• English
  • Login / Register

రహస్యంగా దొరికిన వివరాలు - కొత్త కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ విశేషాలు చూద్దాం

కియా సెల్తోస్ కోసం tarun ద్వారా జూన్ 20, 2023 04:05 pm ప్రచురించబడింది

  • 33 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

నవీకరించబడిన కాంపాక్ట్ SUV వెర్షన్ జూలైలో విక్రయించబడుతుంది

ఫేస్‌లిఫ్టెడ్ కియా సెల్టోస్ యొక్క కొత్త లుక్స్ మొదటిసారిగా వెల్లడయ్యాయి. కాంపాక్ట్ SUV 2019 లో అరంగేట్రం తర్వాత సెల్టోస్ మొదటి సారిగా పెద్ద అప్‌గ్రేడ్ ని పొందింది. జూలైలో విక్రయించబడుతుందని భావిస్తున్నారు. ఫేస్‌లిఫ్టెడ్ వెర్షన్‌లో  గుర్తించిన ఐదు కీలక లక్షణాలు ఏమిటో చూద్దాం:

కొత్త ఫ్రంట్ ప్రొఫైల్

Kia Seltos 2023

కొత్త సెల్టోస్  ఫ్రంట్ ప్రొఫైల్‌ లో పెద్ద గ్రిల్‌ ఉంటుంది. కొత్త LED హెడ్‌లైట్లు మరియు సొగసైన DRLలను కలిగి ఉంది, ఇవి దీని గ్రిల్‌లో విలీనం చేయబడింది. బంపర్ మరింత దిట్టంగా శక్తివంతంగా రీడిజైన్ చేయబడింది. పేర్చబడిన-ఐస్ క్యూబ్ ఫాగ్ ల్యాంప్స్ అలాగే ఉంచబడినప్పటికీ, బంపర్‌తో రీడిజైన్ చేయబడింది.

సైడ్ ప్రొఫైల్‌లో మార్పులు లేవు

Kia Seltos 2023

ట్వీక్ చేసిన డోర్ క్లాడింగ్ తప్ప సైడ్ ప్రొఫైల్‌లో ఎలాంటి మార్పులు లేవు. అల్లాయ్ వీల్స్, ఆశ్చర్యకరంగా, X-లైన్ వేరియంట్‌లలో కనిపించే విధంగానే ఉన్నాయి. క్రోమ్ డోర్ హ్యాండిల్స్ తో ఇది అగ్ర శ్రేణి వేరియంట్ గా కనిపిస్తుంది.

మరింత స్టైలిష్ రేర్ ప్రొఫైల్

Kia Seltos 2023

రేర్ ప్రొఫైల్‌లో ముఖ్యమైన మార్పులు ఉన్నాయి. బూట్ ఆకారం మరింత దూకుడుగా మార్చారు.  బాగా ప్రకాశించే కొత్త LED టెయిల్ స్ట్రిప్‌తో జతచేయబడిన ల్యాంప్‌లు దానికి జోడించబడ్డాయి. బంపర్‌లు కూడా రీడిజైన్ చేయబడ్డాయి, ఇవి ఇప్పుడు రివర్స్ లైట్లను కూడా కలిగి ఉన్నాయి. డ్యూయల్ ఫాక్స్ ఎగ్జాస్ట్‌లు ఇప్పుడు విక్రయంలో ఉన్న వెర్షన్‌లో కంటే ఎక్కువగా ఉన్నాయి. మొత్తానికి, ఇది స్పోర్టియర్ లుక్ ఇస్తుంది.

ఇది కూడా చదవండి: రక్షణ సిబ్బంది ఇప్పుడు మిలిటరీ, నేవీ మరియు ఎయిర్‌ఫోర్స్ క్యాంటీన్ల ద్వారా కియా కార్లను కొనుగోలు చేయవచ్చు

ADAS!

ఇది రాడార్ ఆధారిత ADAS సాంకేతికతను పొందుతోందని  తాజాగా తీసిన స్పై షాట్ లో నిర్ధారించబడింది. ముందు బంపర్‌ పై దీర్ఘచతురస్రాకార ఆకారపు రాడార్‌ కలిగిన వాహనం ఇది. అలాగే MG ఆస్టర్ తర్వాత భద్రతా ఫీచర్‌ను పొందిన రెండవ కాంపాక్ట్ SUV కూడా. దీని ADAS సూట్ బ్లైండ్-స్పాట్ మానిటరింగ్, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ మరియు లేన్-కీప్ అసిస్ట్‌ని పొందగలదని భావిస్తున్నాము.

రిఫ్రెష్ చేసిన ఇంటీరియర్

Kia Seltos Gets A Facelift On Its Home Ground With A New Tiger Nose Grille

ఈ స్పై షాట్‌లలో ఇంటీరియర్ యొక్క సగం లుక్స్ మాత్రమే చూడగలుగుతాము. అంతర్జాతీయ మోడల్ లో కనిపించే లేఅవుట్‌తో దీని ఇంటీరియర్ డిజైన్ పునర్నిర్మించబడింది. గ్లోబల్-స్పెక్ మోడల్ కొత్త స్విచ్‌లు డ్యూయల్-ఇంటిగ్రేటెడ్ 10.25-అంగుళాల డిస్‌ప్లేలతో (డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే మరియు టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్) కొత్త డ్యూయల్-లేయర్, ఆల్-బ్లాక్ థీమ్‌ను కలిగి ఉంటుంది.

ఇంజిన్ పరంగా, ఇది అదే 1.5-లీటర్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్ ని కలిగి ఉంటుంది. కొత్త 160PS 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ ఇప్పుడు నిలిపివేయబడిన 1.4-లీటర్ టర్బో మోటార్‌ను భర్తీ చేయనుంది. అన్ని ఇంజన్లు మునుపటిలాగా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఎంపికను పొందుతాయి.

ఇది కూడా చదవండి: ఫేస్‌లిఫ్టెడ్ కియా సోనెట్ రహస్యంగా అరంగేట్రం చేస్తుంది; 2024లో ఇండియా లాంచ్

అన్ని ఇంజన్లు ఆటోమేటిక్ ఎంపికను పొందుతాయి కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ ధర సుమారు రూ. 10.5 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ఉంటుందని మేము ఆశిస్తున్నాము. ఇది MG ఆస్టర్, హ్యుందాయ్ క్రెటా, వోక్స్వాగన్ టైగూన్, స్కోడా కుషాక్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, సిట్రోయెన్ C3 ఎయిర్‌క్రాస్ మరియు టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ వంటి వాటి పోటీని కొనసాగిస్తుంది.

చిత్ర మూలం

మరింత చదవండి: సెల్టోస్ డీజిల్

was this article helpful ?

Write your Comment on Kia సెల్తోస్

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience