Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

కియా ఇండియా ప్లాంట్ నుండి విడుదలవుతున్న 1 మిలియనవ కారుగా నిలుస్తున్న కియా సెల్టోస్ ఫేస్ؚలిఫ్ట్

కియా సెల్తోస్ కోసం rohit ద్వారా జూలై 17, 2023 01:53 pm ప్రచురించబడింది

భారతదేశంలో తయారైన, కియా ప్లాంట్ నుండి విడుదల అవుతున్న 1 మిలియనవ కారు కొత్త ‘ప్యూటర్ ఆలివ్’ రంగులో GT లైన్ వేరియంట్ అయిన కియా సెల్టోస్ ఫేస్ؚలిఫ్ట్

  • మొత్తం ఉత్పత్తి 10 లక్షల యూనిట్‌లు, ఇందులో సెల్టోస్ వాటా 50 శాతం కంటే ఎక్కువ.

  • ఇప్పటి వరకు అనంతపురం ప్లాంట్ నుండి కియా 5.3 లక్షల యూనిట్‌ల సెల్టోస్ؚలను ఉత్పత్తి చేసింది.

  • 3.3 లక్షల యూనిట్‌ల సోనెట్ మరియు 1.2 లక్షల యూనిట్‌ల క్యారెన్స్ؚలను కూడా కియా ఇండియా ఉత్పత్తి చేసింది.

  • సెల్టోస్ ఫేస్ؚలిఫ్ట్ బుకింగ్ؚలు ప్రస్తుతం రూ. 25,000కు ప్రారంభమయ్యాయి.

  • ఇది త్వరలోనే విడుదల అవుతుందని అంచనా, ధరలు రూ.11 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం కావచ్చు.

కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ త్వరలోనే మార్కెట్ؚలోకి ప్రవేశించవచ్చు మరియు దీని బుకింగ్ؚలు ఇప్పుడు ప్రారంభం అయ్యాయి. ధరను ప్రకటించడానికి ముందుగా, 2023 సెల్టోస్ భారతదేశంలోని కియా ప్లాంట్ నుండి విడుదలైన 1 మిల్లియనవ కారుగా నిలిచింది. ఇది GT లైన్ వేరియెంట్ మరియు పూర్తి నలుపు ఇంటీరియర్ؚతో కొత్త ‘ప్యూటర్ ఆలివ్’ రంగులో వస్తుంది.

ఉత్పత్తిలో సెల్టోస్ వాటా

2019 మధ్యలో మార్కెట్‌లోకి ప్రవేశించినప్పటి నుండి, ఇప్పటి వరకు సెల్టోస్ మొత్తం 5 లక్షల యూనిట్‌ల అమ్మకాలను నమోదు చేసింది. కియా ఇండియా ఉత్పత్తి మైలురాయిలో ఇది 50 శాతం కంటే ఎక్కువ. ఈ కొరియన్ తయారీదారు 5.3 లక్షల కంటే ఎక్కువ యూనిట్‌ల సెల్టోస్ؚను భారతదేశంలో ఉత్పత్తి చేసింది, ఇందులో ప్రీ-ఫేస్ؚలిఫ్ట్ మరియు ఫేస్ؚలిఫ్టెడ్ SUVలు ఉన్నాయి.

సంబంధించినవి: విడుదలకు ముందు డీలర్ؚషిప్ؚలను చేరుకున్న కియా సెల్టోస్ ఫేస్ؚలిఫ్ట్

కియా ఇండియా ఉత్పత్తి సారాంశం

కియా అనంతపురం ప్లాంట్‌లో ఉత్పత్తి అయిన 10 లక్షల కంటే ఎక్కువ కార్‌లలో 7.4 లక్షల మోడల్‌లు దేశీయంగా అమ్ముడయ్యాయి మరియు దాదాపు 2.5 లక్షలు ఈ కారు తయారీదారు ఎగుమతుల వాటాగా ఉన్నాయి. ఈ మైలురాయిని చేరుకోవడంలో సెల్టోస్ వాటా సగం కంటే ఎక్కువ అయినప్పటికీ, కియా ఇండియా లైన్అప్‌లో ఉన్న ఇతర మోడల్‌లు కూడా చాలా ప్రజాదరణను పొందాయి. కియా 3.3 లక్షల యూనిట్‌ల కంటే ఎక్కువ సోనెట్ సబ్ؚకాంపాక్ట్ SUVలను, 1.2 లక్షల యూనిట్‌ల క్యారెన్స్ MPV మరియు 14,500 కంటే కొంత ఎక్కువ కార్నివాల్ MPV యూనిట్‌లను ఉత్పత్తి చేసింది.

సెల్టోస్ ఫేస్ؚలిఫ్ట్ వివరాలు

కియా సెల్టోస్ గ్లోబల్ మోడల్ؚకాగా, భారతదేశానికి ప్రత్యేకమైన ఫేస్ؚలిఫ్ట్ؚను కియా అందిస్తుంది, దీని వివరాలు అన్నీ ఇప్పటికీ వెల్లడించబడ్డాయి. ఇది మూడు విస్తృత వేరియెంట్ లైన్ؚలలో విక్రయించబడుతుంది: టెక్ (HT) లైన్, GT లైన్ మరియు X-లైన్. ఈ కాంపాక్ట్ SUV, నిలిపివేయబడుతున్న సెల్టోస్ؚలో ఉన్న ఎక్విప్మెంట్ జాబితాలో ఉన్న ఫీచర్‌ల కంటే అదనపు ముఖ్యమైన ఫీచర్‌లతో అందించబడుతుంది.

సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ ధరలను కియా రూ.11 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) నిర్ణయిస్తుందని ఆశిస్తున్నాము. ఇది హ్యుందాయ్ క్రెటా, వోక్స్వ్యాగన్ టైగూన్, MG ఆస్టర్ మరియు మారుతి గ్రాండ్ విటారాలతో పోటీని కొనసాగిస్తుంది.

ఇది కూడా చదవండి: కియా సెల్టోస్ ఫేస్ؚలిఫ్ట్ వేరియెంట్-వారీ ఫీచర్ల వెల్లడి

ఇక్కడ మరింత చదవండి: కియా సెల్టోస్ డీజిల్

Share via

Write your Comment on Kia సెల్తోస్

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

Enable notifications to stay updated with exclusive offers, car news, and more from CarDekho!

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
కొత్త వేరియంట్
Rs.15.50 - 27.25 లక్షలు*
కొత్త వేరియంట్
Rs.15 - 26.50 లక్షలు*
కొత్త వేరియంట్
కొత్త వేరియంట్
Rs.6.20 - 10.51 లక్షలు*
ఎలక్ట్రిక్
Rs.48.90 - 54.90 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర