• English
    • Login / Register

    మారుతి సుజుకి ఎస్-క్రాస్ పెట్రోల్ ఆటో ఎక్స్‌పో 2020 లో ఆవిష్కరించబడింది

    మారుతి ఎస్-క్రాస్ 2017-2020 కోసం sonny ద్వారా ఫిబ్రవరి 10, 2020 11:14 am ప్రచురించబడింది

    • 27 Views
    • ఒక వ్యాఖ్యను వ్రాయండి

    మారుతి యొక్క ఫ్లాగ్‌షిప్ క్రాస్ఓవర్ ఫేస్‌లిఫ్టెడ్ విటారా బ్రెజ్జా నుండి BS 6-కంప్లైంట్ 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ ద్వారా పవర్ ని పొందుతుంది

    Maruti Suzuki S-Cross Petrol Unveiled At Auto Expo 2020

    •  BS 6-కంప్లైంట్ 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ సియాజ్ మరియు XL 6 తో పంచుకోబడింది.
    •  ఇది అదే 105Ps శక్తిని మరియు 138Nm టార్క్ ని ఉత్పత్తి చేసింది.
    •  ఇది 5-స్పీడ్ మాన్యువల్ మరియు 4-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఎంపికతో అందించబడుతుంది.
    •  2020 ఎస్-క్రాస్ సౌందర్య మార్పులను పొందదు, కాని చిన్న ఫీచర్ అప్‌డేట్స్ ని అందుకుంటుంది.

    మారుతి సుజుకి ఎస్-క్రాస్ కాంపాక్ట్ SUV కి చివరకు భారతదేశంలో పెట్రోల్ ఇంజన్ లభించింది. ఇది ఫేస్‌లిఫ్టెడ్ విటారా బ్రెజ్జాతో పాటు ఆటో ఎక్స్‌పో 2020 లో ఆవిష్కరించబడింది. 

    మారుతి BS 6 యుగంలో డీజిల్ ఇంజన్లను పూర్తిగా తీసేయాలని చూస్తున్నందున, S-క్రాస్‌లోని 1.3-లీటర్ DDS యూనిట్ స్థానంలో BS 6 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను మైల్డ్-హైబ్రిడ్ టెక్‌ తో భర్తీ చేశారు. ఇది సియాజ్, ఎర్టిగా, XL 6 మరియు ఇటీవల విడుదల చేసిన విటారా బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ వంటి పెద్ద మారుతి సుజుకి కార్లకు పవర్ ని అందించే ఇంజన్. ఎస్-క్రాస్ లో, ఇది 105Ps మరియు 138Nm ను ఉత్పత్తి చేస్తుంది మరియు 5-స్పీడ్ మాన్యువల్‌ ప్రామాణికంగా కలిగి ఉంటుంది. ఫేస్‌లిఫ్టెడ్ విటారా బ్రెజ్జాలో కనిపించే విధంగా మారుతి 4-స్పీడ్ AT తో మైల్డ్-హైబ్రిడ్ టెక్‌ను అందిస్తుందని భావిస్తున్నాము. తగినంత డిమాండ్ ఉంటే దాని ఇన్హౌస్-డెవలప్డ్ 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్‌ ను BS 6 రూపంలో కూడా అందించవచ్చు. ఎస్-క్రాస్ కూడా CNG వేరియంట్ ని పొందుతుందని ఆశిస్తున్నాము.

    Maruti Suzuki S-Cross Petrol Unveiled At Auto Expo 2020

    ఇది కూడా చదవండి: మారుతి సుజుకి విటారా బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ ఫిబ్రవరి మధ్యలో లాంచ్ కానున్నది

    ఇది 2017 లో తిరిగి ఫేస్‌లిఫ్ట్ చేయబడినందున, 2020 మారుతి ఎస్-క్రాస్‌ కు ఈ సారి సౌందర్య అప్‌డేట్స్  లేవు. ఇది నెక్సా మోడల్‌ గా కొనసాగుతోంది, సరికొత్త 7.0-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, 16-ఇంచ్ అల్లాయ్ వీల్స్ మరియు క్రూయిజ్ కంట్రోల్ వంటి లక్షణాలను పొందుతుంది.

    Maruti Suzuki S-Cross Petrol Unveiled At Auto Expo 2020

    ఎస్-క్రాస్ కాంపాక్ట్ SUV రెనాల్ట్ డస్టర్, నిస్సాన్ కిక్స్, రెనాల్ట్ క్యాప్టూర్, హ్యుందాయ్ క్రెటా మరియు కియా సెల్టోస్ వంటి వాటికి వ్యతిరేకంగా పోటీని కొనసాగిస్తోంది. ఈ విభాగంలో ఇది ఇప్పటికీ సరసమైన ఆఫర్‌గా ఉంది, దీని ధరలు రూ. 8.5 లక్షల నుండి రూ.12 లక్షల (ఎక్స్-షోరూమ్,ఢిల్లీ) వరకు ఉన్నాయి.  

    మరింత చదవండి: ఎస్-క్రాస్ డీజిల్

    was this article helpful ?

    Write your Comment on Maruti ఎస్-క్రాస్ 2017-2020

    explore similar కార్లు

    ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

    • లేటెస్ట్
    • రాబోయేవి
    • పాపులర్
    ×
    We need your సిటీ to customize your experience