Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

సెగ్మెంట్ ఫస్ట్-ఫీచర్‌లతో రానున్న కొత్త-జనరేషన్ హ్యుందాయ్ వెర్నా

హ్యుందాయ్ వెర్నా కోసం shreyash ద్వారా మార్చి 13, 2023 10:52 am ప్రచురించబడింది

హ్యుందాయ్ నుండి వస్తున్న ఈ నెక్స్ట్- జనరేషన్ కాంపాక్ట్ సెడాన్ మార్చి 21న విడుదల కానుంది

  • ఈ సెగ్మెంట్‌లో మొదటి సారిగా వెంటిలేటెడ్, హీటెడ్ ముందు సీట్‌లను 2023 వెర్నా వాహనంలో అందిస్తున్నారు.

  • ఇన్ఫోటైన్ؚమెంట్ మరియు ఆటో AC సిస్టమ్ؚల కోసం స్విచ్చబుల్ టచ్ కంట్రోల్ కన్సోల్‌తో వస్తుంది.

  • ఈ కాంపాక్ట్ సెడాన్ؚను రెండు ఇంజన్ఎంపికలతో అందుబాటులో ఉంది: 1.5-లీటర్ టర్బో పెట్రోల్ మరియు 1.5-లీటర్ నేచురల్లీ అస్పిరేటెడ్ పెట్రోల్ ఎంపికలతో అందిస్తున్నారు.

  • రూ. 25,000 ముందస్తు ధరను చెల్లించి దీని బుక్ చేసుకోవచ్చు.

2023 హ్యుందాయ్ వెర్నా లాంచ్‌కు ముందే అధికారిక టీజర్‌లు, స్పై షాట్‌ల ద్వారా దీని గురించి అనేక వివరాలు వెల్లడయ్యాయి. ఈ కొత్త జనరేషన్ సెడాన్ ఇంటీరియర్ ఫీచర్‌ల గురించి మరిన్ని వివరాలు ఈ వాహన తయారీదారు వెల్లడించారు, ఇంతకు ముందు చూసిన వివరాలను ధృవీకరించారు.

ఇన్ఫోటైన్ؚమెంట్ మరియు క్లైమేట్ కంట్రోల్ؚలు వివరించబడ్డాయి

కొత్త టీజర్‌లో 10.25-అంగుళాల ఇన్ఫోటైన్ؚమెంట్ సిస్టమ్ కోసం ఇంటిగ్రేటెడ్ స్క్రీన్ మరియు డిజిటల్ డ్రైవర్ డిస్ప్లేలను చూపించారు. ఇంతకు ముందు టీజర్‌లో చూసిన విధంగా బోస్ ఎనిమిది-స్పీకర్‌ల సౌండ్ సిస్టమ్ؚను కూడా ధృవీకరించింది.

ఇది కూడా చూడండి: సొంత దేశంలో క్రాష్ అయిన కొత్త హ్యుందాయ్ వెర్నా టెస్ట్ మోడల్, ఫలితాలు ఇక్కడ అందించబడ్డాయి

కొత్త డ్యాష్‌బోర్డు పూర్తిగా కనిపించకపోయిన, కొత్త టచ్-ఆధారిత క్లైమేట్ కంట్రోల్ ప్యానెల్‌ను స్పష్టంగా చూడగలిగాము, ఇది రెండు వైపులా డయల్స్ؚతో ఇన్ఫోటైన్ؚమెంట్ కంట్రోల్స్ؚగా కూడా పని చేస్తుంది. ఇది కియా EV6లో కనిపించిన ప్రీమియం సెంట్రల్ కన్సోల్ డిజైన్. అదనంగా, వెర్నా దాని వెంటిలేటెడ్ సీట్ ఫంక్షన్‌ను విస్తరించింది, తద్వారా ఈ సెగ్మెంట్‌లో హీటెడ్ సీట్‌లను అందించే మొదటి వాహనంగా నిలిచింది.

ఇది కూడా చదవండి: కొత్త- జనరేషన్ వెర్నా డిజైన్ మరియు కొలతలను వెల్లడించిన హ్యుందాయ్

అంచనా భద్రతా ఫీచర్‌లు

ప్రయాణీకుల భద్రత విషయానికి వస్తే, ఈ కాంపాక్ట్ సెడాన్ ఆరు ఎయిర్ బ్యాగ్ؚలు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESC) మరియు EBDతో ABSను కలిగి ఉంటుందని అంచనా. కొత్త వెర్నా లేన్ కీప్ అసిస్ట్, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, ఆటో-ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి ADAS టెక్ స్యూట్‌తో (అడ్వాన్సెడ్ డ్రైవర్ అస్సిస్టెన్స్ సిస్టమ్స్) వస్తుందని టీజర్‌లు నిర్ధారిస్తున్నాయి.

పవర్ؚట్రెయిన్ వివరాలు

కొత్త జనరేషన్ వెర్నాలో కొత్త 1.5-లీటర్ T-GDi (టర్బో పెట్రోల్) ఇంజన్‌తో (160PS మరియు 253Nm) అందిస్తామని హ్యుందాయ్ ఇప్పటికే ధృవీకరించింది, 1.5-లీటర్ MPi (నేచురల్లీ అస్పిరేటెడ్) పెట్రోల్ ఇంజన్ؚను(115PS మరియు 144Nm) నిలుపుకుంటుంది. రెండు యూనిట్‌లు 6 స్పీడ్‌ల మాన్యువల్ ట్రాన్స్ మిషన్‌ను ప్రామాణికంగా పొందుతాయి, మొదటిది ఏడు-స్పీడ్‌ల DCT ఎంపికతో, రెండవది CVT ఆటోమ్యాటిక్ ఎంపికతో వస్తాయి.

అంచనా ధర పోటీదారులు

నెక్స్ట్-జనరేషన్ వెర్నా ధరలను హ్యుందాయ్ మార్చి 21న వెల్లడించనుంది, ఇది రూ.10 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుందని ఆశిస్తున్నాము. విడుదల అయిన తరువాత, ఇది హోండా సిటీ, స్కోడా స్లావియా, వోక్స్ؚవ్యాగన్ విర్టస్, మారుతి సుజుకి సియాజ్ؚలతో పోటీని కొనసాగిస్తుంది.

s
ద్వారా ప్రచురించబడినది

shreyash

  • 11 సమీక్షలు
  • 0 Comments

Write your Comment పైన హ్యుందాయ్ వెర్నా

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిసెడాన్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
ఫేస్లిఫ్ట్
Rs.73.50 - 78.90 లక్షలు*
ఎలక్ట్రిక్
Rs.2.03 - 2.50 సి ఆర్*
ఎలక్ట్రిక్
Rs.41 - 53 లక్షలు*
Rs.11.53 - 19.13 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర