Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

మారుతి సుజుకి జిమ్నీ చివరగా ఇక్కడకి వచ్చింది మరియు మీరు త్వరలో భారతదేశంలో ఒకదాన్ని కొనుగోలు చేయవచ్చు!

మారుతి జిమ్ని కోసం raunak ద్వారా ఫిబ్రవరి 10, 2020 10:57 am ప్రచురించబడింది

ఆటో ఎక్స్‌పో 2020 లో సుజుకి యొక్క ఐకానిక్ మరియు ఎంతో ఇష్టపడే SUV ని ప్రదర్శించారు మరియు ఇది వేరే అవతారంలో భారతదేశానికి తీసుకురాబడుతుంది

  • మారుతి సరికొత్త నాల్గవ తరం సుజుకి జిమ్నీని ఎక్స్పో కు తీసుకువచ్చింది.
  • జిప్సీ తప్పనిసరిగా లాంగ్-వీల్బేస్ ఉన్న సెకండ్-జెన్ గ్లోబల్ జిమ్మీ / సమురాయ్ అని చెప్పవచ్చు.
  • ఇది 5-స్పీడ్ మాన్యువల్ మరియు 4-స్పీడ్ ఆటో గేర్బాక్స్ తో 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్ ని ఉపయోగిస్తుంది.
  • తక్కువ-శ్రేణి ఎంపికతో 4X4 ట్రాన్స్‌ఫర్ కేసు ఉంది, ఇది మంచి ఆఫ్-రోడింగ్ సామర్థ్యాన్ని అందిస్తుంది.
  • దీని రెండు-డోర్ వెర్షన్ భారతదేశానికి వచ్చే అవకాశం లేదు, కాని 2021 నాటికి నాలుగు-డోర్ వెర్షన్ వచ్చే అవకాశం ఉంది.

సుజుకి కొత్త జిమ్మీని ప్రపంచవ్యాప్తంగా వెల్లడించినప్పటి నుండి, మాకు ఒకే ఒక్క ప్రశ్న ఉంది: ఇది భారతదేశానికి వస్తుందా? వచ్చే అవకాశం ఉంది. మారుతి సుజుకి ఆటో ఎక్స్‌పో 2020 లో ఈ సామర్థ్యం గల, బాడీ-ఆన్-ఫ్రేమ్ చిన్న ఆఫ్-రోడర్‌ ను ప్రదర్శించింది.

దాని బోనెట్ కింద ఒక నిరాడంబరమైన 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంది, ఇది 105PS పవర్ నిమరియు 138Nm టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఇది సియాజ్ మరియు ఎర్టిగా లో ఉన్న అదే యూనిట్, మరియు ఇప్పుడు ఎస్-క్రాస్ మరియు ఫేస్‌లిఫ్టెడ్ బ్రెజ్జా లో కూడా రానున్నది. గేర్‌బాక్స్ ఎంపికలు కూడా అదే: 5-స్పీడ్ మాన్యువల్ మరియు 4-స్పీడ్ టార్క్ కన్వర్టర్.

ఈ జిమ్నీని మిగతా వాటి నుండి వేరు చేసేది ఏమిటంటే 4x4 డ్రైవ్‌ట్రెయిన్, ఇది తక్కువ-శ్రేణి ఎంపికను కలిగి ఉంది, ఇది జిమ్నీకి ఎక్కడైనా వెళ్ళగలిగే సామర్థ్యాన్ని ఇస్తుంది. ఇది దాని నేమ్‌ప్లేట్‌ లో స్పష్టంగా కనిపిస్తుంది.

దాని తాజా నాల్గవ-తరం లో, జిమ్నీ పాత జిమ్నిస్‌ లో మనం చూసిన అదే బాక్సీ లేఅవుట్‌ను కలిగి ఉంది, కానీ ఇది గతంలో కంటే పదునుగా మారింది. ఇది ఇప్పుడు మరింత అందంగా కనిపిస్తోంది మరియు ఆ రౌండ్ హెడ్‌ల్యాంప్‌లు ఈ కొత్త డిజైన్‌ ను పాత కార్లను తలపించే విధంగా చేసింది.

పాత మోడళ్ల మాదిరిగానే గాజు ప్రాంతం కూడా భారీగా ఉంటుంది. కాబట్టి, జిమ్మీ యొక్క చిన్న నిష్పత్తిలో ఉన్నప్పటికీ ఈ క్యాబిన్ ఇరుకైన అనుభూతి చెందదని మేము ఆశిస్తున్నాము. దీని టెయిల్‌గేట్-మౌంటెడ్ స్పేర్ వీల్ కూడా జిమ్నీ కి మంచి వ్యాపారం అందించడానికి ఉపయోగపడేలా చక్కగా ఉంటుంది మరియు ఎలాంటి రోడ్డు లోనైనా వెళ్ళే విధంగా ఉంటుంది. ఎక్స్‌పోలోని షోకేస్ మోడల్ దాని రూపానికి కొంచెం ఎక్కువ దృఢత్వాన్ని జోడించడానికి జంగిల్ గ్రీన్ బాహ్య రంగులో కప్పబడి ఉంది.

ఇది ఆఫ్-రోడ్ సామర్ధ్యం గల కారు కనుక, సుజుకి లక్షణాల విషయంలో ఎలాంటి రాజీ అయినా పడింది అని అనుకోకండి. మీరు ఇప్పటికీ క్రూయిజ్ కంట్రోల్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు LED హెడ్‌ల్యాంప్స్ వంటి సౌకర్యాలను పొందుతారు.

భద్రత పరంగా సుజుకి క్యాబిన్ లోపల నలుగురు ప్రయాణీకులకు ఆరు ఎయిర్‌బ్యాగులు, ABS, హిల్ డీసెంట్ కంట్రోల్, హిల్ హోల్డ్ కంట్రోల్, ప్రిటెన్షనర్లతో సీట్‌బెల్ట్‌లు మరియు ఫోర్స్ లిమిటర్లను అందిస్తోంది. టాప్-స్పెక్ జిమ్మీలో సుజుకి అందించే కొన్ని హైలైట్ చేసిన లక్షణాలు ఇవి.

షోరూమ్ అంతస్తులలో మీరు ఎప్పుడు చూస్తారో మేము మీకు చెప్పే పాయింట్ ఇప్పుడు వచ్చింది. జిమ్నీ కనీసం ప్రస్తుత రెండు-డోర్ల అవతారంలో కూడా షోరూమ్‌ లకు ఎప్పుడైనా వచ్చే అవకాశం లేదు. మనల్ని ఊరిస్తున్న ఈ 3-డోర్ జిమ్మీ కూడా రాకపోవచ్చు, 5-డోర్ల ఎక్స్టెండెడ్ వెర్షన్ భారతదేశానికి మరింత ఆచరణాత్మక అర్ధాన్ని ఇస్తుందని అంతర్గత వర్గాలు మాకు తెలిపాయి.

అన్నీ సరిగ్గా జరిగితే, 2021 నాటికి మారుతి సుజుకి దీనిని కస్టమర్లకు అందించవచ్చని మేము అనుకుంటున్నాము మరియు మేము విస్తరించిన వెర్షన్ ను కూడా పొందవచ్చు. వాస్తవానికి, జిప్సీ రెండవ తరం గ్లోబల్ జిమ్మీ / సమురాయ్ యొక్క విస్తరించిన వెర్షన్. కాబట్టి మారుతి బహుశా మరోసారి అలా చేయగలదు. గ్రీన్లైట్ చేస్తే, జిమ్మీ ధరలు సుమారు 10 లక్షల రూపాయల నుండి ప్రారంభమవుతాయి మరియు నెక్సా నుండి రిటైల్ అవుతాయి.

Share via

Write your Comment on Maruti జిమ్ని

D
deepak malik
Oct 11, 2020, 9:04:33 PM

Will buy it definitely definitely definitely

I
ian lee walker
Feb 11, 2020, 9:02:34 PM

That's what we all think but Maruti is living in some trance

M
mahesh
Feb 11, 2020, 12:09:59 PM

we are ready to take as it is

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

Enable notifications to stay updated with exclusive offers, car news, and more from CarDekho!

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
కొత్త వేరియంట్
కొత్త వేరియంట్
Rs.6.20 - 10.51 లక్షలు*
ఎలక్ట్రిక్
Rs.48.90 - 54.90 లక్షలు*
ఫేస్లిఫ్ట్
ఎలక్ట్రిక్కొత్త వేరియంట్
Rs.18.90 - 26.90 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర