మారుతి BS6 ఎరాలో 1.6 లీటర్ డీజిల్‌ ను తిరిగి తీసుకురానుందా?

నవంబర్ 08, 2019 02:36 pm sonny ద్వారా ప్రచురించబడింది

  • 32 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

పెద్ద నెక్సా సమర్పణలు BS 6 డీజిల్ ఇంజిన్‌ను కలిగి ఉంటాయి

  •  S-క్రాస్ ఫేస్‌లిఫ్ట్ 1.6-లీటర్ డీజిల్ ఇంజిన్‌ తో ఎమిషన్ టెస్టింగ్ కి గురవుతూ మా కంటప పడడం జరిగింది.
  •  మారుతి ఫియట్- ఆధారిత 1.6-లీటర్ డీజిల్‌ ను BS 6 ఎమిషన్ నవీకరణలతో తిరిగి ప్రవేశపెట్టవచ్చు.
  •  డీజిల్ ఇంజన్ S-క్రాస్, సియాజ్ మరియు XL 6 వంటి ప్రీమియం మోడళ్లకు పరిమితం చేయబడుతుంది.
  •  మారుతి యొక్క ఇంటిలో 1.5-లీటర్ డీజిల్ యూనిట్  ని తొలగించి ఫియట్- ఆధారిత 1.3-లీటర్ డీజిల్ ఇంజిన్‌ తో భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయి.
  •  విటారా బ్రెజ్జా, డిజైర్ మరియు బాలెనో వంటి చిన్న కార్లు ఏప్రిల్ 2020 తరువాత పెట్రోల్ మరియు CNG-శక్తితో పనిచేసే ఇంజన్లతో మాత్రమే అందించబడతాయి.

Maruti To Bring Back 1.6-litre Diesel In BS6 Era?

ఏప్రిల్ 2020 నుండి BS6 యుగంలో డీజిల్ ఇంజిన్ల భవిష్యత్తు గురించి ప్రారంభ చర్చ సందర్భంగా, డీజిల్ వేరియంట్లను పూర్తిగా నిలిపివేసే ప్రణాళికలను మారుతి ప్రకటించింది. ఏదేమైనా, కార్ల తయారీదారు దాని ఎంపికలను తెరిచి ఉంచుతుందని మరియు గణనీయమైన డిమాండ్ ఉంటే దాని పెద్ద మోడళ్ల కోసం BS6 కంప్లైంట్ డీజిల్ ఇంజిన్‌ను పరిశీలిస్తుందని పేర్కొన్నారు. 1.6 లీటర్ డీజిల్‌ తో మారుతి సుజుకి S-క్రాస్‌ ఎమిషన్ టెస్టింగ్ చేస్తుండగా మా కంటపడింది, 2020 లో మారుతి కూడా డీజిల్ ని అందించవచ్చని అంచనా.

Maruti To Bring Back 1.6-litre Diesel In BS6 Era?

S-క్రాస్ కాంపాక్ట్ SUV మారుతి సుజుకి నుండి వచ్చిన మొదటి ప్రీమియం నెక్సా ఆఫర్ మరియు రెండు ఫియట్- ఆదారిత డీజిల్ ఇంజిన్‌లతో లభించింది - 1.3 లీటర్ ఇతర మారుతి మోడళ్లలో చూడవచ్చు మరియు 1.6-లీటర్ యూనిట్ కూడా ఉంది. పెద్ద ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్‌ తో మాత్రమే అందించబడింది మరియు 120PS పవర్ మరియు 320Nm టార్క్ ని ఉత్పత్తి చేయడానికి ట్యూన్ చేయబడింది. S-క్రాస్ ఫేస్‌లిఫ్ట్ ప్రవేశపెట్టినప్పుడు, మారుతి పెద్ద డీజిల్ ఇంజిన్‌ ను తొలగించింది, ఎందుకంటే SUV ధర ఎక్కువగా ఉన్నందున తొలగించింది.

Maruti To Bring Back 1.6-litre Diesel In BS6 Era?

ఏదేమైనా, మా కంటపడిన S-క్రాస్ టెస్ట్ మ్యూల్ తాజా వెర్షన్ 1.6 బ్యాడ్జింగ్‌ ను కలిగి ఉంది. మారుతి 1.6-లీటర్ డీజిల్ ఇంజిన్‌ ను తిరిగి ప్రవేశపెట్టగలదని, ఇది BS 6 కంప్లైంట్‌ గా అప్‌డేట్ అయ్యి,  సియాజ్ మరియు XL 6 వంటి ఇతర నెక్సా మోడళ్లలో అందించగలదని ఇది సూచిస్తుంది. 2018 చివరలో సియాజ్ ఫేస్‌లిఫ్ట్‌ లో ప్రారంభమైన అంతర్గత-అభివృద్ధి చెందిన 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ 2020 ఏప్రిల్ ముందు తొలగించనున్నారని ఇది సూచిస్తుంది.

ప్రస్తుతం 1.3-లీటర్ డీజిల్‌ తో నడిచే మారుతి యొక్క చిన్న సమర్పణలు ఊహించిన విధంగా పెట్రోల్ మోడల్‌ గా  మాత్రమే మారతాయి. ఇందులో స్విఫ్ట్, విటారా బ్రెజ్జా, డిజైర్, బాలెనో వంటివి ఉన్నాయి.

ఇవి కూడా చదవండి: CNG వేరియంట్‌లను పొందనున్న మరిన్ని మారుతి హ్యాచ్‌బ్యాక్‌లు

Maruti To Bring Back 1.6-litre Diesel In BS6 Era?

ప్రస్తుత మారుతి సుజుకి S-క్రాస్ 1.3-లీటర్ డీజిల్‌ తో తేలికపాటి హైబ్రిడ్ టెక్నాలజీతో మెరుగైన ఫ్యుయల్ ఎఫిషియన్సీ అందిస్తోంది. దీని ధర రూ .8.81 లక్షల నుండి 11.44 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ఉంది మరియు ఇది హ్యుందాయ్ క్రెటా, రెనాల్ట్ డస్టర్, నిస్సాన్ కిక్స్ మరియు కియా సెల్టోస్ వంటి వాటితో పోటీ పడుతుంది. మారుతి 2020 ఆటో ఎక్స్‌పోలో S-క్రాస్ యొక్క BS 6-కంప్లైంట్ పెట్రోల్ వెర్షన్‌ ను కొన్ని కాస్మెటిక్ అప్‌డేట్స్‌తో పరిచయం చేయనుంది.

చిత్ర మూలం

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

1 వ్యాఖ్య
1
M
magan gavit
Jul 25, 2020, 1:23:45 PM

Ertiga bs6 kab Ayegi

Read More...
    సమాధానం
    Write a Reply
    Read Full News

    ట్రెండింగ్‌లో ఉందికార్లు

    • లేటెస్ట్
    • రాబోయేవి
    • పాపులర్
    ×
    We need your సిటీ to customize your experience