కొత్త-జనరేషన్ వెర్నా డిజైన్ మరియు కొలతలను వెల్లడించిన హ్యుందాయ్
హ్యుందాయ్ వెర్నా కోసం rohit ద్వారా మార్చి 03, 2023 05:37 pm ప్రచురించబడింది
- 78 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
నిలిపివేస్తున్న మోడల్‌తో పోలిస్తే కొత్త వెర్నా పొడవుగా, వెడల్పుగానే కాకుండా పొడవైన వీల్ؚబేస్ కూడా కలిగి ఉంది.
-
హ్యుందాయ్ కొత్త వెర్నాను మార్చి 21 తేదీన విడుదల చేయనుంది.
-
కొత్త టీజర్‌లో, ఈ సెడాన్ కనెక్టెడ్ LED లైటింగ్‌తో కనిపిస్తుంది.
-
లేత గోధుమ రంగు లెదర్ؚ అప్హోల్స్టరీ, AC వెంట్‌లను కలిగి ఉన్న వెనుక క్యాబిన్ؚ టీజర్‌లో కనిపిస్తుంది.
-
ఖచ్చితంగా ఉండే ఫీచర్‌లలో ADAS, ఇంటెగ్రేటెడ్ డిస్ప్లేలు ఉన్నాయి.
-
రెండు పెట్రోల్ ఇంజన్‌లతో రానుంది: పాత నేచురల్లీ ఆస్పిరేటెడ్ 1.5-లీటర్, కొత్త 1.5-లీటర్ టర్బో యూనిట్ؚ.
-
దీని ధర రూ. 10 లక్షల నుంచి (ఎక్స్-షోరూమ్) ప్రారంభమవుతుందని అంచనా.
ఆరవ-జనరేషన్ వెర్నా ఎక్స్ؚటీరియర్ؚను హ్యుందాయ్ అధికారికంగా ప్రదర్శించింది. ఎక్స్ؚటీరియర్ మాత్రమే కాకుండా, వెనుక క్యాబిన్ؚ డిజైన్ టీజర్‌ను కూడా విడుదల చేసింది. ఈ కొత్త సెడాన్ విడుదల తేదీ మార్చి 21 కంటే ముందే రూ.25,000 ముందస్తు ధర చెల్లించి బుక్ చేసుకుకోవచ్చు.
టీజర్ లో గమనించిన వివరాలు
టీజర్ వీడియోలో పొడవైన LED DRL స్ట్రిప్, మూడు లైట్‌లను కలిగిన హెడ్ؚలైట్ యూనిట్ؚతో కొత్త వెర్నా ముందు భాగాన్ని చూపించింది. V-ఆకారపు నమూనాతో ఉన్న గ్రిల్‌ను కూడా గమనించవచ్చు. ప్రొఫైల్ వ్యూ కనిపించకపోయిన, కనెక్టెడ్ LED టెయిల్ లైట్‌లకు పైన ఉన్న “వెర్నా” బ్యాడ్జింగ్ؚను చూపుతున్న వెనుక భాగాన్ని కూడా వీడియోలో చూడవచ్చు.
ఈ సెడాన్ ఇంటీరియర్ పాక్షిక వీక్షణని మొదటిసారిగా ఈ కారు తయారీదారు విడుదల చేశారు. ఆరవ-జనరేషన్ వెర్నా వెనుక క్యాబిన్ భాగాన్ని హ్యుందాయ్ విడుదల చేసింది, ఇందులో లేత గోధుమ రంగు లెదర్ؚ అప్హోల్స్టరీ, AC వెంట్ؚలు, బోస్ సౌండ్ సిస్టమ్ మరియు రెండు ఛార్జింగ్ పోర్టులతో మొబైల్ ఉంచేందుకు కొంత స్థలాన్ని చూడవచ్చు.
కొత్త వెర్నా అన్నిటిలోను దాదాపుగా పెద్దదిగా ఉంది
కొలత |
ఐదవ-జెన్ వెర్నా |
ఆరవ-జెన్ వెర్నా |
తేడా |
పొడవు |
4,440మిమీ |
4,535మిమీ |
+95మిమీ |
వెడల్పు |
1,729మిమీ |
1,765మిమీ |
+36మిమీ |
ఎత్తు |
1,475మిమీ |
1,475మిమీ |
తేడా లేదు |
వీల్ؚబేస్ |
2,600మిమీ |
2,670మిమీ |
+70మిమీ |
బూట్ స్పేస్ |
అందుబాటులో లేదు |
528 లీటర్లు |
– |
నిలిపివేస్తున్న మోడల్‌తో పోలిస్తే కొత్త వెర్నా 95మిమీ పొడవు, 36మిమీ వెడల్పు ఉంది, కానీ ఎత్తులో ఎటువంటి మార్పు లేదు. దీని వీల్ؚబేస్‌ను 79మిమీ పెంచారు, ఇది క్యాబిన్ లోపల మరింత స్థలాన్ని అందిస్తుంది, బూట్ؚస్పేస్ 528 లీటర్‌లు ఉంటుంది, ఈ విభాగంలో ఇది అత్యంత ఎక్కువ బూట్ؚస్పేస్ అని హ్యుందాయ్ పేర్కొంది.
ఇది కూడా చూడండి: మొదటిసారిగా కొత్త-జనరేషన్ హ్యుందాయ్ వెర్నా ఇండియా-స్పెసిఫికేషన్ వివరాలు
వాహనంలో ఉన్న క్యాబిన్ అంశాలు, ఫీచర్‌లు
కొత్త వెర్నాలో డ్యాష్‌బోర్డుపై మృదువైన మెటీరీయల్, నాజూకైన AC వెంట్ؚలతో నలుపు మరియు లేత గోధుమ రంగు క్యాబిన్ థీమ్ ఉంటుందని హ్యుందాయ్ ధృవీకరించింది. కూల్డ్ గ్లోవ్ బాక్స్, ఇంటిగ్రేటెడ్ డిస్ప్లే(ఒకొక్కటి 10.25-అంగుళాలు)లతో సహా సెడాన్ؚలో ఉన్న కొన్ని ఫీచర్‌లను కూడా వెల్లడించింది. సన్ రూఫ్, క్రూజ్ కంట్రోల్, ఆటోమ్యాటిక్ క్లైమెట్ కంట్రోల్, వంటి ఇతర ఫీచర్‌లను కూడా ఆశించవచ్చు. భద్రత కిట్ؚలో అడ్వాన్సెడ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS), ఆరు ఎయిర్ؚబ్యాగ్ؚలు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), ముందు మరియు వెనుక పార్కింగ్ సెన్సర్‌లు ఉన్నాయి.
అందిస్తున్న పవర్ؚట్రెయిన్
జనరేషన్ అప్ؚడేట్ؚతో, హ్యుందాయ్ కాంపాక్ట్ సెడాన్ పెట్రోల్ తో మాత్రమే అందించబడుతుంది. ప్రస్తుత 1.5-లీటర్ నేచురల్లీ అస్పిరేటెడ్ ఇంజన్ (115PS/144Nm), కొత్త 1.5-లీటర్ టర్బో పెట్రోల్ యూనిట్ (160PS /253Nm)లతో వస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ ప్రామాణికంగా ఉంటుంది, మొదటిది CVTని కూడా పొందుతుంది, రెండవది ఏడు-స్పీడ్ DCT ఎంపికగా లభ్యమవుతుంది.
దీన్ని కూడా చదవండి: హ్యుందాయ్ నవీకరించబడిన ఆల్కజార్‌కు టర్బో-పెట్రోల్ ఇంజన్ؚను అందిస్తుంది, బుకింగ్ؚలు ప్రారంభమయ్యాయి
ధర, పోటీదారులు
ఆరవ-జనరేషన్ వెర్నాను ఈ కారు తయారీదారు మార్కెట్‌లో రూ.10 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరకు పరిచయం చేస్తారని ఆశిస్తున్నాము. నవీకరించబడిన హోండా సిటీ, స్కోడా స్లావియా, వోక్స్ؚవ్యాగన్ విర్టస్, మారుతి సియాజ్ؚలతో ఈ కాంపాక్ట్ సెడాన్ పోటీ పడనుంది.
0 out of 0 found this helpful