30 భద్రతా ఫీచర్‌లను ప్రామాణికంగా, అదనంగా ADASను పొందనున్న కొత్త హ్యుందాయ్ వెర్నా
published on మార్చి 16, 2023 01:03 pm by rohit for హ్యుందాయ్ వెర్నా
- 59 సమీక్షలు
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
దీని ప్రామాణిక భద్రతా స్యూట్ؚలో ఆరు ఎయిర్ బ్యాగ్ؚలు, ఆటో హెడ్‌ల్యాంప్ؚలు, ప్రయాణికులందరికీ మూడు పాయింట్ సీట్ బెల్ట్ؚలు ఉంటాయి
-
ఆరవ-జనరేషన్ వెర్నాను హ్యుందాయ్ మార్చి 21న విడుదల చేయనుంది.
-
మొదటిసారిగా ADAS ఫీచర్ؚతో వస్తుంది, దీనితో పాటుగా ఫార్వార్డ్-కొలిజన్ వార్నింగ్ మరియు ఆడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటాయి.
-
ఇతర భద్రతా ఫీచర్‌లలో ESC మరియు ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్‌లు ఉన్నాయి.
-
2023 వెర్నా, 115PS పవర్ ను విడుదల చేసే 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ అలాగే 160PS పవర్ ను విడుదల చేసే 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ అను రెండు ఎంపికలతో వస్తుంది.
-
దీని ధర రూ. 10 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది అని అంచనా.
ఆరవ-జనరేషన్ హ్యుందాయ్ వెర్నా త్వరలోనే విడుదల కానుంది. విడుదలకు ముందు, ఈ కొత్త సెడాన్ؚలో ఉండే ముఖ్యమైన భద్రతా ఫీచర్‌లను కారు తయారీదారు వెల్లడించారు. ఇది మొత్తం 65 భద్రతా ఫీచర్‌లతో వస్తుంది – వీటిలో అడ్వాన్సెడ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS) కూడా ఉంది – 30 వరకు ఫీచర్‌లు ప్రామాణికంగా ఉంటాయి.
ప్రామాణిక భద్రతా సెట్
2023 వెర్నా ప్రామాణిక భద్రతా కిట్ؚలో మూడు పాయింట్‌ల సీట్ బెల్టులు (ప్రయాణికులు అందరికీ), ఆరు ఎయిర్ బ్యాగ్ؚలు, సీట్ బెల్ట్ రిమైండర్, EBDతో ABS, ISOFIX చైల్డ్ సీట్ యాంకరేజీలు, ఆటో-హెడ్ؚలైట్‌లు, రేర్ డిఫోగర్ మరియు రేర్ పార్కింగ్ సెన్సార్‌లు ఉంటాయి.
ADAS అధికారికంగా ధృవీకరించబడింది
జనరేషన్ నవీకరణతో, హ్యుందాయ్ తన కాంపాక్ట్ సెడాన్ؚకు ADAS సెన్సార్‌లు, ముందు కెమెరా వంటి కొన్ని ADAS ఫీచర్‌లను అందించింది. ఈ బ్రాండ్ స్మార్ట్ సెన్స్‌స్యూట్ؚతో ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్, బ్లైండ్ స్పాట్ అలర్ట్, లేన్ కీపింగ్ అసిస్ట్, లేన్ డిపార్చర్ వార్నింగ్ మరియు అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ ఉంటాయి. ఇతర ADAS ఫీచర్‌లలో, డ్రైవర్ అటెన్షన్ వార్నింగ్, హై-బీమ్ అసిస్ట్, లీడ్ వెహికిల్ డిపార్చర్ అలర్ట్ వంటి ఇతర ADAS ఫీచర్‌లు ఉన్నాయి.
ఇది కూడా చదవండి: GM టాలెగావ్ ప్లాంట్ కొనుగోలుకు టర్మ్ షీట్‌పై సంతకం చేసిన హ్యుందాయ్ ఇండియా
ఇతర భద్రతా ఫీచర్‌లు
ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్‌లు, ఆల్ డిస్క్ బ్రేక్, టైర్-ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి ఫీచర్‌లను కూడా హ్యుందాయ్ వెర్నాకు జోడిస్తుంది, కానీ ఇవన్నీ అగ్ర శ్రేణి వేరియెంట్‌లకు మాత్రమే పరిమితం కావచ్చు.
పెట్రోల్ పవర్ మాత్రమే
ఆరవ జనరేషన్ హ్యుందాయ్ వెర్నా కేవలం పెట్రోల్ వెర్షన్‌తో వస్తుంది. ఇది నిలిపివేస్తున్న మోడల్ؚలో ఉండే 1.5-లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజన్ (115PS/144Nm) మరియు ఒక కొత్త 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ యూనిట్‌ను (160PS/253Nm) కలిగి ఉంటుంది. హ్యుందాయ్ దీనిలో ఆరు-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ؚమిషన్ؚను ప్రామాణికంగా అందిస్తుంది, మొదటిది CVTని మరియు తరువాతది ఏడు-స్పీడ్ DCTని పొందుతుంది.
సంబంధించినది: భారతదేశంలో ఈ వెర్షన్ గల కొత్త హ్యుందాయ్ వెర్నా దొరకదు
విడుదల మరియు పోటీదారులు
హ్యుందాయ్ కొత్త వెర్నాను మార్చి 21న భారతదేశంలో విడుదల చేయనుంది. దీని ధరలు రూ. 11 లక్షల (ఎక్స్-షోరూమ్) వద్ద ప్రారంభం అవుతాయని అంచనా. ఈ కొత్త కాంపాక్ట్ సెడాన్ స్కోడా స్లావియా, వోక్స్ؚవ్యాగన్ వర్చుస్, మారుతి సియాజ్ మరియు నవీకరించబడిన హోండా సిటీలతో పోటీ పడుతుంది.
ఇది కూడా చదవండి: రూ. 10 లక్షల కంటే తక్కువ ధరను కలిగిన 10 ఆటోమ్యాటిక్ ట్రాన్స్ؚమిషన్ కార్‌ల వివరాలు
- Renew Hyundai Verna Car Insurance - Save Upto 75%* with Best Insurance Plans - (InsuranceDekho.com)
- Loan Against Car - Get upto ₹25 Lakhs in cash
0 out of 0 found this helpful