భారతదేశంలో రూ. 1.14 కోట్లతో ప్రారంభమైన Audi Q8 e-tron
ఆడి క్యూ8 ఇ-ట్రోన్ కోసం shreyash ద్వారా ఆగష్టు 23, 2023 03:37 pm సవరించబడింది
- 6.5K Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
నవీకరించబడిన లగ్జరీ ఎలక్ట్రిక్ SUV రెండు వాహన రకాలు మరియు పెద్ద బ్యాటరీ ప్యాక్‌లతో అందించబడుతుంది, ఇది 600కిమీల పరిధిని అందిస్తుంది.
- ఈ ఎలక్ట్రిక్ SUV బుకింగ్‌లు రూ. 5 లక్షల నుండి ప్రారంభమయ్యాయి.
- ప్రస్తుతం ఇది రెండు పెద్ద బ్యాటరీ ప్యాక్ ఎంపికలతో వస్తుంది: అవి వరుసగా 89 kWh మరియు 114kWh, సుమారుగా 600కిమీల పరిధిని అందిస్తోంది.
- నవీకరించబడిన ఈ ఎలక్ట్రిక్ SUV ఇప్పుడు దాని దిగువ శ్రేణి ఈ-ట్రాన్ 50 వేరియంట్‌తో కూడా మరింత శక్తిని అందిస్తుంది.
- ఇది, రెండు వేరియంట్‌లలో అలాగే రెండు బాడీ స్టైల్స్‌లో అందుబాటులో ఉంది: SUV మరియు స్పోర్ట్‌బ్యాక్ (SUV-కూపే)
- ప్రస్తుతం అందుబాటులో ఉన్న దాని కంటే నవీకరించబడినది రూ. 12 లక్షల ప్రీమియం ధరతో ప్రారంభమవుతుంది.
ఆడి క్యూ8 ఈ-ట్రాన్ ఫేస్‌లిఫ్ట్ రూ. 1.14 కోట్ల (ఎక్స్-షోరూమ్ పాన్ ఇండియా) ప్రారంభ ధరతో మార్కెట్‌లోకి ప్రవేశించింది. జోడించిన "Q8" ఉపసర్గతో, ఎలక్ట్రిక్ SUV ఇప్పుడు ఆడి SUVల ఫ్లాగ్‌షిప్ లైనప్‌లో దాని స్థానాన్ని ఆక్రమించింది. తయారీ సంస్థ ఇప్పటికే రూ. 5 లక్షల టోకెన్ మొత్తానికి బుకింగ్ లను ప్రారంభించింది.
మునుపటిలాగా, Q8 ఈ-ట్రాన్ రెండు వేరియంట్‌లలో అందించబడుతుంది: అవి వరుసగా Q8 ఈ-ట్రాన్ 50 మరియు Q8 ఈ-ట్రాన్ 55 అలాగే రెండు బాడీ స్టైల్స్: SUV మరియు స్పోర్ట్‌బ్యాక్ (SUV-కూపే). వాటి ధరలు క్రింద వివరించబడ్డాయి.
ధర పట్టిక
వేరియంట్ |
ధర |
Q8 ఈ-ట్రాన్ 50 |
రూ.1.14 కోట్లు |
Q8 ఈ-ట్రాన్ 55 |
రూ.1.18 కోట్లు |
క్యూ8 ఈ-ట్రాన్ 50 స్పోర్ట్‌బ్యాక్ |
రూ.1.26 కోట్లు |
క్యూ8 ఈ-ట్రాన్ 55 స్పోర్ట్‌బ్యాక్ |
రూ.1.31 కోట్లు |
అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ పాన్ ఇండియా
సొగసైన లుక్స్
Q8 ఈ-ట్రాన్ ఎలక్ట్రిక్ SUV ఇప్పటికీ గుర్తించదగినదిగా ఉంది కానీ ఫేస్‌లిఫ్ట్‌తో, ఇది ప్రస్తుతం మునుపటి కంటే సొగసైనదిగా కనిపిస్తుంది. రెండు హెడ్‌లైట్‌ల మధ్య, గ్రిల్ పైభాగంలో DRL స్ట్రిప్‌తో, నవీకరించబడిన ఆడి లోగోను కలిగి ఉన్న కొత్త గ్రిల్ డిజైన్‌తో ముందు భాగం నవీకరించబడింది. ఇది ఇప్పటికీ సైడ్ మరియు వెనుక నుండి మునుపటి ఈ-ట్రాన్‌ను పోలి ఉంటుంది, కానీ ఇప్పుడు కొత్త అల్లాయ్ వీల్స్ మరియు నవీకరించబడిన ఫ్రంట్ అలాగే రియర్ బంపర్‌లను పొందింది.
ఇవి కూడా చదవండి: 2023 మెర్సిడెస్ బెంజ్ GLC vs ఆడి Q5, BMW X3, వోల్వో XC60: ధర పోలిక
ఇంటీరియర్ & ఫీచర్లు
లోపల భాగం విషయానికి వస్తే, డాష్‌బోర్డ్ లేఅవుట్ దాని ముందు వాహనం మాదిరిగానే ఉంది, కానీ క్యాబిన్ ఇప్పటికీ ఖరీదైనదిగా కనిపిస్తుంది. ఈ SUV మూడు అంతర్గత రంగు ఎంపికలతో అందించబడుతుంది: అవి వరుసగా ఒకపి బ్రౌన్, పెరల్ లేత గోధుమరంగు మరియు నలుపు. ఇది ట్రై-స్క్రీన్ సెటప్‌ను కలిగి ఉంది, ఇందులో 12.3-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, 10.1-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్ మరియు వివిధ వాతావరణ నియంత్రణల కోసం ప్రధాన ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ దిగువన 8.6-అంగుళాల టచ్‌స్క్రీన్ లు ఉన్నాయి.
Q8 ఈ-ట్రాన్ ఇంకా నాలుగు-జోన్ క్లైమేట్ కంట్రోల్, మసాజ్ ఫంక్షన్‌తో పవర్-అడ్జస్టబుల్ మరియు వెంటిలేటెడ్ సీట్లు, 705W అవుట్‌పుట్‌తో 16-స్పీకర్ బ్యాంగ్ మరియు ఓలుఫ్సెన్ 3-D సౌండ్ సిస్టమ్, యాంబియంట్ లైటింగ్, క్రూజ్ కంట్రోల్, పార్క్ అసిస్ట్ మరియు పనోరమిక్ సన్‌రూఫ్ వంటి అంశాలు అందించబడ్డాయి. భద్రత పరంగా, ఇందులో 8 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా, అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) మరియు ISOFIX చైల్డ్ సీట్ యాంకర్లు ఉన్నాయి.
బ్యాటరీ, ఎలక్ట్రిక్ మోటార్ & పరిధి
ఆడి Q8 ఈ-ట్రాన్ పెద్ద బ్యాటరీ ప్యాక్ ఎంపికలతో అందించబడుతోంది మరియు దిగువ పట్టికలో వివరించిన విధంగా వాటి పరిధి మరియు పనితీరు మారుతూ ఉంటాయి.
స్పెక్స్ |
Q8 ఈ-ట్రాన్ 50 |
Q8 ఈ-ట్రాన్ 55 |
బ్యాటరీ ప్యాక్ |
89kWh |
114kWh |
పవర్/టార్క్ |
340PS / 664Nm |
408PS / 664Nm |
విద్యుత్ మోటారు |
డ్యూయల్-మోటార్, ఆల్-వీల్ డ్రైవ్ |
డ్యూయల్-మోటార్, ఆల్-వీల్ డ్రైవ్ |
క్లెయిమ్ చేసిన పరిధి |
419 కిమీ/ 505 కిమీ (స్పోర్ట్ బ్యాక్) |
582 కిమీ/ 600 కిమీ (స్పోర్ట్ బ్యాక్) |
ఈ రెండు బ్యాటరీ ప్యాక్‌లు పెద్దవిగా నవీకరణను పొందడం గమనించదగ్గ విషయం, ఎలక్ట్రిక్ మోటార్లు కూడా ఎక్కువ పనితీరును అందిస్తాయి. Q8 ఈ-ట్రాన్ ఇప్పుడు పెద్ద 114 kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. అలాగే 600 km వరకు WLTP-క్లెయిమ్ చేసిన పరిధిని అందిస్తుంది. ఇంతకుముందు, ఈ-ట్రాన్ 71kWh మరియు 95kWh బ్యాటరీ ప్యాక్‌లతో అందించబడేది, ఇది 484km వరకు పరిధిని అందించేది.
ఛార్జింగ్ వివరాలు
ఈ ఎలక్ట్రిక్ SUV 170kW DC ఫాస్ట్ ఛార్జింగ్ మరియు 22kW వరకు AC ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. మునుపటి ఫాస్ట్ ఛార్జింగ్ పద్ధతిని ఉపయోగించి, బ్యాటరీని 31 నిమిషాల్లో 10 నుండి 80 శాతం వరకు పునరుద్ధరించవచ్చు, అయితే ప్రస్తుతం 20 నుండి 80 శాతం రీఛార్జ్ చేయడానికి కేవలం 26 నిమిషాలు మాత్రమే పడుతుంది. అయితే, బ్యాటరీ ఉష్ణోగ్రత మరియు పరిస్థితులను బట్టి ఛార్జింగ్ సమయాలు మారవచ్చు.
ప్రత్యర్థులు
ఆడి Q8 ఈ-ట్రాన్ భారతదేశం యొక్క లగ్జరీ ఎలక్ట్రిక్ SUV స్పేస్‌లో BMW iX మరియు జాగ్వార్ ఐ-పేస్ తో దాని పోటీని కొనసాగిస్తోంది.
మరింత చదవండి : Q8 ఈ-ట్రాన్ ఆటోమేటిక్
0 out of 0 found this helpful