ఇప్పుడు BS6 ఫేజ్2 నిబంధనలకు అనుగుణంగా వస్తున్న ఇసుజు పికప్ మరియు SUVలు

isuzu v-cross కోసం rohit ద్వారా ఏప్రిల్ 17, 2023 04:49 pm ప్రచురించబడింది

  • 50 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ప్రస్తుతం ఈ మూడు కార్‌లు కొత్త “వాలెన్సియా ఆరెంజ్” రంగులో కూడా అందుబాటులో ఉన్నాయి

Isuzu V-Cross, Hi-Lander and mu-X

  • ఈ మూడు కార్‌లలో ఉమ్మడి ఫీచర్ నవీకరణలలో ఐడిల్-ఇంజన్ స్టార్ట్/స్టాప్ మరియు కొత్త రకం టైర్‌లు ఉన్నాయి. 

  • V-క్రాస్ 4x2 ATలో అందిస్తున్న కొత్త ఫీచర్‌లలో హిల్ డిసెంట్ కంట్రోల్, క్రూజ్ కంట్రోల్ మరియు ESC ఉన్నాయి. 

  • ప్రస్తుత నవీకరణలో Mu-X రీడిజైన్ చేసిన గ్రిల్‌ను మాత్రమే పొందింది. 

  • హై-ల్యాండర్ؚలో ఆటో AC మరియు వెనుక డిఫోగ్గర్‌లను ఇసుజు అందిస్తోంది. 

  • ఈ మూడు కార్‌లు 1.9-లీటర్ డీజిల్ ఇంజన్‌తో వస్తాయి; 4x4 మరియు AT కేవలం V-క్రాస్ మరియు mu-Xతో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. 

BS6 ఫేజ్ 2-అనుకూల వెర్షన్‌లను భారతదేశ లైన్అప్‌కు ఇసుజు పరిచయం చేసింది: రెండు పికప్ؚలు (V-క్రాస్, హై-ల్యాండర్) మరియు mu-X SUV. ఈ మూడు కార్‌లలో లుక్ పరంగా తేలికపాటి మార్పులు మరియు ఫీచర్ నవీకరణలు అందించబడ్డాయి. ఇప్పుడు వీటిని పరిశీలిద్దాం: 

ఉమ్మడి నవీకరణలు

Isuzu V-Cross Valencia Orange shade

ఈ మూడు మోడల్‌లలో కారు తయారీదారు తాజా “వాలెన్షియా ఆరెంజ్” పెయింట్ షెడ్‌ను అందిస్తున్నారు. కొత్త పెయింట్ ఎంపిక మాత్రమే కాకుండా, రెండు పికప్‌లు మరియు SUV ఇంధన సామర్ధ్యం మెరుగుపరిచేందుకు మరియు ఉద్గారాలను తగ్గించేందుకు ఆటోమ్యాటిక్ ట్రాన్స్ؚమిషన్ (AT) కోసం ఇప్పుడు ఐడిల్-ఇంజన్ స్టార్ట్/స్టాప్, లో ఫ్రిక్షన్ టైర్‌లు మరియు ఫ్లూయిడ్ వార్మర్ؚతో వస్తాయి. 

ఈ మూడు కార్‌లలో మార్పులు

Isuzu V-Cross cabin
Isuzu V-Cross brown seats

V-క్రాస్

హై-ల్యాండర్

mu-X

  • క్రూజ్ కంట్రోల్ 
  • కొత్తగా డిజైన్ చేసిన నలుపు రంగు అలాయ్ వీల్స్ 
  • గ్రే ఫినిష్ కలిగిన ORVMలు 
  • ముందు ఫాగ్ ల్యాంప్ గార్నిష్ 
  • టు-టోన్ బ్రౌన్ అపోలిస్ట్రీ 
  • డ్యాష్ؚబోర్డు పై, డోర్ ప్యాడ్ؚలు మరియు గేర్ సెలక్టర్ లివర్ చుట్టూ బ్రౌన్ ఇన్సర్ట్ؚలు
  • ట్రాక్షన్ కంట్రోల్ 
  • ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC)
  • హిల్-డిసెంట్ కంట్రోల్ 
  • హిల్ స్టార్ట్ అసిస్ట్ 
  • ఆటో క్లైమేట్ కంట్రోల్ 
  • వెనుక డిఫోగ్గర్ 
 
  • నవీకరించబడిన గ్రిల్ 

కొత్త ఫీచర్‌ల పరంగా నవీకరణలు V-క్రాస్అప్ Z 4X2 ఆటోమ్యాటిక్ వేరియెంట్‌లో అందిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది, హై-ల్యాండర్ మరియు mu-Xలలో చెప్పుకోదగిన మార్పులు లేవు. 

ఇది కూడా చదవండి: సల్మాన్ ఖాన్ కొత్త చిత్రంలో భారీ సంఖ్యలో కనిపించనున్న నలుపు రంగు SUVలు

పవర్ؚట్రెయిన్ వివరాలు

ఈ మూడు కార్‌లు 1.9-లీటర్ డీజిల్ యూనిట్‌తో(163PS/360Nm) అందిస్తున్నారు. ఈ మూడిటిలో కేవలం V-క్రాస్ మోడల్ మాత్రమే 6-స్పీడ్ MT మరియు 6-స్పీడ్ AT గేర్ؚబాక్స్ ఎంపికలతో వస్తుంది. Mu-X కేవలం రెండవ ఎంపికతో మాత్రమే వస్తుంది, హై-ల్యాండర్‌ను మాన్యువల్ ట్రాన్స్ؚమిషన్ؚతో అందించబడుతుంది. హై-ల్యాండర్ కేవలం 4x2 డిజైన్‌తో వస్తుంది, మిగిలిన రెండు 4x2 మరియు 4x4 వెర్షన్‌లలో వస్తాయి. 

ఇది కూడా చదవండి: మార్చి 2023లో అత్యంత ప్రజాదరణ పొందిన 10 కార్‌ల వివరాలు

ధర శ్రేణి మరియు పోటీ

Isuzu Hi-Lander
Isuzu mu-X

నవీకరించబడిన V-క్రాస్ ధర రూ.23.50 లక్షల నుండి ప్రారంభం అవుతుంది, హై-ల్యాండర్‌ ధర రూ.19.50 లక్షలుగా ఉంది. మరొక వైపు, mu-X ప్రారంభ ధర రూ.37.90 లక్షలుగా ఉంది. ఇసుజు పికప్ జంట టయోటా హైలక్స్ؚకు చవకైన ప్రత్యామ్నాయం మరియు టయోటా ఫార్చ్యూనర్ మరియు MG గ్లోస్టర్ؚలతో పోటీ పడుతుంది. 

అన్నీ ఎక్స్-షోరూమ్ చెన్నై ధరలు

ఇక్కడ మరింత చదవండి : V-క్రాస్ డీజిల్

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన ఇసుజు v-cross

Read Full News

explore similar కార్లు

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉందిపికప్ ట్రక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience