• login / register

ఇసుజు డి-మాక్స్ వి క్రాస్ 2016 ఆటో ఎక్స్పోలో ప్రదర్శించబడింది c

published on ఫిబ్రవరి 03, 2016 03:51 pm by nabeel

  • 10 సమీక్షలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

మైదానంలో పెద్ద మీడియా సిబ్బంది తో # first2expo- ఆటో ఎక్స్పో 2016 యొక్క విశేషాలని కార్దేఖో అందరికీ విసృతంగా అందిస్తుంది.

D Max

ఇసుజు కొనసాగుతున్న 2016 ఆటో ఎక్స్పోలో దాని డి-మాక్స్ పికప్ ట్రక్ ని ప్రదర్శించింది. ఈ పికప్ ట్రక్ దాని సామర్థ్యాలతో ముఖ్యంగా కస్టమైన భూభాగాలలో ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రజాదరణ పొందింది. ఇది భారతదేశం లో ఎస్యూవీ MU-7 తరువాత ఇసుజు యొక్క రెండవ ఉత్పత్తి, ఇసుజు డి-మాక్స్ పికప్ సింగిల్ కాబ్, స్పేస్ క్యాబ్ ఫ్లాట్ డెక్ మరియు స్పేస్ క్యాబ్ ఆర్చ్ డెక్ అని మూడు నమూనాలు శ్రేణిని కలిగి ఉంది. ఇది టాటా జెనాన్ మరియు మహీంద్రా సంస్థ చే ఇటీవల ప్రారంభించబడిన ఇంపీరియో తో పోటీ పడుతుంది.

D Max side view

ఇసుజు డి-మాక్స్ 2.5 లీటర్, 4-సిలిండర్ ఇంటర్కూల్ టర్బోచార్జెడ్ డీజిల్ ఇంజిన్ తో అమర్చబడి 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వ్యవస్థతో జతచేయబడి ఉంటుంది. ఈ రెండిటి కలయికతో ఈ వాహనం 3600rpm వద్ద 134bhp శక్తిని మరియు1,800-2,800rpm వద్ద 320Nm టార్క్ ని అందిస్తుంది. డి-మాక్స్ బరువైన చట్రం మరియు అధిక తన్యత స్టీల్ శరీర నిర్మాణంతో నిర్మించబడింది. ఇది 1.2 టన్నుల గరిష్టంగా లోడ్ తీసుకునేందుకు అనుమతిస్తుంది.

D Max interiors

డి-మాక్స్ లైనప్, దేశంలో వారి ప్రారంభ ప్రవేశం పోస్ట్ గురించి మాట్లాడుతూ, ఇసుజు మోటార్స్ ఇండియా, మేనేజింగ్ డైరెక్టర్, మిస్టర్ నహిరో యమగుచి మాట్లాడుతూ " ఈ కొత్త ఇసుజు డి-మాక్స్ వేరియంట్ల రోల్ అవుట్ తో, మేము మా వినియోగదారులకు ఎంచుకోవడానికి ఎంపికలు అందించడం ద్వారా నిర్దిష్ట అవసరాలను మరియు వివిధ వ్యాపారాల అర్హతలను అందిస్తున్నాము. భారతదేశంలో కఠినమైన వేడి మరియు అలసిపోయే పరిస్థితుల్లో, ఆధునిక వినియోగదారులు వారి డ్రైవర్లకు కూడా ఉత్పాదకత పంచే సౌకర్య లక్షణాలు కోసం చూస్తున్నారు. ఎయిర్ కండీషనింగ్ తో డి-మాక్స్ పరిపూర్ణ ఎంపికగా ఉంటుంది. మరోవైపు, క్యాబ్-చాసిస్ వేరియంట్ వినియోగదారులకు వారి బరువును శరీరం ఆకృతీకరణ ఎంచుకోవడంలో మరియు విలువను పెంచడంలో వశ్యత అందించే ఒక పరిపూర్ణ భాగస్వామి. ఇది ఒక ప్రాముఖ్యమైన అభివృద్ధి మరియు పికప్ విభాగంలో మా ఉత్పత్తి యొక్క పొడిగింపు అందించి వినియోగదారులకు 'గో మోర్, డు మోర్ మరియు గెట్ మోర్ ' ని చేరుకొనేలా చేస్తుంది.

ఒక ప్రకటనలో సంస్థ, " D-MAX యొక్క ప్రత్యేక లక్షణం విలువైన / పెళుసైన వస్తువుల నిల్వ చేసే డ్రైవర్ సీటు వెనుక 1.5 అడుగుల క్యాబిన్ స్థలం విస్తరిస్తుంది. ఇది వర్ స్టీరింగ్, పవర్ విండోస్, కేంద్రీకృత డోర్ లాక్, తదితర ముఖ్యమైన లక్షణాలను వ్యవసాయం, రిటైల్, డైరీ, ఇంజనీరింగ్, తయారీ మరియు చిన్న వ్యాపారాలు వంటి పరిశ్రమల్లో వాణిజ్య ఉపయోగం కోసం ఆదర్శంగా ఉంటుంది." అని తెలిపింది.

ప్రైవేట్ రిజిస్ట్రేషన్ రూ. 15 లక్షల ధరకి చేయబడుతుంది మరియు వాహనం 2016 మధ్యకాలం నాటికి అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు.

ఇసుజు డి-మాక్స్ యొక్క ప్రదర్శన వీడియో చూడండి

  • New Car Insurance - Save Upto 75%* - Simple. Instant. Hassle Free - (InsuranceDekho.com)
  • Sell Car - Free Home Inspection @ CarDekho Gaadi Store
ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News
×
మీ నగరం ఏది?