కియా QYI మళ్ళీ రహస్యంగా మా కంట పడింది; మారుతి విటారా బ్రెజ్జా, హ్యుందాయి వెన్యూ ల యొక్క ప్రత్యర్ధి టెస్టింగ్ లో ఉంది
నవంబర్ 05, 2019 11:41 am sonny ద్వారా ప్రచురించబడింది
- 23 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
2020 చివరలో భారతదేశంలో ప్రారంభించబడే అవకాశం ఉంది
- కియా తన ఇండియా ప్రొడక్ట్ లైన్‌కు QYI అనే కోడ్‌నేం కలిగిన సబ్ -4m SUV ని జోడించనుంది.
- ఈ మోడల్ రూఫ్ రెయిల్స్ మరియు LED టెయిల్‌ల్యాంప్స్ మినహా మిగతా అంతా కవరింగ్ చేయబడి మాకు కనిపించింది.
- ఇది హ్యుందాయ్ వెన్యూ నుండి మెకానికల్స్ తీసుకోవచ్చని అంచనా.
- ఇది కనెక్ట్ చేయబడిన కార్ టెక్ మరియు ప్రీమియం సౌకర్యాలతో కూడిన ఖరీదైన సమర్పణ.
- అంచనా ప్రకారం 2020 మొదటి భాగంలో కార్నివాల్ MPV ప్రారంభం అయిన తరువాత ఇది ప్రారంభించబడుతుంది.
QYI అనే కోడ్‌నేం కలిగిన కియా యొక్క రాబోయే సబ్ -4m SUV, మరోసారి పరీక్ష చేయబడుతూ మా కంటపడింది. ఈ మారుతి విటారా బ్రెజ్జా ప్రత్యర్థి తన మెకానికల్స్‌ను హ్యుందాయ్ వెన్యూ తో పంచుకుంటారని, అదే సమయంలో స్పోర్టియర్ ప్రదర్శనను కలిగి ఉంటుందని భావిస్తున్నాము.
QYI ఇప్పటికీ ముసుగులోనే ఉంది మరియు టెస్ట్ మ్యూల్ రూఫ్ రెయిల్స్, షార్క్ ఫిన్ యాంటెన్నా మరియు దీర్ఘచతురస్రాకార టెయిల్ ల్యాంప్స్ తో గుర్తించబడింది, వీటిలో LED ఎలిమెంట్స్ ఉన్నాయి. మేము ఇంకా ముందు వైపు చూడనప్పటికీ, ఇది కియా యొక్క సిగ్నేచర్ టైగర్- నోస్ గ్రిల్‌ను LED హెడ్‌ల్యాంప్‌లతో కలిగి ఉంటుందని ఆశిస్తున్నాము.
కియా తన భారతీయ అరంగేట్రం సెల్టోస్ కాంపాక్ట్ SUV తో ప్రారంభమైన కొద్ది నెలల్లో గణనీయమైన విజయాన్ని సాధించింది. సెల్టోస్ దాని విభాగంలో ప్రీమియం ఎంపిక మరియు కార్ల తయారీదారు QYI సబ్ -4m SUV ని అదే విధంగా ఉంచే అవకాశం ఉంది. దీని ఫీచర్ జాబితాలో కనెక్ట్ చేయబడిన కార్ టెక్నాలజీ, 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు సన్‌రూఫ్ ఉన్నాయి.
ఇది హ్యుందాయ్ వెన్యూ నుండి 1.2-లీటర్ మరియు 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ల యొక్క BS 6 వెర్షన్ల ద్వారా పవర్ ని అందుకుంటుంది. 1.2-లీటర్ యూనిట్ 5-స్పీడ్ మాన్యువల్ తో జతచేయబడి ఉండగా, టర్బోచార్జ్డ్ యూనిట్ 6-స్పీడ్ మాన్యువల్ మరియు 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపికలతో లభిస్తుంది. కియా QYI లో అదే ఎంపికలు ఉంటాయని ఆశిస్తున్నాము. వెన్యూ ప్రస్తుతం 1.4-లీటర్ డీజిల్ తో ఉంది, అది సెల్టోస్ నుండి 1.5-లీటర్ యూనిట్ తో భర్తీ చేయబడుతుంది. QYI అదే 1.5-లీటర్ డీజిల్ ద్వారా పవర్ ని తీసుకుంటుంది.
కియాకు చెందిన సబ్-కాంపాక్ట్ SUV హ్యుందాయ్ వెన్యూ, మహీంద్రా XUV 300, ఫోర్డ్ ఎకోస్పోర్ట్, మారుతి సుజుకి విటారా బ్రెజ్జాతో పోటీ పడనుంది. QYI 2020 రెండవ భాగంలో భారతదేశానికి చేరుకుంటుంది.
మరింత చదవండి: వెన్యూ ఆన్ రోడ్ ప్రైజ్