డిమాండ్ లో కార్లు: 10K + జోన్‌లో వాగన్ఆర్, సెలెరియో మరియు హ్యుందాయ్ సాంట్రో దానికి దగ్గరగా వెళ్ళాయి
మారుతి వాగన్ ఆర్ 2013-2022 కోసం dhruv ద్వారా అక్టోబర్ 23, 2019 01:49 pm ప్రచురించబడింది
- 23 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్ విభాగంలో మారుతి వాగన్ఆర్ మాత్రమే సెప్టెంబర్ 2019 లో 10,000 నెలవారీ అమ్మకాల మైలురాయిని దాటింది
- వాగన్ఆర్ మార్కెట్ షేర్ కేవలం 50 శాతం కంటే తక్కువ.
- సెలెరియో పెద్దగా అప్‌డేట్ లేకుండా చాలా కాలం పాటు ఉంది.
- సాంట్రో అమ్మకాలు 3,000 మార్కు వద్ద స్థిరంగా ఉంటాయి.
- గత సంవత్సరంతో పోలిస్తే టియాగో మార్కెట్ షేర్ దాదాపు సగం తగ్గిపోయింది.
- ఇగ్నిస్ మరోసారి 1,000 యూనిట్ మార్కును దాటింది.
- డాట్సన్ GO యొక్క అమ్మకాలు చాలా తక్కువ, 150 యూనిట్లను కూడా దాటలేకపోయాయి.
మారుతున్న నిబంధనలతో మరియు కార్ల అమ్మకాలలో తగ్గుదలతో భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ కఠినమైన సమయాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ, కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్ విభాగం పెద్దగా ప్రభావితం కానట్లు కనిపిస్తోంది. వాగన్ఆర్, సెలెరియో, సాంట్రో, టియాగో, ఇగ్నిస్ మరియు డాట్సన్ GO వంటి కార్లు ఉన్నఈ విభాగంలో నెలవారీ 25 వేల యూనిట్ అమ్మకాలతో కొనసాగుతోంది. ఏ కార్లు ఇతరులకన్నా మెరుగ్గా పనిచేస్తున్నాయో తెలుసుకోవడానికి క్రింద చూడండి.
కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్‌లు |
|||||||
మారుతి వాగన్ఆర్ |
11757 |
11402 |
3.11 |
49.25 |
38.88 |
10.37 |
13119 |
మారుతి సెలెరియో |
4140 |
4765 |
-13.11 |
17.34 |
27.01 |
-9.67 |
6366 |
హ్యుందాయ్ సాంట్రో |
3502 |
3288 |
6.5 |
14.67 |
0 |
14.67 |
5471 |
టాటా టియాగో |
3068 |
3037 |
1.02 |
12.85 |
24.57 |
-11.72 |
4832 |
మారుతి ఇగ్నిస్ |
1266 |
1322 |
-4.23 |
5.3 |
7.76 |
-2.46 |
2223 |
డాట్సన్ GO |
136 |
205 |
-33.65 |
0.56 |
1.75 |
-1.19 |
221 |
మారుతి వాగన్ఆర్ |
11757 |
11402 |
3.11 |
49.25 |
38.88 |
10.37 |
13119 |
మొత్తం |
23869 |
24019 |
-0.62 |
99.97 |
మారుతి వాగన్ఆర్:
వాగన్ఆర్ ఈ నెలలో మరోసారి 10 K మార్కును దాటింది, ఆగస్టు అమ్మకాలను 300-400 యూనిట్ల మేర మెరుగుపరిచింది. ఇది ఈ నెలలో కేవలం 50 శాతం కంటే తక్కువ మార్కెట్ షేర్ ను సాధించింది మరియు గత ఆరు నెలల్లో దాని సగటు నెలవారీ అమ్మకాలకు చాలా దగ్గరగా వచ్చింది అని చెప్పవచ్చు.
మారుతి సెలెరియో:
మారుతి సుజుకి నుండి వచ్చిన పాత రేస్ గుర్రం ఇప్పటివరకూ ఎటువంటి అప్‌డేట్ ని పొందకపోయినప్పటికీ రెండవ స్థానంలో నిలిచింది. ఇది 2019 సెప్టెంబర్‌లో 4,000 యూనిట్లకు పైగా అమ్మగలిగింది మరియు 17 శాతానికి పైగా కొంచెం పైన మార్కెట్ షేర్ ని కలిగి ఉంది.
హ్యుందాయ్ సాంట్రో: హ్యుందాయ్ నుండి వచ్చిన కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్ కేవలం 15 శాతం లోపు మార్కెట్ షేర్ ను కలిగి ఉంది మరియు 2019 ఆగస్టుతో పోల్చితే దాని MoM అమ్మకాలు పెరిగాయి, అమ్మకాల గణాంకాలు ఆరు నెలల క్రితం ఉన్న వాటి కంటే చాలా తక్కువగా ఉన్నాయి.
టాటా టియాగో:
ఆగస్టు 2019 తో పోల్చితే టియాగో అమ్మకాలు స్థిరంగా ఉన్నాయి, కానీ గత ఆరు నెలల ఏవరేజ్ గనుక చూసినట్లయితే అంత బాగా లేవు అని చెప్పాలి, ఎందుకంటే ఈ హ్యాచ్‌బ్యాక్ సేల్స్ గత ఏడాది ఏవరేజ్ నెలవారీ అమ్మకాల మార్క్ కంటే 2000 యూనిట్లు తక్కువగా ఉంది. ఇది కేవలం 13 శాతం లోపు మార్కెట్ షేర్ ను కొనసాగిస్తోంది.
మారుతి ఇగ్నిస్: గత ఆరు నెలల్లో ఇగ్నిస్ అమ్మకాలు నెలవారీ ఏవరేజ్ కు దగ్గరగా లేనప్పటికీ, నెక్సా ఉత్పత్తి 1,000 యూనిట్ మార్కును అధిగమించగలిగింది, ఇది అంత చెత్తగా ఏమీ లేదు అనే చెప్పాలి, ఎందుకంటే దీనిలో కేవలం పెట్రోల్ ఇంజన్ మాత్రమే అందుబాటులో ఉంది. ఇది కేవలం ఐదు శాతానికి పైగా మార్కెట్ షేర్ ను ఇస్తుంది.
డాట్సన్ GO: జపాన్ కార్ల తయారీదారు సెప్టెంబరులో కేవలం 150 యూనిట్లలోపు విక్రయించినందున డాట్సన్ GO యొక్క అమ్మకాల సంఖ్య తగ్గుతునే వచ్చింది. వ్యత్యాసం అంతగా ఉండకపోవచ్చు, కానీ ఆగస్టు 2019 అమ్మకాలతో పోలిస్తే ఇది MoM అమ్మకాలలో దాదాపు 35 శాతం తగ్గింపు.
మొత్తం: మొత్తంమీద, ఆగస్టు మరియు సెప్టెంబర్ అమ్మకాల సంఖ్య మధ్య వ్యత్యాసం చాలా భిన్నంగా లేదు, వ్యత్యాసం 200 యూనిట్ల కన్నా తక్కువ, ఇది ఒక శాతం కూడా ఉండదు.
మరింత చదవండి: మారుతి వాగన్ R AMT
0 out of 0 found this helpful