కొత్త హ్యుందాయ్ శాంత్రో 2018 (AH2 హ్యాచ్‌బ్యాక్) రహస్యంగా పట్టుబడింది
హ్యుందాయ్ శాంత్రో కోసం jagdev ద్వారా జూన్ 10, 2019 11:37 am ప్రచురించబడింది
- 28 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
AH2 హాచ్బాక్ యొక్క ధర అధికారికంగా 23 అక్టోబరున వెల్లడి చేయబడుతుంది
నవీకరణ: 2018 హ్యుందాయ్ శాంత్రో అధికారిక వివరాలు విడుదల అయ్యాయి; బుకింగ్స్ అక్టోబర్ 10 నుండి ప్రారంభమవుతాయి
హ్యుందాయి నుండి రాబోతున్న AH2 హ్యాచ్‌బ్యాక్(కోడ్‌నేం), ఏదైతే శాంత్రో అని పిలవబడుతుందో అది అధికారికంగా వెళ్ళడి అవ్వడానికి ముందే దాని మొదటి లుక్ వెళ్ళడించడమయ్యింది. ముందర భాగం, వెనక భాగం మరియు డాష్‌బోర్డ్ డిజైన్ మనకి ఆ చిత్రాలలో కనిపించాయి. ఈ చిత్రాల నుండి మేము క్రింద పేర్కొన్న అంశాలని ఊహించగలిగాము:
1. 2018 శాంత్రో ముందు బంపర్ ని చాలా వరకూ కప్పే విస్తృత క్యాస్కేడింగ్ ఫ్రంట్ గ్రిల్ తో వస్తుంది. అలాగే ఫాగ్‌ల్యాంప్స్ కూడా ఈ బ్లాక్ ప్లాస్టిక్ క్లాడింగ్ తో అమర్చబడి ఉన్నాయి.
2.గ్రిల్ పైన, మనకి రెండు స్వెప్ట్‌బ్యాక్ హెడ్ లాంప్స్ కలిగి ఉన్నాయి, ఇవి మనకి అంత స్పష్టంగా లేవు, ప్రొజెక్టర్-టైప్ లేదా సాధారణ రిఫ్లెక్టర్-టైప్ హాలోజెన్ యూనిట్లు కాదా అనేది స్పష్టంగా లేదు.
3. చాలా ఆధునిక కార్లు వలె, ORVM లపై సైడ్ టర్న్ ఇండికేటర్స్ ఉన్నాయి. టాప్ వేరియంట్ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ORVM లను పొందుతుందని ఊహించాము. హ్యుందాయ్ ఎలక్ట్రికల్ ఫోల్డబుల్ ORVM లను కూడా అందిస్తుంది అని మేము భావిస్తున్నాము.
4.ఇంకా వెనుకకు ఎటువంటి బ్రాండింగ్ లేదు, కనుక ఇది AH2 ను శాంత్రో గా పిలవబడుతుందా అని ఇంకా నిర్ధారించబడలేదు. వేరియంట్ మీద ఎటువంటి సూచన లేదు.
5. శాంత్రో యొక్క టాప్-ఎండ్ వేరియంట్ వెనుక భాగంలో వైపర్ మరియు రేర్ పార్కింగ్ కెమెరా ని పొందుతుంది, ఈ రెండు కూడా పైన ఉన్న చిత్రంలో చూడవచ్చు.
6.ఇది టెయిల్ లైట్స్ LED ఎలిమెంట్స్ ని పొందుతుందా లేదా అనేది చూడాలి.
7. చిత్రాల నుండి, ముందు సీటు హెడ్ రెస్ట్లు సర్దుబాటు కావచ్చు అని తెలుస్తుంది.
8.వెనుక సీటులో హెడ్ రెస్ట్లు అయితే స్థిరంగా ఉన్నట్టు తెలుస్తుంది.
9.ఇంకొక ముఖ్యమైన అంశం ఏమిటంటే ఇంటీరియర్స్ యొక్క స్పై చిత్రాలు తెలియని చిహ్నాలు / బటన్లు ని గేర్ లివర్ వెనుక భాగంలో కలిగి ఉంటాయి. చిత్రంలో కారు ఒక ఆటోమేటిక్ వేరియంట్ గా కనిపిస్తుంది. హ్యుందాయ్ ఇప్పటికే శాన్ట్రాకు AMT కూడా లభిస్తుందని ప్రకటించింది.
10. శాంత్రో E-క్లచ్-రకం AMT ను పొందవచ్చు అని భావిస్తున్నాము. ఎటువంటి క్లచ్ పెడల్ లేకుండా మినహా మాన్యువల్ కారులో డ్రైవర్ ఏ విధంగా అయితే గేర్స్ ని షిఫ్ట్ చేస్తాడో అలానే చేయాలి, కానీ దీనిలో క్లచ్ పెడల్ ఉండదు. ఈ E-AMT అనేది రెనాల్ట్ క్విడ్ మరియు మారుతి సుజుకి స్విఫ్ట్ AMT కన్నా కూడా చాలా సరసమైనదిగా ఉంటుంది. E-AMT గురించి మరింత తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇక్కడ నొక్కండి.
11.శాంత్రో లేత గోధుమ రంగు ఇంటీరియర్ కలర్ పథకం ని పొందుతుంది, ఎయిర్కాన్ వెంట్స్ మరియు గేర్ లివర్ చుట్టూ కొన్ని అల్యూమినియం-టైప్ ఫినిషింగ్ ని కూడా పొందుతుంది.
12.డాష్బోర్డ్ పైన పెద్ద టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంది. ఇది ఒక 7-అంగుళాల యూనిట్ వలె కనిపిస్తోంది, అయితే, హ్యుందాయ్ దీన్ని ఇంకా నిర్ధారించలేదు.
13.ఈ చిత్రంలో ఉన్నది టాప్ స్పెక్ వేరియంట్ అయితే మాత్రం మేము ఖచ్చితంగా చెప్పగలము శాంత్రో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ని పొందలేదు అని.
మీరు పైన మేము చెప్పిన అంశాలు కాకుండా చిత్రాల నుండి ఇంకా ఏదైనా గమనించినట్లు అయితే దిగువ వ్యాఖ్యల విభాగంలో మాకు తెలియజేయండి. 2018 శాంత్రో యొక్క ధరలు 2018 సెప్టెంబర్ 23 న ప్రకటించబడతాయి. ఇది మారుతి సుజుకి వాగన్ఆర్ తో పోటీ పడుతుంది, ఇది హ్యుందాయ్ యొక్క పోర్ట్ ఫోలియోలో ఇయాన్ కంటే ఎక్కువ మరియు గ్రాండ్ i10 కన్నా తక్కువ ధర ఉంటుంది.