నవీకరించబడిన ఎక్స్ ఎఫ్ వాహనాన్ని, 2016 ఆటో ఎక్స్పో వద్ద ప్రదర్శించిన జాగ్వార్

జాగ్వార్ ఎక్స్ కోసం sumit ద్వారా ఫిబ్రవరి 05, 2016 04:01 pm ప్రచురించబడింది

  • 17 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

మొదటి సారి ఈ ఆటో ఎక్స్పో గడ్డ పై బారీ మీడియా సిబ్బందిని తీసుకురాబోతున్నారు. అంతేకాకుండా, కార్దేఖొ ఈ ఆటో ఎక్స్పో 2016 లో అత్యంత విస్తృత వాహనాలను తీసుకొస్తుంది.

నవీకరించబడిన ఎక్స్ ఎఫ్ వాహనాన్ని, 2016 ఆటో ఎక్స్పో వద్ద జాగ్వార్ సంస్థ ప్రదర్శించింది. ఈ వాహనం, ఇదే విభాగం లో ఉండే ఆడి ఏ6, బిఎండబ్ల్యూ 5 సిరీస్ వంటి వాహనాలకు గట్టి పోటీ ను ఇస్తుంది. అంతేకాకుండా ఈ నవీకరించబడిన ఎక్స్ ఎఫ్ వాహనం, ఏడబ్ల్యూడి వేరియంట్ తో కూడా అందుబాటులో ఉంది. ఎవరైతే రహదారులపై సౌకర్య్వంతమైన డ్రైవ్ ను కావాలనుకుంటారో వారికి, ఈ వాహనం సరైనది అని చెప్పవచ్చు. ఈ ఆల్ వీల్ డ్రైవ్ లో, మొత్తం టార్క్ వెనుక చక్రాలకు పంపిణీ అవుతుంది. కానీ, ఈ పట్టును కోల్పోయినట్లైతే మొత్తం టార్క్ వాహనం యొక్క ముందు చక్రాలకు పంపిణీ అవుతుంది. ఇవే కాకుండా, వాహనం స్థిరంగా ఉండటం కోసం టార్క్, వాహనం యొక్క ముందు చక్రాలకు పంపిణీ అవుతుంది. అవసరమైతే ఈ వాహనానికి, ఏడబ్ల్యూడి అందించబడుతుంది. ఈ ఏడబ్ల్యూడి డ్రైవ్ ఇప్పటికే ఎఫ్ టైప్ వాహనానికి అందించబడింది. 

భారతదేశంలో ఇప్పటికే ఉన్న జాగ్వార్ ఎక్స్ ఎఫ్ వాహనం, సంస్థ యొక్క కొత్త తేలికపాటి అల్యూమినియం ఆర్కిటెక్చర్ ఆధారంగా రూపొందించబడింది. ముందు వెర్షన్ తో పోలిస్తే ఈ వాహనం, చాలా తేలికైనది మరియు దృడమైన నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఈ వాహనం, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, అత్యవసర బ్రేక్ అసిస్ట్, లేన్ డిపార్చర్ హెచ్చరిక, బ్లైండ్ స్పాట్ మోనిటోరింగ్, దగ్గరగా ఉన్న వాహన సెన్సింగ్, రివర్స్ ట్రాఫిక్ డిటక్షన్, ట్రాఫిక్ సైన్ రికగ్నైజేషన్, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ తో పాటు డ్రైవ్, ప్రయాణికుడి వైపు అలాగే సైడ్ మరియు కర్టైన్ ఎయిర్బాగ్లు వంటి అంశాలను అందించడం జరిగింది.

భారతదేశం లో ఉండే ఈ వాహనం, 2.0 లీటర్ పెట్రోల్, 2.2 లీటర్ మరియు 3.0 లీటర్ డీజిల్ ఇంజన్ లతో అందుబాటులో ఉంది. ముందుగా 2.2 లీటర్ డీజిల్ ఇంజన్ విషయానికి వస్తే, ఈ ఇంజన్ అత్యధికంగా 187 బి హెచ్ పి పవర్ ను అదే విధంగా 450 ఎన్ ఎం గల అధిక టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. మరోవైపు 3.0 లీటర్ డీజిల్ ఇంజన్ విషయానికి వస్తే, ఈ ఇంజన్ అత్యధికంగా 271 బి హెచ్ పి పవర్ ను అదే విధంగా 600 ఎన్ ఎం గల అధిక టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. మరోవీపు 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ విషయానికి వస్తే, అత్యధికంగా 237 బి హెచ్ పి పవర్ ను అదే విధంగా 340 ఎన్ ఎం గల అధిక టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ వాహనం భారతదేశంలో, రూ 49.2 లక్షలు ఎక్స్ షోరూం ముంబై వద్ద అందుబాటులో ఉంది.

ఈ జాగ్వార్ సంస్థ, ఆటోమొబైల్ కార్యక్రమం లో అనేక వాహనాలను ప్రదర్శించనుంది. ఎక్స్ ఈ మరియు ఎఫ్ ఫేస్ లతో పాటు కొత్త ఎక్స్ ఎఫ్ వంటి వాహనాలను వాహన ఔత్సాహికుల కోసం తీసుకురానుంది. 

ఇంకా చదవండి: జాగ్వార్ ఎక్స్ ఎఫ్ ఇండియా

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన జాగ్వార్ ఎక్స్

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిసెడాన్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience