భారతదేశంలో జూలై 4న విడుదల కానున్న ఫేస్ లిఫ్టెడ్ కియా సెల్టోస్
ఈ నవీకరణతో, ఈ కాంపాక్ట్ SUV పనోరమిక్ సన్‌రూఫ్ మరియు ADAS వంటి అత్యుత్తమ ఫీచర్లను పొందనుంది.
-
రూ.25,000 ముందస్తు ధరను చెల్లించి ఈ కాంపాక్ట్ SUVని డీలర్‌షిప్ల వద్ద ప్రీ-బుకింగ్ చేసుకోవచ్చు.
-
1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ జోడింపుతో నిలిపివేస్తున్న మోడల్లో ఉన్నట్లుగానే పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఎంపికలను పొందవచ్చని అంచనా
-
ఈ కార్‌లో ADAS మరియు పనోరమిక్ సన్‌రూఫ్ మాత్రమే కాకుండా, ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ 10.25-అంగుళాల డిస్‌ప్లే, హీటెడ్ ముందు సీట్లు మరియు ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు వంటి ఫీచర్లను కూడా అందిస్తున్నారు.
-
కార్‌ను ప్రదర్శించిన వెంటనే మార్కెట్‌లో విడుదల చేసే అవకాశం ఉంది.
-
ఈ కార్ ధర రూ.10.5 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం కావచ్చు.
దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కాంపాక్ట్ SUVలలో ఒకటిగా ఉన్న కియా సెల్టోస్ నవీకరణ పొందాల్సి ఉంది మరియు దిని నవీకరణ కోసం కొంతకాలంగా ఎదురుచూస్తున్నాము. ప్రస్తుతం, నవీకరించబడిన కియా సెల్టోస్ త్వరలో మార్కెట్‌లోకి వస్తుందని మరియు జూలై 4న భారతదేశంలో విడుదల కానుంది అని సమాచారం.
డిజైన్ అప్‌డేట్‌లు
ఈ నవీకరణతో, సెల్టోస్ పునర్నిర్మించిన ఫ్రంట్ గ్రిల్‌తో పాటు LED హెడ్‌లైట్లు మరియు నాజూకైనా DRLల సెట్‌ను పొందనుంది. కొన్ని డోర్ క్లాడింగ్లను మినహాహించి సైడ్ ప్రొఫైల్‌లో పెద్దగా మార్పులు ఏమి ఉండకపోవచ్చు. వెనుక భాగంలో, మధ్యలో కనెక్ట్ చేసే ఎలిమెంట్లతో టెయిల్ ల్యాంప్ సెటప్లో తేలికపాటి మార్పులను ఈ అప్‌డేటేడ్ కాంపాక్ట్ SUVలో చూడవచ్చు. బూట్ మరింత దృడంగా కనిపించేలా మార్పు చేయబడిన డిజైన్‌ను పొందనుంది మరియు వెనుక బంపర్ కూడా రీడిజైన్ చేయబడింది.
అప్‌డేట్ చేసిన పవర్‌ట్రెయిన్
నిలిపివేస్తున్న మోడల్ ఇంజన్ ఎంపికలను నవీకరించబడిన సెల్టోస్ కొనసాగిస్తుందని ఆశిస్తున్నాము, ఇది 6-స్పీడ్ మాన్యువల్ మరియు CVT గేర్‌బాక్స్ ఎంపికతో 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ (115 PS / 144 NM) మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడిన 1.5-లీటర్ డీజిల్ ఇంజన్‌ను(115 PS/250 NM) కలిగి ఉంటుంది.
ఇవి కూడా చదవండి: రహస్య చిత్రాలలో కప్పబడకుండా కనిపించిన నవీకరించబడిన కియా సెల్టోస్; గమనించదగిన 5 విషయాలను చూద్దాం
ఇప్పటికే నిలిపివేసిన పాత 140 PS 1.4-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ స్థానంలో, కియా కారెన్స్ మరియు కొత్త హ్యుందాయ్ వెర్నాలో ఉన్న 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో (160 PS/253 NM) భర్తీ చేయనున్నారు.
ఫీచర్‌లు భద్రత
ఈ కార్ టెస్ట్ మోడల్ చిత్రాల ఆధారంగా, నవీకరించబడిన సెల్టోస్లో పనోరమిక్ సన్‌రూఫ్ మరియు లేన్ కీప్ అసిస్ట్, ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ మరియు అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి ADAS ఫీచర్‌లను పొందుతుందని తెలిసింది. ఈ రెండు ఫీచర్లను దిని పోటీదారులు ఇప్పటికే అందిస్తున్నారు.
ఇది కూడా చదవండి: 5 లక్షల అమ్మకాల మార్కును దాటిన కియా సెల్టోస్
ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న నవీకరించబడిన సెల్టోస్‌లో ఉన్నటు వంటి రీడిజైన్ చేయబడిన క్యాబిన్‌తో ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ 10.25-అంగుళాల డిస్‌ప్లేతో (టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ మరియు డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే) వస్తుంది మరియు ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) మరియు హిల్ అసిస్ట్ వంటి భద్రతా ఫీచర్లు అందుబాటులో ఉంటాయి.
అంచనా ధర మరియు పోటీదారులు
కియా ఈ వాహన విడుదల సమయంలో ధరలను ప్రకటించవచ్చు, దీని ప్రారంభ ధర రూ.10.5 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంటుందని అంచనా. హ్యుందాయ్ క్రెటా, వోక్స్వాగన్ టైగూన్, స్కోడా కుషాక్, మారుతి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్ మరియు MG ఆస్టర్ వంటి వాటితో నవీకరించబడిన సెల్టోస్ పోటీని కొనసాగించవచ్చు.
మరింతగా చదవండి: సెల్టోస్ డీజిల్