Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

ఆన్‌లైన్‌లో కనిపించిన ఫేస్‌లిఫ్టెడ్ కియా సెల్టోస్ మిడ్-స్పెక్ వేరియెంట్‌ల కొత్త వివరాలు

కియా సెల్తోస్ కోసం rohit ద్వారా జూలై 03, 2023 06:18 pm ప్రచురించబడింది

HTK మరియు HTK+ వేరియెంట్‌లు కొత్త SUV ముఖ్యమైన ఫీచర్‌లను అందించడం లేదు, కానీ సవరించిన క్యాబిన్ లేఅవుట్ؚను కలిగి ఉంటాయి.

  • నవీకరించిన సెల్టోస్ؚను కియా జూలై 4న ఆవిష్కరించనుంది.

  • HTK మరియు HTK+ వేరియెంట్‌లు 8-అంగుళాల టచ్‌స్క్రీన్ మరియు ఒక డిజిటైజ్ చేయబడిన డ్రైవర్ డిస్ప్లేతో వస్తాయని కొత్త చిత్రాలు తెలుపుతున్నాయి.

  • HTK ఎక్స్ؚటీరియర్ ముఖ్యాంశాలలో ప్రొజెక్టర్ హెడ్ؚలైట్‌లు మరియు హ్యాలోజెన్ ఫాగ్ ల్యాంప్ؚలు ఉన్నాయి.

  • కియా నవీకరించిన సెల్టోస్ؚను పెట్రోల్ మరియు డీజిల్ రెండు ఇంజన్ ఎంపికలలో అందిస్తుంది.

  • ధరలు రూ. 10 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం అవుతాయని అంచనా.

జూలై 4న విడుదల కానున్న నవీకరించిన కియా సెల్టోస్ టీజర్‌ను మొట్ట మొదటి సారిగా విడుదల చేశారు. ఈ టీజర్‌లో టాప్-స్పెక్ క్యాబిన్ؚ స్పష్టంగా కనిపిస్తుండగా, అప్‌డేట్ చేయబడిన SUV మిడ్-స్పెక్ HTK మరియు HTK+ వేరియెంట్‌ల సరికొత్త వివరాలను కూడా చూడవచ్చు.

సవరించిన క్యాబిన్ అప్‌డేట్‌లు

తాజా రహస్య చిత్రాలలో గమనిస్తే, HTK మరియు HTK+ వేరియెంట్ؚలు రెండిటిలో స్టీరింగ్ؚకు-అమర్చిన ఆడియో కంట్రోల్ؚలు (HTK+లో క్రూయిజ్ కంట్రోల్ మరియు MID కంట్రోల్ కూడా ఉన్నాయి), ఫ్యాబ్రిక్ అప్ؚహోల్స్ట్రీ, చిన్న 8-అంగుళాల టచ్ؚస్క్రీన్, మరియు కియా సోనెట్ؚలో ఉన్నట్లుగానే డిజిటైజ్ చేయబడిన డ్రైవర్ డిస్ప్లే వంటి కొన్ని ఉమ్మడి ఫీచర్‌లు ఉన్నాయి. HTK వేరియెంట్ؚలో మాన్యువల్ AC ఉండగా. మరొకదానిలో ఆటో క్లైమేట్ కంట్రోల్ ఉంది. HTK+ వేరియెంట్ పుష్-బటన్ స్టార్ట్/స్టాప్ؚను కలిగి ఉంది, ఇది ఈ రెండు వేరియెంట్ؚల మధ్య మరొక తేడా కావచ్చు.

ఇది కూడా చదవండి: అజాగ్రత్తగా ఉండకండి: ఈ వర్షాకాలంలో నివారించవలసిన సాధారణ కారు సంరక్షణ తప్పులు

ఎక్స్ؚటీరియర్ మార్పులు

రహస్య చిత్రాలలో ఒక దానిలో, HTK వేరియెంట్‌లో సవరించిన ముందు భాగాన్ని కూడా చూడవచ్చు. ఈ SUV HTK వేరియెంట్‌లో భారీ గ్రిల్, పక్కపకనే ఉన్న ప్రొజెక్టర్ హెడ్‌లైట్లు మరియు LED DRLలు కనిపించాయి. దిగువన, హయ్యర్-స్పెక్ వేరియెంట్ؚలలో ఉండే LED యూనిట్‌లకు బదులుగా సిల్వర్ స్కిడ్ ప్లేట్ మరియు హ్యాలోజెన్ ఫాగ్ ల్యాంపులు ఉన్నాయి.

పవర్ؚట్రెయిన్ ఎంపికలు

నవీకరించిన సెల్టోస్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్‌లతో కొనసాగుతుంది. ట్రాన్స్ؚమిషన్ ఎంపికలతో పాటు వాటి వివరాలను కింద చూడవచ్చు:

స్పెసిఫికేషన్

1.5-లీటర్ N.A. పెట్రోల్

1.5-లీటర్ టర్బో-పెట్రోల్

1.5-లీటర్ డీజిల్

పవర్

115PS

160PS

116PS

టార్క్

144Nm

253Nm

250Nm

ట్రాన్స్ؚమిషన్

6-స్పీడ్ MT/ CVT

6-స్పీడ్ iMT/ 7-స్పీడ్ DCT

6-స్పీడ్ iMT/ 6-స్పీడ్ AT

ఇది కూడా చదవండి: ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ లోపం కారణంగా కియా క్యారెన్స్ కార్లు మళ్ళీ వెనక్కి

ఇది ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది?

కియా నవీకరించిన సెల్టోస్ ధరలను ఆవిష్కరణ తరువాత ప్రకటిస్తుందని భావిస్తున్నాము, ధరలు రూ. 10 లక్షల నుండి (ఎక్స్-షోరూమ్) ప్రారంభంకావచ్చు అని అంచనా. హ్యుందాయ్ క్రెటా, వోక్స్వాగన్ టైగూన్, టయోటా హైరైడర్, స్కోడా కుషాక్, మారుతి గ్రాండ్ విటారా మరియు MG ఆస్టర్ؚలతో పోటీని కొనసాగిస్తుంది, అలాగే విడుదల కానున్న హోండా ఎలివేట్ మరియు సిట్రోయెన్ C3 ఎయిర్‌క్రాస్ؚకు కూడా పోటీ ఇస్తుంది.

చిత్రం మూలం

ఇక్కడ మరింత చదవండి: సెల్టోస్ డీజిల్

r
ద్వారా ప్రచురించబడినది

rohit

  • 95 సమీక్షలు
  • 0 Comments

Write your Comment పైన కియా సెల్తోస్

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
ఫేస్లిఫ్ట్
Rs.1.36 - 2 సి ఆర్*
Rs.7.51 - 13.04 లక్షలు*
Rs.43.81 - 54.65 లక్షలు*
Rs.9.98 - 17.90 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర