• English
  • Login / Register

కొత్త ఆడి క్యూ7 మలేషియాలో ప్రవేశపెట్టబడినది, తరువాత భారతదేశంలో ప్రారంభించబడుతుంది

ఆడి క్యూ7 2006-2020 కోసం cardekho ద్వారా నవంబర్ 23, 2015 05:12 pm ప్రచురించబడింది

  • 17 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

Audi Q7

ఆడి ఇండియా, ఈ కొత్త ఆడి క్యూ7 3.0 టి ఎఫ్ ఎస్ ఐ క్వాట్రో ట్రిం వాహనాన్ని, ఆర్ ఎం 589,900 ధరతో మలేషియాలో ప్రవేశపెట్టింది (భారతీయ రూపాయలలో 91.06 లక్షలు). అంతకుముందు ఈ ఎస్యువి, డిసెంబర్ 2014 లో ప్రదర్శించారు మరియు పరిచయం కావడానికి ముందు డెట్రాయిట్ వద్ద 2015 ఎన్ ఏ ఐ ఏ ఎస్ షోలో ప్రదర్శించడం జరిగింది. ఈ వాహనం, 3.0 లీటర్ టి ఎఫ్ ఎస్ ఐ సూపర్ చార్జెడ్ వి6 ఇంజన్ తో వస్తుంది. ఈ ఇంజన్ అత్యధికంగా, 333 బి హెచ్ పి పవర్ ను అదే విధంగా 2900 నుండి 5300 ఆర్ పి ఎం మధ్యలో 440 ఎన్ ఎం గల అధిక టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంది. ఈ ఇంజన్, 8- స్పీడ్ టిప్ ట్రోనిక్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో జత చేయబడి ఉంటుంది. ఈ కొత్త క్యూ7 వాహనం యొక్క త్వరణం విషయానికి వస్తే, 100 కె ఎం పి హెచ్ వేగాన్ని చేరడానికి 6.3 సెకన్ల సమయం పడుతుంది మరియు ఈ వాహనం, మునుపటి వాహనం కంటే 1.6 సెకన్లు వేగంగా వెళుతుంది అని చెప్పవచ్చు. మరోవైపు ఇదే వాహనం, 250 కె ఎం పి హెచ్ అధిక వేగాన్ని చేరుకోగల సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ కొత్త ఆడి క్యూ7 వాహనాన్ని భారతదేశంలో, ఈ సంవత్సరం చివరిలోగా ప్రారంబించే అవకాశాలున్నాయి.   

Audi Q7

కొలతలు పరంగా చెప్పాలంటే, ఈ కొత్త క్యూ7 వాహనం యొక్క మొత్తం పొడవు 5050 మిల్లీ మీటర్లు, వెడల్పు 1970 మిల్లీ మీటర్లు మరియు వీల్బేస్ 2990 మిల్లీ మీటర్లు. ఈ వాహనాన్ని మునుపటి వెర్షన్ తో పోలిస్తే, ఈ వాహనం 37 మిల్లీ మీటర్ల తక్కువ పొడవును కలిగి ఉంటుంది మరియు 15 మిల్లీ మీటర్లు తక్కువ వెడల్పును అలాగే 12 మిల్లీ మీటర్ల తక్కువ వీల్బేస్ ను కలిగి ఉంటుంది. ఈ వాహనం, అడాప్టివ్ ఎయిర్ సస్పెన్షన్ తో వస్తుంది. అంతేకాకుండా, ఈ వాహనానికి డీఅర్ ఎల్ ఎస్ తో కూడిన ఎల్ ఈ డి హెడ్ ల్యాంప్లు, 20 అంగుళాల 10 స్పోక్ల రింలు, హీట్ మరియు ఆటో యాంటీ గ్లర్ వెలుపలి రేర్ వ్యూ మిర్రర్లు, విధ్యుత్తు తో ఆపరేట్ అయ్యే టైల్ గేట్, వ్యూ కెమెరా తో కూడిన పార్క్ అసిస్ట్, నాలుగు జోన్ల ఎయిర్ కండీషనర్, పుష్ బటన్ ప్రారంభం మరియు నాలుగు విధాల లుంబార్ మద్దతును అలాగే డ్రైవర్ సీటుకు మెమోరీ ఫంక్షన్ ను కలిగిన విధ్యుత్తు ముందు సీట్లు వంటి అంశాలను అందించడం జరిగింది. వీటన్నింటితో పాటు ఈ ఎస్యువి వాహనానికి, ఎం ఎం ఐ టచ్ తో కూడిన ఎం ఎం ఐ నావిగేషన్ ప్లస్, 8.3 అంగుళాల సెంటర్ ప్రదర్శన, 3డి మ్యాప్ ప్రదర్శన, హ్యాండ్ రైటింగ్ రికగ్నైజేషన్ తో కూడిన ఒక టచ్ సెన్సిటివ్ ప్యానెల్ మరియు సంగీత నిల్వ కోసం 10జిబి ఫ్లాష్ మెమోరీ వంటి సమాచార వ్యవస్థ లను అందించడం జరిగింది.   

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your Comment on Audi క్యూ7 2006-2020

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience