• English
  • Login / Register

భారతదేశంలో రూ. 49 లక్షల ధరతో విడుదలైన Mini Countryman Shadow Edition

మినీ కూపర్ కంట్రీమ్యాన్ కోసం rohit ద్వారా అక్టోబర్ 10, 2023 09:20 pm సవరించబడింది

  • 610 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

మినీ సంస్థ, భారతదేశంలో కంట్రీమ్యాన్ షాడో ఎడిషన్‌లను 24 యూనిట్లను మాత్రమే అందిస్తోంది

Mini Countryman Shadow edition

  • లిమిటెడ్ ఎడిషన్, స్పోర్టీ కంట్రీమ్యాన్ కూపర్ S JCW మోడల్‌పై ఆధారపడి ఉంటుంది.

  • ఇది బ్రాన్జ్ ORVM హౌసింగ్‌లు మరియు రూఫ్, డీకాల్స్ అలాగే 18-అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో పూర్తిగా నలుపు రంగును పొందుతుంది.

  • లోపలవైపు, ఇది సిల్వర్ పైపింగ్ మరియు JCW-ప్రత్యేక మెటల్ పెడల్స్‌తో టాన్ లెదర్ అప్హోల్స్టరీని కలిగి ఉంది.

  • ఫీచర్ల జాబితాలో 8.8-అంగుళాల టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ మరియు డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి.

  • ఈ SUV, 2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది, అంతేకాకుండా ఈ ఇంజన్ 7-స్పీడ్ DCTతో జత చేయబడింది.

పండుగ సీజన్‌లో పరిశ్రమ అంతటా పలు కార్ల తయారీదారులు తమ మోడల్‌ల యొక్క వివిధ ప్రత్యేక మరియు లిమిటెడ్ ఎడిషన్‌లను పరిచయం చేశారు. ఇప్పుడు, కంట్రీమ్యాన్ కూపర్ S JCW మోడల్‌పై ఆధారపడిన మినీ కంట్రీమ్యాన్స్ షాడో ఎడిషన్‌ను తీసుకురావడం ద్వారా మినీ దానిని అనుసరించింది. దీని ధర రూ. 49 లక్షలు (ఎక్స్-షోరూమ్ పాన్-ఇండియా) మరియు కాంపాక్ట్ లగ్జరీ SUV యొక్క 24 యూనిట్లు మాత్రమే ఆఫర్‌లో ఉన్నాయి.

బాహ్య భాగంలో తేడా ఏమిటి?

Mini Countryman Shadow edition bonnet decals
Mini Countryman Shadow edition bronze ORVM housings

లిమిటెడ్ ఎడిషన్ అయినందున, కంట్రీమ్యాన్ షాడో ఎడిషన్ ఆల్-బ్లాక్ ఎక్స్టీరియర్ పెయింట్ ఆప్షన్, ORVMలు మరియు రూఫ్‌ల కోసం బ్రాన్జ్ ఫినిషింగ్ మరియు బోనెట్ అలాగే ఫ్రంట్ ఫెండర్‌లపై డీకాల్స్ వంటి విభిన్న ప్రత్యేకతలను పొందింది. మినీ దీనికి 18-అంగుళాల అల్లాయ్ వీల్స్ మరియు సి-పిల్లర్ పైన ఉన్న రూఫ్‌పై 'షాడో' ఎడిషన్ డీకాల్స్‌ను కూడా అందించింది. 'కంట్రీమ్యాన్' చిహ్నంతో సహా అన్ని మోనికర్‌లు నలుపు రంగు ఫినిషింగ్లో అందించబడ్డాయి. JCW (జాన్ కూపర్ వర్క్స్) ఎడిషన్ అయినందున, ఇది JCW ఏరోడైనమిక్స్ కిట్‌తో అమర్చబడింది, ఇది స్పోర్టి వైఖరిని ఇస్తుంది.

SUVలు రూ. 40 లక్షల నుండి రూ. 50 లక్షల వరకు ఉంటాయి

భారతదేశంలో 5-సీట్ల SUVలు

లోపలభాగం క్లాస్సి

Mini Countryman Shadow edition seats

లోపలి భాగంలో, మినీ కంట్రీమ్యాన్ షాడో ఎడిషన్ SUV యొక్క టాన్ లెదర్ అప్హోల్స్టరీని కలిగి ఉంది, అయితే లిమిటెడ్ ఎడిషన్ స్వభావాన్ని ప్రతిబింబించేలా కాంట్రాస్ట్ సిల్వర్ పైపింగ్‌ను కలిగి ఉంది. ఇది JCW-ఎక్స్‌క్లూజివ్ మెటల్ పెడల్స్ మరియు స్టీరింగ్ వీల్ కోసం నప్పా లెదర్ ఫినిషింగ్‌ను కూడా కలిగి ఉంది.

Mini Countryman Shadow edition panoramic glass roof

ఫీచర్ల విషయానికొస్తే, కంట్రీమ్యాన్ షాడో ఎడిషన్ మినీ ఎగ్జైట్‌మెంట్ ప్యాక్‌లో భాగంగా LED యాంబియంట్ లైటింగ్‌తో పాటు పుడిల్ ల్యాంప్‌లను పొందుతుంది. SUVలోని ఇతర పరికరాలలో పనోరమిక్ గ్లాస్ రూఫ్, 8.8-అంగుళాల టచ్‌స్క్రీన్, పవర్డ్ టెయిల్‌గేట్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ మరియు క్రూజ్ కంట్రోల్ ఉన్నాయి. దీని భద్రతా లక్షణాల జాబితాలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ప్రయాణీకులందరికీ 3-పాయింట్ సీట్‌బెల్ట్‌లు, రివర్సింగ్ కెమెరా మరియు కార్నరింగ్ బ్రేక్ కంట్రోల్ ఉన్నాయి.

ఇది కూడా చదవండి: స్కోడా స్లావియా మ్యాట్ ఎడిషన్ రూ. 15.52 లక్షలతో ప్రారంభించబడింది

హుడ్ కింద ఏమి ఉంది?

Mini Countryman Shadow edition

మినీ కంట్రీమ్యాన్ షాడో ఎడిషన్, ఒకే ఒక 2-లీటర్ 4-సిలిండర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ (181PS/280Nm)తో అందించబడుతుంది. మినీ దీనిని 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ట్రాన్స్‌మిషన్ (DCT)తో జత చేసింది మరియు 5-డోర్ల క్రాస్‌ఓవర్ SUV, 7.5 సెకన్లలో 0-100kmph వేగానికి చేరుకోగలదని చెప్పారు. ఇది రెండు డ్రైవ్ మోడ్‌లను కలిగి ఉంది: అవి వరుసగా స్పోర్ట్ మరియు గ్రీన్.

పోటీదారులు

Mini Countryman Shadow edition rear

లిమిటెడ్ ఎడిషన్ 5-డోర్ మినీ కంట్రీమ్యాన్‌కి ప్రత్యక్ష ప్రత్యర్థులు లేరు, అయితే ఇది మెర్సిడెస్ బెంజ్ GLA, BMW X1, వోల్వో XC40 మరియు ఆడి Q3ల వాహనాలకు ప్రత్యామ్నాయంగా పరిగణించబడుతుంది.

ఇది కూడా చదవండి: నిస్సాన్ మాగ్నైట్ కురో ఎడిషన్ ప్రారంభించబడింది, దీని ధరలు రూ. 8.27 లక్షల నుండి ప్రారంభమవుతాయి

మరింత చదవండి : మినీ కూపర్ కంట్రీమ్యాన్ ఆటోమేటిక్

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Mini కూపర్ కంట్రీమ్యాన్

Read Full News

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience