోసం sourabh ద్వారా జూన్ 15, 2015 04:05 pm ప్రచురించబడింది

  • 13 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

మీరు ఒకే ఒక ట్యాంక్ ఇంధనంతో ఎంత దూరం వెల్లగలరు? మరియు అది కూడా మీరు మీ పేరును గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లో ఉంచాలి అనుకుంటే? వాహన రంగ విలేఖరి ఆండ్రూ ఫ్రాంకెల్ మరియు రేసింగ్ డ్రైవర్ రెబెక్కా జాక్సన్ విజయవంతంగా ఆడి ఎ6 లో ఒకే ఒక ట్యాంక్ ఇంధనం తో 14 వివిధ యూరోపియన్ దేశాలకు ప్రయాణం సాగించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లో స్థానం సంపాదించుకున్నారు. వారిద్దరు తమ ప్రయాణాన్ని మాస్ట్రిచ్,  నెదర్లాండ్స్ వద్ద ప్రారంభించి మొత్తం 1,864 కిలోమీటర్ల దూరం ప్రయాణం సాగించిన తరువాత కారు చివరకు ఇంధనం ను కోల్పోయి వారు ఆగిపోయారు.   

ఆండ్రూ మరియు రెబెక్కా వారి యొక్క ఆడి ఎ6 అల్ట్రా లో జాగ్రత్తగా ప్రణాళిక సిద్దం చేసుకుని 73 లీటర్ల ఇంధన ట్యాంక్ తో దాదాపు నిరంతరంగా కారుని నడిపారు.  సగటున 75.9 mpg(32.27kmpl) ఇంధన సామర్థ్యం తో బెల్జియం, లక్సెంబోర్గ్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, లిక్టెన్స్టీన్, ఆస్ట్రియా, జర్మనీ, ఇటలీ మరియు తరువాత బాల్కన్ ద్వీపకల్పం వైపు, స్లోవేనియా, క్రొయేషియా, బోస్నియా మరియు సెర్బియా దేశాల గుండా వారు ప్రయాణించారు.  

వాస్తవానికి ఒక వైపు నుండి చూస్తే ఈ సవాలు చాలా కష్టంగా అనిపించిది అని అన్నారు. కాని, ఇది మా ఇద్దరికి ఊహించినట్లుగానే గొప్ప విజయాన్ని అందించింది. అయినప్పటికినీ, మేము దాదాపు  28 గంటల పాటు డ్రైవింగ్ షేరింగ్ చేసుకుని నిరంతరంగా రహదారి మీద నిర్వహణపై దృష్టి పెట్టి సగటు వేగం 80km/h తో ప్రయాణం సాగించాము  అని ఫ్రాంకెల్ అభిప్రాయపడ్డారు.

ఈ ఇద్దరు డ్రైవర్స్ కూడా ప్రస్తుత ట్రాఫిక్ పరిస్థితులను దృష్ట్టిలో పెట్టుకొని, అనేక మార్గాల ద్వారా ఆరేసి వాహనాల సహాయంతో వెళ్ళగలిగారు. వెళ్ళేమార్గాలలో భారీ ట్రాఫిక్ కారణంగా ఇంధన సామర్థ్యం తగ్గి ఉండవచ్చు అని చెబుతున్నారు. పవర్ట్రెయిన్ సవరణలో పరంగా, ఆడిఏ6 వాహనం 2.0 లీటర్ టిడి ఐ ఇంజిన్ తో జత చేయబడి ఉంటుంది. ఈంజెన్ అత్యధికంగా 187bhp పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా ఈ ఇంజెన్ ఎస్-ట్రానిక్ 7-స్పీడ్ డ్యూయెల్ క్లచ్ గేర్బాక్స్ తో జత చేయబడి ఉంటుంది. 

was this article helpful ?

Write your Comment on Audi ఏ6 2015-2019

ట్రెండింగ్‌లో ఉంది సెడాన్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience