• English
    • Login / Register

    విడుదలకు ముందే డీలర్ؚషిప్ؚలను చేరుకున్న కియా సెల్టోస్ ఫేస్ؚలిఫ్ట్

    కియా సెల్తోస్ కోసం rohit ద్వారా జూలై 14, 2023 03:43 pm ప్రచురించబడింది

    • 2.5K Views
    • ఒక వ్యాఖ్యను వ్రాయండి

    డీలర్‌షిప్ వద్ద చేరుకున్న కియా సెల్టోస్ ఫేస్ؚలిఫ్ట్ కొత్త ‘ప్యూటర్ ఆలివ్’ పెయింట్ ఎంపికలో వస్తున్న GT లైన్ వేరియంట్.

    Kia Seltos facelift

    • సెల్టోస్ ఫేస్ؚలిఫ్ట్ బుకింగ్ؚలు జూలై 14న ప్రారంభం అయ్యాయి.

    • కియా ఈ SUVని మూడు విస్తృత వేరియెంట్ లైన్ؚలలో అందిస్తుంది: టెక్ (HT) లైన్, GT లైన్ మరియు X-లైన్.

    • ఫోటోలో కనిపిస్తున్న SUVలో LED లైటింగ్, 18-అంగుళాల డ్యూయల్-టోన్ అలాయ్ వీల్స్ మరియు ‘GT లైన్’ బ్యాడ్జ్ ఉన్నాయి.

    • దీని ఇంటీరియర్ؚలో కొత్త ఇంటిగ్రేటెడ్ డిస్ప్లేؚలు, డ్యూయల్-జోన్ AC మరియు ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ ఉన్నాయి.

    • GYX+లో అందిస్తున్న అదనపు ఫీచర్‌లలో పనోరమిక్ సన్ؚరూఫ్ మరియు ADAS కూడా ఉన్నాయి.

    • కొత్త సెల్టోస్ మూడు 1.5-లీటర్ ఇంజన్‌లతో వస్తుంది, ప్రతి ఇంజన్ సొంత ఆటోమ్యాటిక్ ట్రాన్స్ؚమిషన్ؚను కలిగి ఉంటుంది.

    • ఇది త్వరలోనే విడుదల కావచ్చు; ధరలు రూ.11 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం అవుతాయి.

    కియా సెల్టోస్ ఫేస్ؚలిఫ్ట్ ఇటీవల భారతదేశంలో విడుదల అయ్యింది, దాదాపు 4 సంవత్సరాల తరువాత, ఈ కాంపాక్ట్ SUV మొదటిసారి గణనీయమైన అప్ؚడేట్ؚను పొందింది. కియా దీన్ని మూడు విస్తృత వేరియెంట్ లైన్ؚలలో అందిస్తుంది: టెక్ (HT) లైన్, GT లైన్, మరియు X-లైన్. సరికొత్త సెల్టోస్ బుకింగ్ؚలు జూలై 14 నుంచి ప్రారంభం అవుతాయి. విడుదలకు ముందే ఈ వాహనాన్ని పరిశీలించగలిగేలా, డీలర్ؚషిప్‌ల వద్ద అందుబాటులో ఉన్నట్లు తెలిపే కొన్ని చిత్రాలు సరైన సమయానికి మాకు లభించాయి.

    చిత్రంలో ఉన్న మోడల్ వివరాలు 

    Kia Seltos facelift dynamic turn indicators
    Kia Seltos facelift 18-inch dual-tone alloy wheels

    మా వద్ద ఉన్న ప్రత్యేక చిత్రాలలో, ఈ SUV కొత్త ‘ప్యూటర్ ఆలివ్’ పెయింట్ ఎంపికలో ఉండటాన్ని చూడవచ్చు. టెయిల్ؚగేట్ పైన ఉన్న ‘GT లైన్’ బ్యాడ్జ్ ఇది హయ్యర్-స్పెక్ GTX+ వేరియెంట్ అని సూచిస్తోంది. 4-పీస్ LED ఫాగ్ ల్యాంపులు, హనీకోంబ్ డిజైన్ؚతో గ్రిల్, DRLలతో LED హెడ్‌లైట్లు, డైనమిక్ టర్న్ ఇండికేటర్‌లు, 18-అంగుళాల డ్యూయల్-టోన్ అలాయ్ వీల్స్ మరియు కనెక్టెడ్ LED టెయిల్ లైట్లను కలిగి ఉంది. 

    ఇంటీరియర్ అంశాలు 

    Kia Seltos facelift cabin

    ఇంటీరియర్ చిత్రాలలో రెండు 10.25-అంగుళాల డిస్ప్లేలు (ఇన్స్ట్రుమెంటేషన్, ఇన్ఫోటైన్మెంట్ కోసం), డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు మరియు ఆటో-హోల్డ్ ఫంక్షన్ؚతో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ؚలు వంటి GTX+ సంబంధిత ఫీచర్‌లను గమనించవచ్చు. GTX+లో ఉన్న ఇతర ఫీచర్‌లలో పనోరమిక్ సన్ؚరూఫ్, వైర్ؚలెస్ ఫోన్ ఛార్జింగ్, 8-వే పవర్డ్ డ్రైవర్ సీట్, రెయిన్-సెన్సింగ్ వైపర్‌లు మరియు 8-స్పీకర్‌ల బోస్ సౌండ్ సిస్టమ్ ఉన్నాయి.

    సంబంధించినది: సెల్టోస్ ఫేస్ؚలిఫ్ట్ వేరియెంట్-వారీ ఫీచర్‌లను వెల్లడించిన కియా  

    అందిస్తున్న మరింత భద్రత సాంకేతికత

    నవీకరించిన సెల్టోస్ؚలో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, హై-బీమ్ అసిస్ట్ మరియు డ్రైవర్ అటెంటివ్ؚనెస్ అలర్ట్ వంటి అడ్వాన్సెడ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS) ఫీచర్‌లను కియా అందిస్తోంది. ఆరు ఎయిర్ బ్యాగ్ؚలు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), ISOFIX చైల్డ్ సీట్ యాంకరేజ్ؚలు, 360-డిగ్రీ కెమెరా, ముందు మరియు వెనుక పార్కింగ్ సెన్సార్ؚలు వంటి భద్రత ఫీచర్‌లను ఈ SUV కొనసాగిస్తోంది.

    పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ؚల ఎంపిక 

    Kia Seltos facelift ADAS radar

    2023 సెల్టోస్ పెట్రోల్ మరియు డీజిల్ పవర్‌ట్రెయిన్ؚల ఎంపికను నిలుపుకుంది. హ్యుందాయ్ క్రెటా కాకుండా, డీజిల్ ఎంపికను అందిస్తున్న ఏకైక కాంపాక్ట్ SUVగా ఇది నిలుస్తుంది. దీని ఇంజన్-గేర్‌బాక్స్ కాంబోలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

    స్పెసిఫికేషన్ 

    1.5-లీటర్ పెట్రోల్

    1.5-లీటర్ టర్బో-పెట్రోల్

    1.5-లీటర్ డీజిల్

    పవర్ 

    115PS

    160PS

    116PS

    టార్క్ 

    144Nm

    253Nm

    250Nm

    ట్రాన్స్ؚమిషన్

    6-స్పీడ్ల MT, CVT

    6-స్పీడ్ల iMT, 7-స్పీడ్ల DCT

    6-స్పీడ్ల iMT, 6-స్పీడ్ల AT

    ఇది కూడా చూడండి: ఈ 15 చిత్రాలలో నవీకరించిన కియా సెల్టోస్ؚను వివరంగా చూడండి

     

    విడుదల అప్ؚడేట్ మరియు పోటీ 

    Kia Seltos facelift rear

    నవీకరించిన సెల్టోస్ؚను కియా అతి త్వరలోనే విడుదల చేస్తుందని ఆశిస్తున్నాము, దీని ప్రారంభ ధర సుమారు రూ.11 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండవచ్చు. హ్యుందాయ్ క్రెటాతోనే కాకుండా, ఈ నవీకరించిన SUV టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్, మారుతి గ్రాండ్ విటారా, MG ఆస్టర్, స్కోడా కుషాక్, వోక్స్వ్యాగన్ టైగూన్, మరియు రాబోయే సిట్రోయెన్ C3 ఎయిర్ؚక్రాస్ మరియు హోండా ఎలివేట్ؚలతో కూడా పోటీ పడుతుంది.

    ఇక్కడ మరింత చదవండి: కియా సెల్టోస్ డీజిల్ 

    was this article helpful ?

    Write your Comment on Kia సెల్తోస్

    సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

    *ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

    ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

    • లేటెస్ట్
    • రాబోయేవి
    • పాపులర్
    ×
    We need your సిటీ to customize your experience