మారుతి సియాజ్ పాతది Vs కొత్తది: ప్రధాన వ్యత్యాసాలు
మారుతి సియాజ్ కోసం dinesh ద్వారా మార్చి 15, 2019 05:05 pm ప్రచురించబడింది
- 28 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
మారుతి సంస్థ భారత మార్కెట్ లో 2018 సియాజ్ ని రూ.8.19 లక్షల ప్రారంభ ధర నుండి రూ.10.97 లక్షల(ఎక్స్-షోరూం డిల్లీ) ధరల వద్ద ప్రారంభించింది. పాత మోడల్ నుండి భిన్నంగా ఉంచేందుకు మారుతి సంస్థ సియాజ్ ఫేస్‌లిఫ్ట్ కి ఒక ప్రధాన మెకానికల్ నవీకరణతో పాటూ కొన్ని సౌందర్య నవీకరణలను కూడా అందించింది. ఏమిమి మార్చబడ్డాయి? తెలుసుకోవడానికి చదవండి.
కొలతలు
2018 సియాజ్ |
ప్రీ-ఫేస్లిఫ్ట్ సియాజ్ |
|
పొడవు |
4,490mm |
4,490mm |
వెడల్పు |
1,730mm |
1,730mm |
ఎత్తు |
1,485mm |
1,485mm |
వీల్బేస్ |
2,650mm |
2,650mm |
బూట్ స్పేస్ |
510 litres |
510 litres |
ఇది ఒక ఫేస్లిఫ్ట్ అయినందున, 2018 సియాజ్ ఈ ముందు భాగంలో మార్పు చేయలేదు. ఇది ప్రతి పరిమాణంలో దాని ముందు దానికి సమానంగానే ఉంది. అందువలన, కొత్త సెడాన్ దాని ముందున్న దాని మాదిరీగానే విశాలంగా ఉంటుందని భావిస్తున్నారు. లోపల స్థలానికి వచ్చినప్పుడు, ముఖ్యంగా వెనుక భాగాన ఉన్నవారికి సియాజ్ ఎప్పుడూ ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది.
డిజైన్
కొత్త మారుతి సుజుకి సియాజ్, కొత్త ముందరి భాగం తో సూటిగా కనిపిస్తుంది. పాత మోడల్ లో ఉండే హారిజాంటల్ స్లాట్ సెటప్ కి బదులుగా సొగసైన స్టడ్డెడ్ గ్రిల్ అందించబడడం జరిగింది. దీనిలో కొద్దిగా ట్వీక్ చేయబడిన హెడ్ల్యాంప్స్ కూడా LED DRLS తో పాటు నవీకరించబడింది. ముందు బంపర్ కూడా కొత్తగా ఉంది మరియు అంతకు ముందు అందుబాటులో ఉన్న హాలోజెన్ యూనిట్ల బదులుగా LED ఫాగ్ లాంప్స్ వస్తుంది.
ప్రక్క భాగం నుండి చూస్తే కొత్త సియాజ్ కారు అవుట్గోయింగ్ మోడల్ ఒకేలా ఉంది. అయితే ఇది ఇప్పుడు 16 ఇంచ్ గన్-మెటల్ ఫినిష్ అలాయ్స్ కి బదులుగా 16-అంగుళాల డ్యుయల్-టోన్ మెషిన్ ఫినిషెడ్(టాప్-స్పెక్స్ ఆల్ఫా వేరియంట్లో) అలాయ్స్ ని అందిస్తుంది. అయితే అలాయ్స్ కొత్తగా ఉన్నప్పటికీ టైర్ సైజ్ అలానే మారకుండా 195/55 R16 గా ఉంది. తక్కువ వేరియంట్లలో 15 ఇంచ్ అల్లాయ్ వీల్స్ మరియు స్టీల్ కూడా మారకుండా అలానే ఉన్నాయి మరియు 185/65 R15 టైర్లతో వస్తున్నాయి. ఈ సమయంలో, డెల్టా వేరియంట్లో కూడా 15-ఇంచ్ అల్లాయ్ వీల్స్ లభిస్తాయి, ఇవి ముందుగా జీటా వేరియంట్లో మాత్రమే పరిమితం చేయబడ్డాయి.
కారు ప్రక్కభాగం వలే సెడాన్ యొక్క వెనక వైపు కూడా పెద్దగా మారలేదు, కొంచెం చిన్న చిన్న మార్పులు చేయబడింది. టెయిల్ ల్యాంప్స్ ఇప్పుడు LED ఇన్సర్ట్ పొంది ఉంది మరియు వెనుక బంపర్ రిఫ్లెక్టర్ హౌసింగ్ చుట్టూ ఒక క్రోమ్ లేదా సిల్వర్ కలర్డ్ బెజిల్(వేరియంట్ బట్టి) పొంది ఉంటుంది.
లోపల భాగాలు:
దీని లోపల భాగాలలో ఉన్న మార్పులు అంత గమనించదగినట్టుగా ఏమీ ఉండవు. లేఅవుట్ ఒకేలా ఉండగా, డాష్ బోర్డ్ మీద డార్క్ బ్రౌన్ ఫాక్స్ వుడ్ అమర్చబడి ఉంది మరియు డోర్లు లైటర్ షేడ్ లో మార్చబడ్డాయి. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా నవీకరించబడింది, ముందు కంటే ఎక్కువ ప్రీమియంగా ఉంది మరియు స్పష్టమైనదిగా కనిపిస్తుంది. కొత్త డయల్స్ పాటు, సియాజ్ పెట్రోల్ లో ఒక కొత్త, రంగు 4.2-అంగుళాల MID (మల్టీ ఇన్‌ఫో డిస్ప్లే) స్క్రీన్ ని పొందుతుంది.
నవీకరణతో, మారుతి కూడా క్రయజ్ కంట్రోల్ ని సియాజ్ లో ప్రవేశపెట్టింది. అదే నియంత్రణలు స్టీరింగ్ వీల్ కు కుడివైపు స్పోక్ కి పెట్టబడ్డాయి.
లక్షణాలు:
ఈ ఫేస్‌లిఫ్టెడ్ సియాజ్ దాని ముందున్న దాని కంటే మెరుగైనదిగా ఉంటుంది. దీనిలో తాజాగా చేర్చబడిన లక్షణాలలో హెడ్‌ల్యాంప్స్ కి LED ప్రొజకటర్స్,LED DRLs, క్రూయిస్ నియంత్రణ మరియు అడ్జస్టబుల్ రేర్ హెడ్‌రెస్ట్లు ఉన్నాయి. మునుపటి సియాజ్ నుండి తీసుకున్న ఇతర లక్షణాలు ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ప్లే తో 7-ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ వ్యవస్థ, రివర్స్ పార్కింగ్ కెమెరా, వెనుక A.C వెంట్స్ తో ఆటో క్లైమేట్ కంట్రోల్,ఆటో డిమ్మింగ్ IRVM మరియు పుష్ బటన్ ఇంజన్ స్టార్ట్ / స్టాప్ వంటివి ఉన్నాయి.
కొత్త సియాజ్ అదనపు భద్రతా లక్షణాలు కలిగి ఉంది. డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్బాగ్స్, EBD తో ABS, మరియు ISOFIX చైల్డ్ సీటు యాంకర్స్ లతో పాటు, నవీకరించబడిన సెడాన్ రియర్ పార్కింగ్ సెన్సార్స్ ని కూడా కలిగి ఉంది. అలానే, స్పీడ్ అలర్ట్ సిస్టం (SIS) మరియు సీట్బెల్ట్ రిమైండర్ (SBR) వంటి లక్షణాలను ప్రామాణికంగా కలిగి ఉంది. 2018 సియాజ్ హిల్ హోల్డ్ తో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రాం తో వస్తుంది, కానీ ఇది పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్లకు మాత్రమే పరిమితం చేయబడింది.
ఇంజిన్:
పెట్రోల్ |
2018 సియాజ్ |
ప్రీ-ఫేస్లిఫ్ట్ సియాజ్ |
ఇంజిన్ |
1.5 లీటర్ |
1.4 లీటర్ |
పవర్ |
105PS |
93PS |
టార్క్ |
138Nm |
130Nm |
ట్రాన్స్మిషన్ |
5-స్పీడ్ MT / 4-స్పీడ్ AT |
5-స్పీడ్ MT / 4-స్పీడ్ AT |
మైలేజ్ |
21.56kmpl MT / 20.28kmpl AT |
20.73 kmpl MT / 19.12kmpl AT |
2018 సియాజ్ పాత 1.4 లీటర్ ఇంజన్ ని భర్తీ చేసి కొత్త 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ తో 12Ps పవర్ ను మరియు 8Nm టార్క్ ని ముందు దాని కంటే అధనంగా అందిస్తుంది. ఇది ముందు కంటే మరింత ఎకనామికల్ గ ఉంది, దీనికి గానూ స్మార్ట్ హైబ్రిడ్ టెక్ కి ధన్యవాదాలు. ఈ 2018 సియాజ్ పెట్రోల్ లో SHVS టెక్నాలజీని కలిగి ఉన్న మొట్టమొదటి మారుతి వాహనం.
2018 సియాజ్ పెట్రోల్ ఒక కొత్త ఇంజిన్ శక్తిని కలిగి ఉన్నప్పటికీ, ప్రసార ఎంపికలు మారలేదు. ఇది ముందు దాని వలే 5-స్పీడ్ MT తో మరియు 4-స్పీడ్ AT తో కొనసాగుతోంది.
డీజిల్ |
2018 సియాజ్ |
ప్రీ-ఫేస్లిఫ్ట్ సియాజ్ |
ఇంజిన్ |
1.3 లీటర్ |
1.3 లీటర్ |
పవర్ |
90PS |
90PS |
టార్క్ |
200Nm |
200Nm |
ట్రాన్స్మిషన్ |
5-స్పీడ్ MT |
5-స్పీడ్ MT |
మైలేజ్ |
28.09kmpl |
28.09kmpl |
సియాజ్ ఒక కొత్త పెట్రోల్ ఇంజన్ ని కలిగి ఉండగా, డీజిల్ సియాజ్ అదే ఫియట్-బారౌడ్ డీజిల్ ఇంజిన్ చేత కొనసాగుతుంది మరియు 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో వస్తుంది.
రంగులు:
ఈ నవీకరణతో మారుతి సంస్థ సియాజ్ లో మాగ్మా గ్రే మరియు ప్రీమియం సిల్వర్ కొత్త రంగు ని పరిచయం చేసింది. అయితే మాగ్మా గ్రే గ్లిస్టేనింగ్ గ్రే స్థానంలో భర్తీ చేయబడగా, ప్రీమియమ్ సిల్వర్ సిల్కీ సిల్వర్ స్థానంలో వచ్చింది. ఇంకా దీనిలో పెర్ల్ మిడ్నైట్ బ్లాక్, నెక్సా బ్లూ, పెర్ల్ సంగ్రియా రెడ్, పెర్ల్ మెటాలిక్ డిగ్నిటీ బ్రౌన్ మరియు ఇంతకు ముందు మోడల్ నుండి పెర్ల్ స్నో వైట్ వంటి ఇతర బాహ్య రంగులు అందించబడుతున్నాయి.
ధర: సియాజ్ పెట్రోల్ ధరలు గణనీయంగా పెరిగాయి, అయితే మారుతి సంస్థ డీజిల్ సియాజ్ ధరలను తగ్గించింది.
కొత్త |
పాత |
తేడా |
సిగ్మా: రూ.8.19 లక్షలు |
సిగ్మా రూ. 7.83 లక్షలు |
+36,000 |
డెల్టా: రూ. 8.8 లక్షలు |
డెల్టా రూ. 8.27 లక్షలు |
+53,000 |
జీటా రూ. 9.57 లక్షలు |
జీటా రూ. 8.92 లక్షలు |
+65,000 |
ఆల్ఫా రూ. 9.97 లక్షలు |
ఆల్ఫా రూ. 9.48 లక్షలు |
+49,000 |
డెల్టా ఆటో రూ. 9.8 లక్షలు |
డెల్టా ఆటో రూ. 9.42 లక్షలు |
+38,000 |
జీటా ఆటో రూ. 10.57 లక్షలు |
జీటా ఆటో రూ. 9.94 లక్షలు |
+63,000 |
ఆల్ఫా ఆటో రూ. 10.97 లక్షల |
ఆల్ఫా ఆటో రూ. 10.63 లక్షల |
+34,000 |
మారుతి సియాజ్ డీజిల్ |
||
కొత్త |
పాత |
తేడా |
సిగ్మా రూ 9.19 లక్షలు |
సిగ్మా రూ. 9.49 లక్షలు |
-30,000 |
డెల్టా రూ. 9.8 లక్షలు |
డెల్టా రూ. 9.94 లక్షలు |
-14,000 |
జీటా రూ. 10.57 లక్షలు |
జీటా రూ. 10.79 లక్షలు |
-22,000 |
ఆల్ఫా రూ. 10.97 లక్షలు |
ఆల్ఫా రూ. 11.51 లక్షలు |
-54,000 |