Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

విడుదలకు ముందే వెల్లడైన ఫేస్లిఫ్టెడ్ కియా సెల్టోస్ లోయర్ వేరియంట్ జూలైలో ప్రారంభం

కియా సెల్తోస్ కోసం rohit ద్వారా జూన్ 27, 2023 03:39 pm ప్రచురించబడింది

అందరూ ఎదురు చూస్తున్న పనారోమిక్ సన్రూఫ్ ఫీచర్ కు పట్టం కట్టిన కియా.

  • సరికొత్త ఫేస్లిఫ్టెడ్ సెల్టోస్ ను కియా జూలై 4న అందుబాటులోకి తీసుకురానుంది.

  • వైరల్ అవుతున్న కొత్త గూఢచారి వీడియోలో తెల్లటి సెల్టోస్ యొక్క టెక్ లైన్ వేరియంట్ను మనం చూడవచ్చు. ఇది నల్లటి రూఫ్ ను కలిగి ఉంది.

  • దీని వెలుపలి భాగానికి చేసిన మార్పులలో సరికొత్త అల్లాయ్ వీల్స్ మరియు LED టైల్ లైట్స్ ప్రాముఖ్యమైనవి.

  • కారు యొక్క క్యాబిన్ దాని కనెక్టెడ్ స్క్రీన్స్ సెటప్ని కూడా మనం వీడియోలో చూడవచ్చు.

  • డ్యుయల్ జోన్ AC మరియు ADAS ఫీచర్లు రానున్నాయి.

  • క్యారెన్స్ మాదిరిగానే ఇందులో కూడా 1.5-లీటర్ పెట్రోల్, టర్బో పెట్రోల్ మరియు డీజల్ ఇంజిన్స్ అందుబాటులోకి రానున్నాయి.

  • వీటి ధరలు సుమారు 10 లక్షల నుండి మొదలు కానున్నాయి. (ఎక్స్ షోరూం)

ఫేస్లిఫ్టెడ్ కియా సెల్టోస్ భారీప్రారంభానికి కేవలం ఒక్క వారం మిగిలి ఉన్న సమయంలో, కొత్త కాంపాక్ట్ SUV యొక్క ఫోటోలు, వీడియోలు ఆన్‌లైన్‌లో హల్చల్ చేస్తున్నాయి. ఈ వీడియోలో సరికొత్త సెల్టోస్ యొక్క టెక్ (HT) లైన్ వేరియంట్లలో ఒకదానిని మనం చూడవచ్చు.

అసలు ఆ వీడియోలో ఏముంది?

ఈ రహస్యంగా తీసిన వీడియోలో కనపడుతున్న ఫేస్లిఫ్టెడ్ కియా సెల్టోస్ ఏ విధమైన కవరింగ్ లేకుండా ఉండటాన్ని బట్టి దాన్ని డీలర్షిప్ స్టాక్యార్డ్ కి తరలిస్తున్న సమయంలో తీసిన వీడియోగా నెటిజన్స్ అభిప్రాయ పడుతున్నారు. ఈ వీడియోలో SUV యొక్క పెద్ద గ్రిల్, సరికొత్త అల్లాయ్ వీల్ డిజైన్ మరియు సంబంధిత LED టైల్ లైట్స్ మనకి కనిపిస్తాయి.

ఈ చిన్న వీడియోలో LED DRL స్ట్రిప్స్ కారు యొక్క గ్రిల్ల్ కి అనుసంధానం అయ్యి ఉండటం, అలాగే మూడు పరిణామాల LED ఫాగ్ లాంప్స్ ముందు వైపు బంపర్ కి ఇరు వైపులా ఉండటం మనం గమనించవచ్చు.

లోపలి నవీకరణలు

వీడియో ద్వారా మనకి కారు యొక్క లోపలి భాగం గురించి ఎక్కువ విషయాలు తెలియకపోయినా, కొన్ని చిన్న చిన్న విషయాలు మనం గ్రహించవచ్చు. SUV కి పూర్తిగా నల్లటి క్యాబిన్ మరియు సంబంధిత స్క్రీన్స్ సెటప్ ను పొందికగా అమర్చారు. అంతేకాకుండా ఆధునిక మార్పులతో చేయబడ్డ కాబిన్, డాష్బోర్డ్ లేఔట్ తో పాటు సరికొత్తగా డిజైన్ చేయబడ్డ సెంట్రల్ AC వెంట్స్ మరియు అత్యాధునికమైన కంట్రోల్ పానెల్ ఈ SUV లో మనం చూడవచ్చు.

టెక్నాలజీకి మరింత పెద్ద పీట:

సరికొత్త క్లైమేట్ కంట్రోల్ పానెల్ (ముందు స్పై వీడియో ఆధారంగా చూసిన మొదటి సెగ్మెంట్, డ్యుయల్ జోన్ యూనిట్) మరియు పనరోమిక్ సన్రూఫ్ మాత్రమే కాకుండా, కియా సెల్టోస్ లో డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే కూడా అందుబాటులోకి రానుంది. టచ్ స్క్రీన్ ఎంపికలలో ఎలాంటి మార్పులు ఉండవు (8 అంగుళాలు మరియు 10.25 అంగుళాలు). పాత మోడల్ నుండి వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్, ఏయర్ ప్యూరిఫైయర్ లాంటి ఫీచర్లు యధాతధంగా ఈ సరికొత్త SUV లో కూడా కనపడుతాయి.

ఈ SUV యొక్క భద్రతా కిట్లో విశేషం ఏమిటంటే ఇందులో అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ ను(ADAS) అమర్చారు. దీని ద్వారా లైన్-కీప్ అసిస్ట్ మరియు అనుకూలమైన క్రూయిజ్ నియంత్రణ లాంటి టెక్నాలజీలు అందుబాటులో ఉంటాయి. అదనంగా, ఈ SUV లో ఆరు ఏయర్ బ్యాగ్స్, ISOFIX చైల్డ్ సీట్ యాంకరేజ్ మరియు ఒక 360- డిగ్రీ కెమెరా ఉన్నాయి.

ఇది కూడా చదవండి: యామి గౌతమ్ విలాసవతమైన కార్ల జాబితాలో చేరిన BMW X7.

సుపరిచితమైన ఇంజన్:

కియా తన సరికొత్త సెల్టోస్ కు ప్రస్తుత మోడల్లో ఉన్న 115PS, 1.5- లీటర్ పెట్రోల్ మరియు 116PS డీజల్ ఇంజిన్స్ నే జతచేసింది. పెట్రోల్ ఇంజన్ మునుపటిలాగే 6-స్పీడ్ MTతో కొనసాగుతుంది. డీజల్ ఇంజన్ మాత్రం మాన్యువల్ కి బదులుగా 6-స్పీడ్ IMTని అందిపుచ్చుకుంటుంది. అలాగే 1.4-లీటర్ టర్బో పెట్రోల్ యూనిట్ కి బదులుగా ఫేస్ లిఫ్ట్డ్ సెల్టోస్ లో 1.5- లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ (160PS/253Nm), 6-స్పీడ్ iMT లేదా 7- స్పీడ్ DCT తో అనుసంధానం అయ్యి ఉంటుంది.

ప్రారంభం మరియు ధరలు:

ఫేస్లిఫ్టెడ్ కియా సెల్టోస్ విక్రయాలు జూలై 4 నుండి ప్రారంభం కానున్నాయి. వీటి ధరలు 10 లక్షల నుండి మొదలు కానున్నాయి (ఎక్స్ షోరూం). మారుతి గ్రాండ్ విటారా, హ్యుందాయ్ క్రెటా, స్కోడా కుషాక్, టయోట హైరైడర్, వోక్స్వాగన్ టైగూన్, MG ఆస్టర్ మరియు రానున్న సిట్రోయెన్ C 3 ఎయర్ క్రాస్ కి ఈ సరికొత్త కియా SUV గట్టి పోటీ ఇవ్వబోతోంది.

చిత్ర మూలం

మరింత చదవండి : సెల్టోస్ డీజల్.

Share via

Write your Comment on Kia సెల్తోస్

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

Enable notifications to stay updated with exclusive offers, car news, and more from CarDekho!

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
ఎలక్ట్రిక్కొత్త వేరియంట్
Rs.18.90 - 26.90 లక్షలు*
ఎలక్ట్రిక్కొత్త వేరియంట్
Rs.21.90 - 30.50 లక్షలు*
Rs.9 - 17.80 లక్షలు*
కొత్త వేరియంట్
Rs.44.90 - 55.90 లక్షలు*
Rs.75.80 - 77.80 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర