విడుదలకు ముందే డీలర్ؚషిప్ؚలను చేరుకున్న కియా సెల్టోస్ ఫేస్ؚలిఫ్ట్
డీలర్‌షిప్ వద్ద చేరుకున్న కియా సెల్టోస్ ఫేస్ؚలిఫ్ట్ కొత్త ‘ప్యూటర్ ఆలివ్’ పెయింట్ ఎంపికలో వస్తున్న GT లైన్ వేరియంట్.
-
సెల్టోస్ ఫేస్ؚలిఫ్ట్ బుకింగ్ؚలు జూలై 14న ప్రారంభం అయ్యాయి.
-
కియా ఈ SUVని మూడు విస్తృత వేరియెంట్ లైన్ؚలలో అందిస్తుంది: టెక్ (HT) లైన్, GT లైన్ మరియు X-లైన్.
-
ఫోటోలో కనిపిస్తున్న SUVలో LED లైటింగ్, 18-అంగుళాల డ్యూయల్-టోన్ అలాయ్ వీల్స్ మరియు ‘GT లైన్’ బ్యాడ్జ్ ఉన్నాయి.
-
దీని ఇంటీరియర్ؚలో కొత్త ఇంటిగ్రేటెడ్ డిస్ప్లేؚలు, డ్యూయల్-జోన్ AC మరియు ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ ఉన్నాయి.
-
GYX+లో అందిస్తున్న అదనపు ఫీచర్‌లలో పనోరమిక్ సన్ؚరూఫ్ మరియు ADAS కూడా ఉన్నాయి.
-
కొత్త సెల్టోస్ మూడు 1.5-లీటర్ ఇంజన్‌లతో వస్తుంది, ప్రతి ఇంజన్ సొంత ఆటోమ్యాటిక్ ట్రాన్స్ؚమిషన్ؚను కలిగి ఉంటుంది.
-
ఇది త్వరలోనే విడుదల కావచ్చు; ధరలు రూ.11 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం అవుతాయి.
కియా సెల్టోస్ ఫేస్ؚలిఫ్ట్ ఇటీవల భారతదేశంలో విడుదల అయ్యింది, దాదాపు 4 సంవత్సరాల తరువాత, ఈ కాంపాక్ట్ SUV మొదటిసారి గణనీయమైన అప్ؚడేట్ؚను పొందింది. కియా దీన్ని మూడు విస్తృత వేరియెంట్ లైన్ؚలలో అందిస్తుంది: టెక్ (HT) లైన్, GT లైన్, మరియు X-లైన్. సరికొత్త సెల్టోస్ బుకింగ్ؚలు జూలై 14 నుంచి ప్రారంభం అవుతాయి. విడుదలకు ముందే ఈ వాహనాన్ని పరిశీలించగలిగేలా, డీలర్ؚషిప్‌ల వద్ద అందుబాటులో ఉన్నట్లు తెలిపే కొన్ని చిత్రాలు సరైన సమయానికి మాకు లభించాయి.
చిత్రంలో ఉన్న మోడల్ వివరాలు
మా వద్ద ఉన్న ప్రత్యేక చిత్రాలలో, ఈ SUV కొత్త ‘ప్యూటర్ ఆలివ్’ పెయింట్ ఎంపికలో ఉండటాన్ని చూడవచ్చు. టెయిల్ؚగేట్ పైన ఉన్న ‘GT లైన్’ బ్యాడ్జ్ ఇది హయ్యర్-స్పెక్ GTX+ వేరియెంట్ అని సూచిస్తోంది. 4-పీస్ LED ఫాగ్ ల్యాంపులు, హనీకోంబ్ డిజైన్ؚతో గ్రిల్, DRLలతో LED హెడ్‌లైట్లు, డైనమిక్ టర్న్ ఇండికేటర్‌లు, 18-అంగుళాల డ్యూయల్-టోన్ అలాయ్ వీల్స్ మరియు కనెక్టెడ్ LED టెయిల్ లైట్లను కలిగి ఉంది.
ఇంటీరియర్ అంశాలు
ఇంటీరియర్ చిత్రాలలో రెండు 10.25-అంగుళాల డిస్ప్లేలు (ఇన్స్ట్రుమెంటేషన్, ఇన్ఫోటైన్మెంట్ కోసం), డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు మరియు ఆటో-హోల్డ్ ఫంక్షన్ؚతో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ؚలు వంటి GTX+ సంబంధిత ఫీచర్‌లను గమనించవచ్చు. GTX+లో ఉన్న ఇతర ఫీచర్‌లలో పనోరమిక్ సన్ؚరూఫ్, వైర్ؚలెస్ ఫోన్ ఛార్జింగ్, 8-వే పవర్డ్ డ్రైవర్ సీట్, రెయిన్-సెన్సింగ్ వైపర్‌లు మరియు 8-స్పీకర్‌ల బోస్ సౌండ్ సిస్టమ్ ఉన్నాయి.
సంబంధించినది: సెల్టోస్ ఫేస్ؚలిఫ్ట్ వేరియెంట్-వారీ ఫీచర్‌లను వెల్లడించిన కియా
అందిస్తున్న మరింత భద్రత సాంకేతికత
నవీకరించిన సెల్టోస్ؚలో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, హై-బీమ్ అసిస్ట్ మరియు డ్రైవర్ అటెంటివ్ؚనెస్ అలర్ట్ వంటి అడ్వాన్సెడ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS) ఫీచర్‌లను కియా అందిస్తోంది. ఆరు ఎయిర్ బ్యాగ్ؚలు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), ISOFIX చైల్డ్ సీట్ యాంకరేజ్ؚలు, 360-డిగ్రీ కెమెరా, ముందు మరియు వెనుక పార్కింగ్ సెన్సార్ؚలు వంటి భద్రత ఫీచర్‌లను ఈ SUV కొనసాగిస్తోంది.
పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ؚల ఎంపిక
2023 సెల్టోస్ పెట్రోల్ మరియు డీజిల్ పవర్‌ట్రెయిన్ؚల ఎంపికను నిలుపుకుంది. హ్యుందాయ్ క్రెటా కాకుండా, డీజిల్ ఎంపికను అందిస్తున్న ఏకైక కాంపాక్ట్ SUVగా ఇది నిలుస్తుంది. దీని ఇంజన్-గేర్‌బాక్స్ కాంబోలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
స్పెసిఫికేషన్ |
1.5-లీటర్ పెట్రోల్ |
1.5-లీటర్ టర్బో-పెట్రోల్ |
1.5-లీటర్ డీజిల్ |
పవర్ |
115PS |
160PS |
116PS |
టార్క్ |
144Nm |
253Nm |
250Nm |
ట్రాన్స్ؚమిషన్ |
6-స్పీడ్ల MT, CVT |
6-స్పీడ్ల iMT, 7-స్పీడ్ల DCT |
6-స్పీడ్ల iMT, 6-స్పీడ్ల AT |
ఇది కూడా చూడండి: ఈ 15 చిత్రాలలో నవీకరించిన కియా సెల్టోస్ؚను వివరంగా చూడండి
విడుదల అప్ؚడేట్ మరియు పోటీ
నవీకరించిన సెల్టోస్ؚను కియా అతి త్వరలోనే విడుదల చేస్తుందని ఆశిస్తున్నాము, దీని ప్రారంభ ధర సుమారు రూ.11 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండవచ్చు. హ్యుందాయ్ క్రెటాతోనే కాకుండా, ఈ నవీకరించిన SUV టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్, మారుతి గ్రాండ్ విటారా, MG ఆస్టర్, స్కోడా కుషాక్, వోక్స్వ్యాగన్ టైగూన్, మరియు రాబోయే సిట్రోయెన్ C3 ఎయిర్ؚక్రాస్ మరియు హోండా ఎలివేట్ؚలతో కూడా పోటీ పడుతుంది.
ఇక్కడ మరింత చదవండి: కియా సెల్టోస్ డీజిల్