Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

నవీకరించబడిన కియా సెల్టోస్ GT లైన్ మరియు టెక్ లైన్ మధ్య గల వృత్యాసాలు

కియా సెల్తోస్ కోసం ansh ద్వారా జూలై 18, 2023 09:41 pm ప్రచురించబడింది

టెక్ లైన్ మరియు GT లైన్ రూపాల్లో ఎప్పుడూ లభించే సెల్టోస్ ఇప్పుడు మరింత నవీకరించబడిన విలక్షణమైన రూపంలో లభిస్తుంది.

  • నవీకరించబడిన సరికొత్త సెల్టోస్ ను ఆవిష్కరించిన కియా. ధరలు అతి త్వరలో ప్రకటించబడును

  • నవీకరించబడిన సరికొత్త సెల్టోస్ ఇప్పుడు మూడు సొగసైన రూపాల్లో లభిస్తుంది .. టెక్ లైన్ , GT లైన్ మరియు X లైన్

  • సెల్టోస్ ఎస్ యూవి యొక్క అత్యంత ఆదరణ కలిగిన GT లైన్ రకం ఇప్పుడు ప్రత్యేకమైన బంపర్లు మరియు జంట ఎగ్జాస్టర్ల తో లభిస్తుంది

  • GT లైన్ ఆధారిత X-లైన్ రకం యొక్క సొగసు మరింత పెంచేలా మార్పులు చేయడం జరిగింది

  • X-లైన్ రకం యొక్క ప్రారంభ ధర రూ.11 లక్షలు (ఎక్స్ షోరూం ) గా ఉండవచ్చు

అతి త్వరలో అందుబాటులో ఉండు నవీకరించబడిన 2023 సెల్టోస్ టెక్ లైన్ మరియు GT లైన్ రకాలలో కియా సంస్థ అందుబాటులోనికి తేబోతుంది మరియు సదరు కారు యొక్క బుకింగ్ లు మొదలైనవి. సదరు కారు యొక్క తయారీదారు కారునకు సంబంధించిన ధరలు తప్ప అన్ని విషయములు బహిర్గతం చేయడం జరిగింది. నవీకరించబడిన రూపంతో ఈ రెండు రకముల యొక్క బాహ్య రూపం ఎంతో విభిన్నమైన ముద్ర వేస్తుంది. రెండు రకముల మధ్య గల ప్రధాన తేడాలను చూసే ప్రయత్నం చేద్దాం.

బాహ్య రూపము

ముందు భాగము

ముందు భాగము యొక్క రెండు వేరియంట్ లు విభిన్నమైన ఫ్రంట్ గ్రిల్స్ మరియు బంపర్‌లను కలిగి ఉంటాయి. హెడ్‌లైట్స్ , DRLలు మరియు ఫాగ్ లైట్స్ ఒకేలా ఉంటాయి. రెండు ఫాగ్ లైట్స్ లు నిలువుగా పేర్చబడి ఉంటాయి కానీ అవి తక్కువ స్తలములో ఉండటం వలన GT లైన్‌లో అదనపు క్లాడింగ్‌ను పొందుతాయి. అదనపు హంగుల కోసం, GT లైన్ యొక్క బంపర్ మరింత ఉన్నతమైన ఎయిర్ డ్యామ్‌ను కలిగి ఉంది, అయితే ముందు భాగము యొక్క స్కిడ్ ప్లేట్ టెక్ లైన్‌లో ఉన్నట్లుగా పైకి కనిపించదు.

ప్రక్క భాగము

నవీకరించబడిన 2023 సెల్టోస్ నందు అల్లోయ్ వీల్స్ కాకుండా ప్రక్క భాగముల యందు చెప్పుకోదగ్గ మార్పులు చేయలేదు. రెండు వేరియంట్ లలో నవీకరించబడిన కియా సెల్టోస్ GT లైన్ మరియు టెక్ లైన్ విభిన్నమైన అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంటాయి మరియు ఆ వీల్స్ GT లైన్ కోసం 17-అంగుళాల బదులుగా 18-అంగుళాలు ప్రామాణికంగా కలిగి ఉంటాయి.

వెనుక భాగము :

నవీకరించబడిన 2023 సెల్టోస్ యొక్క వెనుక భాగము అరుదైన రూపము పోలి ఉంటుంది. నవీకరించబడిన కియా సెల్టోస్ GT లైన్ మరియు టెక్ లైన్ రెండింటికి ఒకే విధముగా కలుపబడిన LED టెయిల్ లైట్ అమరిక మరియు అదే రేర్ స్పాయిలర్‌ను కలిగి ఉంటాయి. కానీ బంపర్‌ దగ్గరకి వచ్చేసరికి దాని యొక్క రూపము పూర్తిగా మార్పు చేయడం జరిగింది. టెక్ లైన్ బంపర్ చంకీ క్లాడింగ్‌తో సరళంగా కనిపించే వేరియంట్ను పొందగా, GT లైన్ దాని యొక్క రెండు విధములైన -ఎగ్జాస్ట్ లతో స్పోర్టి విధానాన్ని కలిగి యుండి మరియు అత్యంత ఆదరణ కలిగిన డిజైన్ వివరాలతో తక్కువ ఎత్తుతో కూడిన స్కిడ్ ప్లేట్‌ను కలిగి ఉంది

లోపలి భాగము

క్యాబిన్

నవీకరించబడిన 2023 కియా సెల్టోస్ టెక్ లైన్ వేరియంట్‌ యొక్క లోపలి భాగము నలుపు మరియు గోధుమ రంగుల సమ్మేళనముతో డ్యాష్‌బోర్డ్‌ను రూపొందించడం జరిగింది, అయితే GT లైన్ లోపలి భాగము పూర్తిగా నలుపు రంగు కలియుండగా రెండింటి మధ్య క్యాబిన్ రూపము నందు కానీ లేఅవుట్‌లో కానీ ఎలాంటి మార్పులుచేయబడలేదు నవీకరించబడిన కియా సెల్టోస్ GT లైన్ మరియు టెక్ లైన్లు ఒకే విధమైన స్టీరింగ్ వీల్‌ను కూడా కలిగియుండి క్రింది భాగములో వేరు వేరు గుర్తులను కలిగి యున్నవి.

సీట్లు

టెక్ లైన్‌తో, మీరు పిల్లార్లు మరియు పైకప్పు క్రీమ్ కలర్ తో మరింత అద్భుతమైన అనుభూతిని అందించడానికి అన్ని సీట్లపై బ్రౌన్ కలర్ అపోలిస్ట్రీతో అమర్చబడినది మరియు GT లైన్ క్యాబిన్ మరింత సొగసుగా కనిపించే విధముగా తెలుపు రంగు మేళవింపుతో పిల్లర్లు మరియు పైకప్పు పూర్తి నలుపు రంగు సీట్ కవర్లతో తయారుచేయబడి కంటికి ఎంతో ఇంపుగా ఉన్నవి .

లక్షణాలు

కియా సెల్టోస్ GT లైన్ మరియు టెక్ లైన్ నందు ట్రిమ్-లైన్లు బాగా అమర్చబడి ఉన్నాయి. GT లైన్ ఒక వేరియంట్ను మాత్రమే పొంది ఉన్నది .- GTX ప్లస్, ఇది రెండు విధములైన -ఇంటిగ్రేటెడ్ 10.25-అంగుళాల డిస్‌ప్లేలు (టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ మరియు డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే), డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ వంటి ఫీచర్‌లతో టాప్-స్పెక్ టెక్ లైన్ HTX ప్లస్‌తో సమానంగా ఉంటుంది. సన్‌రూఫ్, క్రూయిజ్ కంట్రోల్, యాంబియంట్ లైటింగ్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), ఆల్-వీల్ డిస్క్ బ్రేక్‌లు మరియు రియర్‌వ్యూ కెమెరాతో ఆధునీకరించబడింది.

ఇది కూడా చదవండి: కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ యొక్క వేరియంట్ వారీగా దాని యొక్క ప్రత్యేకతలు తెలుపబడ్డాయి.

అయినప్పటికీ, GT లైన్ కప్ హోల్డర్ టాంబోర్ కవర్, రెయిన్-సెన్సింగ్ వైపర్‌లు, ఆటో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, 360-డిగ్రీ కెమెరా మరియు అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, హై బీమ్ అసిస్ట్ మరియు అటెన్టివ్‌నెస్ అలర్ట్ వంటి ADAS ఫీచర్లు వంటి కొన్ని ప్రత్యేకమైన అదనపు ఫీచర్లను కూడా కలిగియుంది.

పవర్ ట్రైన్స్

స్పెసిఫికేషన్లు

టెక్ లైన్

GT లైన్

ఇంజిన్

1.5-లీటర్ పెట్రోల్

1.5-లీటర్ టర్బో పెట్రోల్

1.5-లీటర్ డీజిల్

1.5-లీటర్ టర్బో పెట్రోల్

1.5-లీటర్ డీజిల్

ట్రాన్స్ మిషన్

6MT/ CVT

6iMT/ 7DCT

6iMT/ 6AT

7DCT

6AT

పవర్

115PS

160PS

116PS

160PS

116PS

టార్క్

114Nm

253Nm

250Nm

253Nm

250Nm

GT లైన్, టెక్ లైన్ లతో రుపొందించబడిన 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను కలిగి యుండదు మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపికలతో టర్బో-పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్‌లను మాత్రమే పొందుతుంది. అదేవిధంగా, టెక్ లైన్ వేరియంట్‌లు GT లైన్‌తో రుపొందించబడినవి మినహా ప్రతి పవర్‌ట్రెయిన్ కాంబోను పొందుతాయి.

ఇది కూడా చదవండి: కియా ఇండియా ప్లాంట్ నుండి విడుదలవుతున్న 1 మిలియనవ కారుగా నిలుస్తున్న కియా సెల్టోస్ ఫేస్ؚలిఫ్ట్.

ఫేస్‌లిఫ్టెడ్ సెల్టోస్ ధరలు ఇంకా ప్రకటించబడలేదు కానీ దీని ధర రూ. 11 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ఉండవచ్చునని భావిస్తున్నాము. ప్రారంభం తర్వాత, ఇది హ్యుందాయ్ క్రెటా,మారుతి గ్రాండ్ విటారా,టయోటా హైరైడర్,వోక్స్వాగన్ టైగూన్, స్కోడా కుషాక్, MG ఆస్టర్ మరియు రాబోయే ఇతర కాంపాక్ట్ SUVలు వంటి హోండా ఎలివేట్ మరియు సిట్రోయెన్ C3 ఎయిర్ క్రాస్ వాటితో పోటీని కొనసాగిస్తుంది.

మరింత చదవండి:సెల్టోస్ డీజిల్

a
ద్వారా ప్రచురించబడినది

ansh

  • 2996 సమీక్షలు
  • 0 Comments

Write your Comment పైన కియా సెల్తోస్

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
Rs.7.51 - 13.04 లక్షలు*
Rs.43.81 - 54.65 లక్షలు*
Rs.9.98 - 17.90 లక్షలు*
Rs.13.99 - 21.95 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర