కొత్త హ్యుందాయ్ శాంత్రో వేరియంట్ల వివరణ: D- లైట్, ఎరా, మాగ్నా, స్పోర్ట్స్ మరియు ఆస్తా
హ్యుందాయ్ శాంత్రో కోసం dhruv attri ద్వారా మార్చి 22, 2019 02:25 pm ప్రచురించబడింది
- 23 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
కొత్త హ్యుందాయ్ శాంత్రో రూ.3.9 లక్షల ధర నుంచి రూ.5.65 లక్షల(ఎక్స్-షోరూమ్ పాన్-ఇండియా) ధర వరకూ ఉంది. ఇది D- లైట్, ఎరా, మాగ్నా, స్పోర్ట్స్జ్ మరియు ఆస్తా అను ఐదు వేరియంట్లలో అందించబడుతుంది మరియు రెండు ఫ్యుయల్ ఆప్షన్స్ మరియు రెండు గేర్బాక్స్ ఆప్షన్ లలో అందించబడుతుంది. 5-స్పీడ్ AMT మాత్రమే పెట్రోల్ ఇంజిన్ తో అందుబాటులో ఉంది మరియు మాగ్నా మరియు స్పోర్ట్జ్ వేరియంట్స్ కి పరిమితం చేయబడింది. మీరు శాంత్రొ కోసం చూస్తున్నారా? కానీ ఏ వేరియంట్ అయితే మీ బడ్జెట్ కి సరిపోతుందో తెలియక తికమక పడుతున్నారా? మా ఈ వివరణ మీరు నిర్ణయం తీసుకోడంలో సహాయపడుతుంది.
రంగు ఎంపికలు:
- D- లైట్: టైఫూన్ సిల్వర్, స్టార్ డస్ట్, పోలార్ వైట్
- ఎరా: పోలార్ వైట్, టైఫూన్ సిల్వర్, ఇంపీరియల్ బీజ్ మరియు స్టార్ డస్ట్
- మాగ్నా, స్పోర్ట్స్ & ఆస్తా: మెరీనా బ్లూ, ఫెయరి రెడ్, పోలార్ వైట్, టైఫూన్ సిల్వర్, ఇంపీరియల్ బీజ్ మరియు డయానా గ్రీన్
ప్రామాణిక భద్రతా కిట్
- ఇమ్మొబలైజర్
- డ్రైవర్ ఎయిర్బాగ్
- EBD తో ABS
- చైల్డ్ సేఫ్టీ డోర్ లాక్స్
- ఫైర్ ఎక్స్టింగిషర్ (CNG లో మాత్రమే)
హ్యుందాయ్ శాంత్రో డిలైట్: మరింత సరసమైనది కావచ్చు; మేము సిఫార్సు చేసే వేరియంట్ మాత్రం కాదు
వేరియంట్ ధర
D-లైట్ రూ.3.90 లక్షలు
బయట భాగాలు: హాలోజెన్ హెడ్ల్యాంప్స్, క్లియర్లెన్స్ తో టెయిల్ ల్యాంప్స్ మరియు హబ్ కప్స్ తో 13-ఇంచ్ స్టీల్ వీల్స్.
లోపల భాగాలు: గోల్డ్ గార్నిష్ తో డ్యూయల్-టోన్ బీజ్ మరియు బ్లాక్ డాష్బోర్డ్, 1L బాటిల్ హోల్డర్లతో ఫ్రంట్ మరియు రేర్ డోర్ పాకెట్స్.
సౌకర్యాలు: ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్, టాకోమీటర్,గేర్ షిఫ్ట్ ఇండికేటర్ తో 2.5-ఇంచ్ MID (మల్టీ-ఇన్‌ఫో డిస్ప్లే) ఇన్స్టృమెంటల్ కన్సోల్, సర్వీస్ రిమైండర్, ఏవరేజ్ స్పీడ్,డ్యుయల్ ట్రిప్‌మీటర్,డోర్ అజార్ మరియు డ్రైవర్ సీటు బెల్ట్ మరియు తక్కువ ఇంధన హెచ్చరిక, మరియు ఫోల్డబుల్ రేర్ సీట్లు.
ఆడియో: అందుబాటులో లేదు
మీరు కొనుగోలు చేసేందుకు ఈ వేరియంట్ సరైనదా?
మీరు హ్యుందాయ్ సాంత్రొ ని కొనుగోలు చేయాలని అనుకుంటునట్లయితే, అది దాని ప్రీమియమ్ ప్యాకేజింగ్ కోసం అయ్యుండాలి. ఏమైనప్పటికీ, దీనిలో AC లేదా పవర్ విండోస్ వంటి బేసిక్ లక్షణాలు మిస్ అయ్యాయి. మీరు పరిమితమైన బడ్జెట్ ని కలిగి ఉంటే, ఇటీవలే నవీకరించబడిన డాట్సన్ GO ని మేము సిఫార్సు చేస్తాము, ఇది శాంత్రొ తో పోలిస్తే మంచి భద్రతా లక్షణాలను అందిస్తుంది. మీకు ఎక్కడో శాంత్రో నే కొనుగోలు చేయాలని ఉందా? అయితే మీ బడ్జెట్ కోసం ఏ వేరియంట్ సరిపోతుందో తెలుసుకోవడానికి మాతో రండి కలిసి కనుక్కుందాము.
హ్యుందాయ్ శాంత్రో ఎరా: ఎక్కువగా డ్రైవ్ చేసేవాళ్ళకి మరియు బడ్జట్లో కావాలా? దీన్ని ఎంచుకోండి
వేరియంట్ ధర
ఎరా రూ.4.25 లక్షలు
D- లైట్ మీద ప్రీమియం రూ .36,000
బయట భాగాలు: బాడీ-రంగు బంపర్స్
సౌకర్యాలు: రేర్ వెంట్స్ తో మాన్యువల్ A.C మరియు ఫ్రంట్ పవర్ విండోస్
కొనుగోలు చేసేందుకు ఈ వేరియంట్ సరైనదా?
అవును,ఎవరైతే బడ్జట్ లో ఉన్నారో మరియు ఎక్కువగా తిరగడం ఇష్టపడతారో వాళ్ళకి ఇది సరైనది. ఎందుకంటారా? దీనిలో రేర్ A.C వెంట్స్ ఉన్నాయి మరియు మేము దీనిలో కూర్చొని మరీ గమనించింది ఏమిటంటే, దీనిలో వెనుక చాలా స్పేస్ ఉంది. వెనుక భాగంలో సగటు వయసు గల పెద్దవారికి సరిపడినంతా లెగ్‌రూం ఉంది. ఎవరైతే దీనిని తమ ప్రాధమిక కారు అని భావిస్తారో వారు దీనిలో ఆడియో యూనిట్ మరియు ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ORVM ని మిస్ అవుతారు. మేము ఇంకా కనుక్కున్నది ఏమిటంటే, D-లైట్ కంటే అధనపు లక్షణాలను కలిగి ఉన్న ఎరా వేరియంట్ అధనం గా రూ.36,000 ఖరీదు కలిగి ఉంది.
హ్యుందాయ్ శాంత్రో మాగ్నా: డయానా గ్రీన్ బయట రంగుతో అత్యంత సరసమైన వేరియంట్. మీకు గ్రీన్ సీటు బెల్ట్స్ తో బ్లాక్ ఇంటీరియర్స్ అదీ టైట్ బడ్జెట్ లో కావాలనుకుంటే దీని కోసం వెళ్ళండి. విచారంగా, ఇది డ్రైవర్-సైడ్ ఎయిర్బాగ్ ని మాత్రమే కలిగి ఉంది.
వేరియంట్ ధర
మాగ్నా రూ.4.58 లక్షలు
ఎరా మీద ప్రీమియం రూ.35,000
మాగ్నా AMT (MT పైగ అదనపు) రూ. 5.19 లక్షలు (రూ. 62,000)
మాగ్నా CNG (పెట్రోల్ పై అదనపు) రూ .5.24 లక్షలు (రూ. 67,000)
బయట భాగాలు: క్రోం తో ఫ్రంట్ గ్రిల్, బాడీ-రంగు డోర్ హ్యాండిల్స్ మరియు ORVMs
లోపల భాగాలు: డైయానా గ్రీన్ బాహ్య కలర్ ఆప్షన్ ఎంచుకున్నట్లయితే మీరు గ్రీన్ చేరికలతో బ్లాక్ ఇంటీరియర్స్ ని పొందుతారు. మిగతా అన్ని బాహ్య రంగులకి డోర్ హ్యాండిల్స్ మీద షాంపైన్ గోల్డ్ చేరికలు కలిగి ఉంటారు.
సౌకర్యాలు: రేర్ పవర్ విండోస్, రేర్ పార్సెల్ ట్రే (CNG), టికెట్ హోల్డర్.
భద్రత: డే / నైట్ IRVM, సెంట్రల్ లాకింగ్
ఆడియో: FM, బ్లూటూత్ మరియు USB తో 2-DIN ఆడియో సిస్టమ్,AMT వేరియంట్ లో ఫ్రంట్ స్పీకర్లు, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్ మరియు మైక్రో యాంటెన్నా.
కొనుగోలు చేసుకొనేందుకు ఈ వేరియంట్ సరైనదా?
ఈ మాగ్మా వేరియంట్ క్రోం ఫ్రంట్ గ్రిల్,బాడీ కలర్డ్ డోర్ హ్యాండిల్స్ మరియు ORVMs అన్నీ కూడా బయట చూడడానికి ఆస్తా లానే బాగుంటుంది. ముఖ్యంగా టాప్ వేరియంట్ తీసుకున్నట్లయితే దానిలో కూడా అలాయ్ వీల్స్ లేవు. శాంత్రొ మాగ్నా వీల్ కవర్స్ లేకుండా 13-ఇంచ్ స్టీల్ వీల్స్ తో అందించబడుతుంది.
అయితే పెట్రోల్ మాన్యువల్ అది అందించే ఆఫర్స్ కి దాని ముందు వేరియంట్ కంటే ఎక్కువ ధరను కలిగి ఉంది. ఆ అధనపు లక్షణాలు రూ.35,000 న్యాయం చేయవు.
పైన చెప్పిందే క్రింద వర్తిస్తుంది. ఈ CNG వేరియంట్ ఎరా కంటే 1.01లక్షలు ఎక్కువ, ఈ డబ్బుకి మీరు ఫ్రంట్ స్పీకర్స్ మరియు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ని మాత్రమే పొందుతారు.
మాగ్మా ఒక ప్రవేశ స్థాయి AMT వేరియంట్ అయినప్పటికీ, ఇది మాన్యువల్ మీద రూ.62,000 ఎక్కువ ధరను కలిగి ఉండి ఆటోమేటెడ్ గేర్ షిఫ్ట్స్ తో సౌకర్యాన్ని అందిస్తుంది.
శాంత్రో మాగ్నా ని కొనుక్కోవాలనుకుంటే,ఇది AMT లేదా డైయానా గ్రీన్ కలర్ లో వస్తుంది. గ్రీన్ చేరికలతో బ్లాక్ ఇంటీరియర్స్ మరియు మ్యాచింగ్ సీటు బెల్టు ల ఖరీదు ఎరా కంటే రూ.35,000 ఎక్కువ. ఈ అంశాల కోసం మేము ఈ కారు సిఫార్సు చేస్తే అది ఒక అరుదైన అంశం అవుతుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే, దీనిలో డ్రైవర్ ఎయిర్‌బ్యాగ్ ఉంది. అందుకని డ్రైవర్ ఒక్కరే ఎక్కువ సార్లు వెళ్ళేటట్టు అయితే మేము దీనిని సిఫార్సు చేస్తాము.
హ్యుందాయ్ శాంత్రో స్పోర్ట్జ్: మీరు ఒక AMT ని పొందడానికి చూస్తున్నట్లయితే మీకు ఇది సరైన వేరియంట్
వేరియంట్ ధర
స్పోర్ట్స్ రూ.5 లక్షలు
మాగ్న మీద ప్రీమియం రూ.43,000
స్పోర్ట్స్జ్ AMT (AMT మీద ప్రీమియం) రూ.5.47 లక్షలు(రూ.48,000)
స్పోర్ట్స్ CNG(CNG పై ప్రీమియం) రూ. 5.65 లక్షలు (రూ. 66,000)
బయట భాగాలు: కవర్లతో పెద్ద 14-ఇంచ్ స్టీల్ వీల్స్ మరియు అవుట్‌సైడ్ రేర్ వ్యూ మిర్రర్స్ మీద టర్న్ ఇండికేటర్స్.
సౌకర్యాలు: రేర్ డిఫాగర్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ORVMs, కీలెస్ ఎంట్రీ, ఎకో కోటింగ్ టెక్నాలజీతో A.C, క్యాబిన్ లోపల గాలి నాణ్యతను మెరుగుపరించేందుకు హ్యుందాయి తీసుకొచ్చింది.
భద్రత: ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్
ఆడియో: ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, మిర్రర్లింక్ మరియు స్మార్ట్ఫోన్ నావిగేషన్, వాయిస్ రికగ్నైజేషన్, బ్లూటూత్, USB కనెక్టివిటీ, రియర్ స్పీకర్లతో 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ యూనిట్.
కొనుగోలు చేసుకొనేందుకు ఈ వేరియంట్ సరైనదా?
ఈ వేరియంట్ చాలా ఉత్తమమైనదిగా ఉంటుంది. దీని క్రింద వేరియంట్ లో లేని కొన్ని అవసరమైన లక్షణాలు దీనిలో ఉన్నాయి. అయినప్పటికీ దీనిలో ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్,స్పీడ్ సెన్సింగ్ డోర్ లాక్ మరియు హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు వంటి లక్షణాలు లేవు. అందువలన ఎవరికైతే డ్రైవింగ్ బాగా వచ్చో వారికి మేము ఇది సిఫార్సు చేస్తాము.
అయితే దీనిలో మీరు ఏమిటి పొందుతారు అంటే, దీని లో ఉన్న సౌకర్యాలు మరియు భద్రతా లక్షణాల వలన ఓనర్షిప్ అనుభూతిని పొందుతారు. దీనిలో హైలేట్ ఏమిటంటే గ్రాండ్ i10 లో ఉన్నటువంటి టచ్‌స్క్రీన్ ఇంఫోటైన్మెంట్ సిష్టం దీనిలో ఉండడం. ఈ వ్యవస్థ చాలా కనెక్టివిటీ ఆప్షన్స్ తో అందించబడుతుంది.
మీరు శాంత్రో లో AMT ఆప్షన్ తీసుకోవాలనుకుంటే, ఈ స్పోర్ట్స్ వేరియంట్ మంచి లక్షణాలతో అందించబడుతుంది. స్పోర్ట్స్ మరియు మాగ్మా యొక్క ధరల వ్యత్యాసం చాలా ఎక్కువ. దీని టాప్ వేరియంట్ అయిన ఆస్తా లో AMT ఆప్షన్ లేదు.
హ్యుందాయ్ శాంత్రో ఆస్టా: డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్బాగ్స్ ని కలిగి ఉన్నందున మేము ఎక్కువగా సిఫార్సు చేసే వేరియంట్. అయితే, ఇది కొద్దిగా ఖరీదైనది.
వేరియంట్ ధర
ఆస్తా రూ.5.46 లక్షలు
స్పోర్ట్జ్ MT పై ప్రీమియం రూ.47,000
భద్రత: పార్కింగ్ సెన్సార్ తో రేర్ కెమెరా, ముందర ప్రయాణీకులకు ఎయిర్బాగ్, లోడ్ లిమిటర్స్, స్పీడ్ మరియు ఇంపాక్ట్-సెన్సింగ్ డోర్ లాక్ తో ఉన్న ఫ్రంట్ సీటు బెల్ట్.
సౌకర్యాలు: వెనుక వాషర్ మరియు వైపర్, మరియు ప్రయాణీకులకు వానిటీ మిర్రర్.
కొనుగోలు చేసుకొనేందుకు ఈ వేరియంట్ సరైనదా??
ఇక్కడ ముందుగా ఒకటి స్పష్టత చేయాలి. ఆస్తా వేరియంట్ దీని అధనపు లక్షణాల కారణంగా శాంత్రో స్పోర్ట్స్ కంటే కొంచెం ఖరీదు ఎక్కువ. అయితే లోడ్ లిమిటర్స్ తో ఫ్రంట్ సీటు బెల్ట్స్ మరియు డ్యుయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్ ని కలిగి ఉన్న ఏకైక వేరియంట్ ఇది. ఎవరైనా శాంత్రో కొనుక్కోవాలనుకుంటే మేము ఈ వేరియంట్ ని సిఫార్సు చేస్తాము.
ఇక మేము ముగించే ముందు శాంత్రో యొక్క స్పెసిఫికేషన్ షీట్ ను గమనిద్దాము.
Dimensions (mm)
కొలతలు(mm) |
|
పొడవు |
3610 |
వెడల్పు |
1645 |
ఎత్తు |
1560 |
వీల్బేస్ |
2400 |
బూట్ స్పేస్ |
235 లీటర్ |
Engine
ఇంజిన్ |
1.1-లీటర్, 4-సిలిండర్ ఎప్సిలాన్ |
పవర్(CNG) |
69Ps (59Ps) |
టార్క్ (CNG) |
101Nm (86Nm) |
ట్రాన్స్మిషన్ |
5-స్పీడ్ MT / AMT |
ARAI సర్టిఫైడ్ ఇంధన సామర్ధ్యం (CNG) |
20.3Kmpl (30.48km/kg) |
0 out of 0 found this helpful