మే 15 నుండి కామెట్ EV బుకింగ్ؚలను ప్రారంభించనున్న MG

ఎంజి కామెట్ ఈవి కోసం shreyash ద్వారా ఏప్రిల్ 27, 2023 03:07 pm ప్రచురించబడింది

  • 74 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

కారు తయారీదారు తమ 2-డోర్‌ల అల్ట్రా కాంపాక్ట్ EVని రూ.7.78 లక్షల ప్రారంభ ధరతో విడుదల చేశారు

MG Comet EV

  • కామెట్ EV మూడు వేరియెంట్ؚలలో అందించబడుతుంది మరియు వాటి వివరాలు త్వరలోనే ప్రకటిస్తారు. 

  • టెస్ట్ డ్రైవ్ؚలు ఏప్రిల్ 27 నుంచి ప్రారంభం అవుతాయి.

  • ఇది 17.3kWh బ్యాటరీ ప్యాక్ؚతో వస్తుంది మరియు 230కిమీ క్లెయిమ్ చేసిన డ్రైవింగ్ రేంజ్ؚను అందిస్తుంది. 

  • దీని ఎలక్ట్రిక్ మోటార్ 42PS పవర్ మరియు 110Nmగా టార్క్‌ను అందిస్తుంది. 

భారతదేశంలో MG కొత్త ఎలక్ట్రిక్ ఆఫరింగ్, కామెట్ EV విడుదల అయ్యింది మరియు దీని ధర రూ.7.98 లక్షల వద్ద ప్రారంభం అవుతుంది (పరిచయ ధర, ఎక్స్-షోరూమ్). ఈ అల్ట్రా కాంపాక్ట్ EV బుకింగ్ؚలు మే 15న ప్రారంభమౌతాయని కారు తయారీదారు నిర్ధారించారు; అంతేకాకుండా, దీని డెలివరీలు కూడా ఎంచుకున్న మార్కెట్‌లలో అదే నెలలో ప్రారంభమౌతాయని వెల్లడించారు. అయితే, దీని టెస్ట్ డ్రైవ్ؚలు త్వరలోనే, అనగా ఏప్రిల్ 27 నుండి ప్రారంభమౌతాయి. 

కామెట్ EV మూడు వేరియెంట్‌లలో అందుబాటులో ఉంటుంది అని MG వెల్లడించింది, వీటి వివరాలు మరియు ధరలు కూడా మే నెలలో వెల్లడించనున్నారు. ఈ కారు తయారీదారు అందించే వాటి శీఘ్ర సమీక్ష కింద అందించబడింది:

ఇది అల్ట్రా కాంపాక్ట్ EV

MG Comet EV

MG కామెట్ EV 2-డోర్‌ల ఎలక్ట్రిక్ వాహనం, ఇందులో నలుగురు ప్రయాణించవచ్చు. మూడు మీటర్‌ల కంటే తక్కువ పొదుపుతో, మార్కెట్ؚలో ఉన్న అతి చిన్న కొత్త కారుగా నిలుస్తుంది మరియు దీని టర్నింగ్ రేడియస్ 4.2మీటర్‌లుగా ఉంది.

ఇది కూడా చదవండి: తన పోటీదారులతో MG కామెట్ EV ధర వివరాలు: స్పెసిఫికేషన్‌ల పోలిక

అందించే ఫీచర్‌లు

MG Comet EV

కామెట్ EV వైర్ؚలెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్ ప్లేؚతో డ్యూయల్-ఇంటిగ్రేటెడ్ 10.25-అంగుళాల టచ్ؚస్క్రీన్ؚల (ఇన్ఫోటైన్మెంట్ మరియు డ్రైవర్ డిస్ప్లేల కోసం) వంటి ప్రీమియం ఫీచర్‌లతో వస్తుంది. ఇది వాయిస్ కమాండ్, మొబైల్ అప్లికేషన్ ద్వారా రిమోట్ ఆపరేషన్‌లు మరియు ఇతర  55 కనెక్టెడ్ కార్ ఫీచర్‌లకు మద్దతు ఇస్తుంది.

దీని భద్రత కిట్ؚలో డ్యూయల్-ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్ؚలు, EBDతో ABS, ప్రయాణీకులు అందరికి మూడు పాయింట్‌ల సీట్ బెల్టులు, రివర్స్ పార్కింగ్ కెమెరా, రేర్ పార్కింగ్ సెన్సార్‌లు మరియు టైర్-ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) ఉంటాయి.

పవర్ؚట్రెయిన్ వివరాలు

MG Comet EV

కామెట్ EV 17.3kWh బ్యాటరీతో వస్తుంది, ఇది ఒక ఛార్జింగ్‌తో 230కిమీ మైలేజ్‌ను అందించగలదు అని పేర్కొంది. ఇది 42PS పవర్ మరియు 110 Nm టార్క్‌ను అందించే ఎలక్ట్రిక్ మోటార్ؚకు జోడించబడుతుంది. 3.3kW AC చార్జర్ؚను ఉపయోగించినప్పుడు, 0-100 శాతం ఛార్జింగ్ؚకు ఏడు గంటలు పడుతుంది మరియు 10 నుండి 80 శాతం బ్యాటరీ ఛార్జింగ్ కోసం ఐదు గంటలు పడుతుంది.

పోటీదారులు 

ప్రస్తుతానికి, MG కామెట్ EVకి భారతదేశంలో ప్రత్యక్ష పోటీదారులు లేకపోయినా, ఇది టాటా టియాగో EV మరియు సిట్రోయెన్ eC3 వంటి వాహనాలకు చవకైన ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది.

ఇక్కడ మరింత చదవండి : కామెట్ EV ఆటోమ్యాటిక్

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన ఎంజి Comet EV

Read Full News

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉందిహాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience