నెక్స్ట్-జెన్ ఇసుజు D-మాక్స్ పికప్ వెల్లడి
ఇసుజు డి-మాక్స్ v-cross 2019-2021 కోసం sonny ద్వారా అక్టోబర్ 18, 2019 12:27 pm సవరించబడింది
- 25 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
కొత్త ఇంజిన్, రీ-డిజైన్ ఎక్స్టీరియర్ స్టైలింగ్ మరియు సరికొత్త డాష్‌బోర్డ్ లేఅవుట్‌ను పొందుతుంది
- థాయ్‌లాండ్‌లో ఆవిష్కరించబడిన కొత్త D-మాక్స్ పికప్ చుంకియర్, మరింత అగ్రసివ్ స్టైలింగ్‌ను పొందుతుంది.
- కొత్త 3.0-లీటర్ డీజిల్ ఇంజన్ ను ప్రారంభించింది, ఇది యూరో 6 / BS 6- నారంస్ కి అనుగుణంగా ఉంటుంది.
- కొత్త డాష్‌బోర్డ్ లేఅవుట్ మరియు కన్సోల్ కంట్రోల్స్ తో పునర్నిర్మించిన క్యాబిన్.
- పునర్నిర్మించిన కారు యొక్క బాడీ పెద్దదే కానీ భారతదేశంలో ఉన్న ప్రస్తుత D-మాక్స్‌తో పోలిస్తే చిన్నది.
- ఇది 2020 చివరిలో లేదా 2021 ప్రారంభంలో భారతదేశానికి చేరుకుంటుంది.
ఇసుజు D-మాక్స్ భారత ఆటోమోటివ్ మార్కెట్ లో ఒక ప్రత్యేకమైన సమర్పణ. V-క్రాస్ పికప్ ట్రక్ బాగా అమర్చిన మోడల్, ఇది దాని క్యాబిన్ లో ఐదుగురిని కూర్చోబెట్టుకొనే విధంగా ఉంటుంది మరియు ఆటోమేటిక్ ఆప్షన్ తో కూడా వస్తుంది. ఇప్పుడు, తరువాతి తరం D-మాక్స్ థాయ్‌లాండ్‌లో ఆవిష్కరించబడింది.
ఇసుజు స్టైలింగ్‌పై మాత్రమే కాకుండా, కొత్త D-మాక్స్ యొక్క బాడీ మరియు నిర్మాణంలో కూడా బాగా పనిచేసింది. కొత్త D-మాక్స్ పికప్ (క్రూ క్యాబ్ హై-రైడ్ వేరియంట్) యొక్క ఖచ్చితమైన కొలతలు ఇవి:
న్యూ ఇసుజు D-మ్యాక్స్ |
ఇసుజు D-మ్యాక్స్ |
|
పొడవు |
5265mm |
5295mm |
వెడల్పు |
1870mm |
1860mm |
ఎత్తు |
1790mm |
1855mm |
వీల్బేస్ |
3125mm |
3095mm |
టైర్లు |
265/60R18 |
255/60R18 |
కొత్త-జెన్ D-మాక్స్ 10 మిమీ వెడల్పు మరియు వీల్‌బేస్ 130mm పొడవు, ఎత్తు 65mm తక్కువగా ఉంటుంది. ఇది మొత్తం పొడవులో 30mm తగ్గిపోయింది, ఇది D-మాక్స్ యొక్క కొత్త స్టైలింగ్‌కు జమ అవుతుంది.
కొత్త బోనెట్ పొడవైనది మరియు ప్రస్తుత-జెన్ మోడల్ కంటే పెద్ద గ్రిల్, కొత్త హెడ్లైట్లు మరియు కొత్త ఫ్రంట్ బంపర్ తో చదునుగా ఉంటుంది. ఇది ఫోర్డ్ పికప్ ట్రక్ లాగా మునుపటి కంటే చాలా అగ్రసివ్ గా మరియు దృఢంగా కనిపిస్తుంది. దీని వెనుక భాగం కొత్త టైల్లైట్స్ మరియు ఇంటిగ్రేటెడ్, బాడీ-కలర్ రియర్ అప్‌డేట్ చేయబడింది. వెనుక భాగం విషయానికి వస్తే గేట్ మారలేదు.
కొత్త D-మాక్స్ యొక్క క్యాబిన్ కొత్త డాష్‌బోర్డ్ లేఅవుట్, కొత్త స్టీరింగ్ వీల్ మరియు కొత్త ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో కూడా పునరుద్ధరించబడింది. ఇది కొత్త AC వెంట్స్ మరియు హారిజాంటల్ లేవుట్ తో క్లైమేట్ కంట్రోల్స్, BMW కంట్రోల్స్ లో ఉన్నట్టుగా కూడా దీనిలో కనిపిస్తుంది. కొత్త స్టీరింగ్ వీల్ స్పోర్టియర్ మరియు మరింత ఖరీదైనదిగా కనిపిస్తుంది, స్టీరింగ్-మౌంటెడ్ నియంత్రణల కోసం కొత్త లేఅవుట్ ఉంది. ఇది ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌లో 4.2-అంగుళాల డిజిటల్ మల్టీ-ఇన్ఫర్మేషన్ కలర్ డిస్‌ప్లేను పొందుతుంది. గేర్-సెలెక్టర్ లివర్ కూడా రీ-డిజైన్ చేయబడింది.
ఇసుజు కోసం పవర్‌ట్రైన్‌లను కూడా అప్‌డేట్ చేసారు. ఇది ప్రస్తుతం రెండు BS 4 డీజిల్ ఇంజన్లతో అందించబడింది , అవి 1.9-లీటర్ యూనిట్ మరియు 2.5-లీటర్ ఇంజన్. చిన్న ఇంజిన్ 6-స్పీడ్ AT తో జతచేయబడుతుంది, పెద్ద ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్‌తో జతచేయబడుతుంది. రెండూ ప్రామాణికంగా స్విచ్-ఆన్-ది-ఫ్లై సామర్థ్యంతో 4WD తో వస్తాయి. BS 6 యుగంలో (ఏప్రిల్ 2020 తరువాత), 1.9-లీటర్ ఇంజన్ మాత్రమే ముందుకు వెళుతుంది.
థాయ్‌లాండ్‌లో, కొత్త D-మాక్స్ ఇసుజు mu-X SUV లో కనిపించే అదే పవర్ యూనిట్ ఆధారంగా కొత్తగా అభివృద్ధి చేసిన 3.0-లీటర్ డీజిల్ ఇంజిన్‌ను పొందుతుంది. ఇది మునుపటి కంటే చాలా శక్తివంతమైనది, మరింత టార్క్ ని అందిస్తుంది మరియు యూరో 6.2 ఎమిషన్ నిబందనలకి అనుగుణంగా ఉండే అవకాశం ఉంది, ఇవి BS6 ప్రమాణాల కంటే కఠినమైనవి. భారతదేశంలో నెక్స్ట్-జెన్ D-మాక్స్ 1.9-లీటర్ డీజిల్ ఇంజిన్ యొక్క BS 6 వెర్షన్ లో పొందుతుందని భావిస్తున్నాము, కొత్త 3.0-లీటర్ డీజిల్ ఇండియా-స్పెక్ mu-X లో మనకి కనపడుతుంది.
ఇక్కడ V-క్రాస్ అని పిలువబడే D-మాక్స్ దాని క్రూ క్యాబ్ అవతార్‌లో 7- లేదా 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ప్లే, ఆటో హెడ్‌ల్యాంప్‌లు మరియు డ్యూయల్- జోన్ AC వంటి లక్షణాలు ఉన్నాయి. ఇది ఇటీవలి ఎయిర్‌బ్యాగులు, LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు మరియు లెదర్ అప్హోల్‌స్టరీని దాని ఇటీవలి ఇండియా-స్పెక్ ఫేస్‌లిఫ్ట్‌లో పొందుతుంది.
D-మాక్స్ ఫేస్‌లిఫ్ట్ ఇటీవలే భారతదేశంలో ప్రవేశపెట్టబడిందని మరియు 1.9-లీటర్ డీజిల్ 2020 ఏప్రిల్ నాటికి BS 6 నిబంధనల కోసం అప్‌డేట్ అవుతుందని భావిస్తున్నందున, కొత్త-జెన్ మోడల్ ఇప్పటిలో ఇక్కడకు వచ్చే అవకాశం లేదు. ఇది 2020 చివరిలో లేదా 2021 ప్రారంభంలో ఇక్కడ ప్రవేశపెట్టబడుతుంది, అదే ధర రూ .17 లక్షల నుండి 21 లక్షల ఎక్స్-షోరూమ్ వరకు ఉంటుంది.
మరింత చదవండి: D-మాక్స్ V-క్రాస్ డీజిల్